ఇంతకాలం భవిష్యత్‌లో లంచాలు లేకుండా ఎలా నిర్మూలించాలనే దానిపైనే దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు... తీసుకున్న లంచాలను లబ్ధిదారులకు తిరిగి ఇప్పించే సరికొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

టెక్నాలజీ... ఆధునిక పరిపాలనా వ్యవస్థలో పాలకులకు ఒక అస్త్రం. సమస్యలకు ఒక సులభ పరిష్కార వినియోగ వ్యవస్థ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాల్ సెంటర్లు అవినీతి అధికారుల పై ప్రజలు నేరుగా ఘుళిపించే కొరడాగా మారుతున్నాయి.

'ప్రజలే ముందు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించిన 1100 కాల్ సెంటర్ వల్ల ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతున్నాయి. వివిధ అవసరాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తున్న లబ్దిదారులకు అక్కడక్కడా అవినీతి జాడ్యం తప్పడం లేదన్నది ప్రభుత్వం ప్రారం భించిన పరిష్కార వేదిక దృష్టికి వస్తుంది. బుధవారం ఒక్క రోజే 12 మంది లబ్దిదారులు, అధికారులకు, దళారులకు లంచం రూపంలో చెల్లించిన నగదును ముక్కపిండి వసూలు చేసి వెనుకకు తిరిగి అప్పగించేలా రియల్ టైం గవర్నెన్స్ విభాగం ఒక కొత్త ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించింది.

1100 పేరుతో ముఖ్యమంత్రి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ప్రారంభించిన కాల్ సెంటర్ నంబర్ చురుగ్గా పని ప్రారంభించింది. మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మొత్తం 23,827 ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే రేషన్ పెన్షన్, చంద్రన్న భీమా పధకం లభ్దిదారుల స్పందన తెలుసుకోడానికి ఈ కాల్ సెంటర్ నుంచి భారీగా ఫోన్ కాల్స్ చేస్తే అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

చంద్రన్న బీమా గురించి తెలుసుకోవటానికి 50 వేల పైగా కాల్స్, రేషన్ సంబంధించి తొమ్మిది లక్షలకు పైగా, పెన్షన్ల గురించి 6 లక్షలు, మిర్చి సమస్య పై 20వేలకు పై గా ఫోన్ కాల్స్, కాల్ సెంటర్ నుంచి లబ్దిదారులకు వెళ్ళాయి. లంచం పై వచ్చిన ఫిర్యాదులను తెలుసుకోడానికి కాల్ సెంటర్ ప్రతినిధులు మూడు వేలకు పైగా కాల్స్ చేశారు. ఇలా చేసిన ఫోన్ కాల్స్ వల్ల నిన్న ఒక్క రోజే 12మంది లబ్దిదారులు, అధికారులకు తామిచ్చిన లంచాలను వెనక్కి పొందేలా చేయడంలో రియల్ టైం గవర్నెన్స్ బృందం అధికారులు సక్సెస్ అయ్యారు.

కర్నూలు జిల్లాలో ఓ మహిళ పింఛను కోసం పంచాయతీ కార్యదర్శికి 500 రూపాయలు లంచం ఇచ్చినట్టు తెలియడంతో ఆ లంచం డబ్బును ఆ అధికారి నుంచి 1100 రియల్ టైం గవర్నెన్స్ బృందం వాసులు చేయించి తిరిగి ఆ లభ్దిదారునికి చెల్లించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమెకే కాకుండా మరో 10 మంది లభ్దిదారులకు లంచం డబ్బు ఆ అధికారి వెనిక్కి ఇచ్చేశారు.

కడప జిల్లలో మరో పించనుదారురాలు ఒక దళారికి 1000 రూపాయలు లంచం ఇవ్వగా 1100 కాల్ సెంటర్ పసిగట్టి ఆ లంచం డబ్బు వెనక్కి ఇప్పించింది.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పౌరుడు, డెత్ క్లెయిమ్ పరిష్కారం కోసం 500 రూపాయలు లంచం రూపంలో ఇస్తే దాన్ని కూడా ఆ లంచం తీసుకున్న వ్యక్తి నుంచి తిరిగి ఆ పౌరుడికి ఇప్పించారు.

"1100 నంబరుకు ఏ ఫిర్యాదైనా చేయొచ్చని, ఫిర్యాదులపై విచారణ జరిపాకే చర్యలు తీసుకుంటాం. రాజకీయ అవినీతి కూడా సహించేది లేదు. 1100 నంబరుకు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజలు సమాచారమివ్వాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read