ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందించినందుకు దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రంగంలో ఇచ్చే స్కాచ్ ప్లాటినం అవార్డుతో పాటు ఆరు అవార్డులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కైవసం చేసుకుంది. ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజా వైద్య సేవలకు కాన్-స్టిట్-ట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అందించే అవార్డులను ఏకంగా 6 విభాగాల్లో ప్లాటినం అవార్డులను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ దక్కించుకోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.

ఇన్వెంటరీ మేనేజ్మెంట్ విభాగంలో ఈ-ఔషధికి, బయో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, స్వాస్య విద్యావాహిని పథకానికి, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు, ఉచిత వ్యాధి నిర్ధారణలో భాగంగా అమలు చేస్తున్నఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకానికి గాను మొత్తం ఆరు విభాగాల్లో ప్లాటినం అవార్డులను గెలుచుకోవడం జరిగింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై నిపుణుల కమిటీ జాతీయ స్థాయిలో సర్వేలు నిర్వహించి, ఇచ్చిన నివేదికల ఆధారంగా ఉత్తమ సేవలు అందించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ప్లాటినం అవార్డులను అందించం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇన్వెంటరీ మేనేజ్మెంట్ రంగంలో ఇచ్చే ప్లాటినం అవార్డు ఈ ఏడాది ఏపీకి దక్కడంపై సర్వత్రా హర్జాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో 1.50 లక్షల మందికి ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం క్రింద ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో 222 ముఖ్యమంత్రి అర్బన్ హెల్త్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన టీడీపీ ప్రభుత్వం దాదాపు 127 యూహెచ్సీలను కూడా ప్రారంభించి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తోంది.

ప్రజారోగ్య భద్రతకు పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో రూ.7,020 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ నేపధ్యంలో జాతీయ స్థాయిలో ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకోవడం పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read