విజయవాడ వాసుల చిరకాల కల బెంజిసర్కిల్ ప్లై ఓవర్.... విశాఖపట్నం-విజయవాడ-చెన్నై, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారులను అనుసంధానం చేసే కీలకమైన కూడలి. విజయవాడ నగరంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం.. ఇప్పడు బెంజిసర్కిల్ పై నిర్మిస్తున్నప్లై ఓవర్ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోనే రెండో అతిసుందరమైన ప్లై ఓవర్ గా దీనిని నిర్మించబోతున్నారు. రేపు (జూన్ 12 ) ఉదయం 9 .30 కు ప్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. బెంజ్ సర్కిల్ యెస్ వి యెస్ కల్యాణ మండపం వద్ద,(జ్యోతి మహల్ ఎదురుగా) కార్యక్రమం జరగునుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో, చిరకాల కల తీరనుంది.

ఇదీ నేపధ్యం:
బెంజిసర్కిల్ నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ సుమారు లక్ష వాహనాలు ఈ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయ రహదారి, జాతీయ రహదారి, నగరంలో ప్రయాణించే వాహనాలు రెండూ బెంజిసర్కిల్ వద్ద కలుస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు అవసరాల దృష్యా జాతీయ రహదారి పై రద్దీని నియంత్రించేందుకు కూడలిలో ప్లై ఓవర్ నిర్మాణం ఒక్కటే మార్గమైంది.
విజయవాడ-బందరు జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. బెంజిసర్కిట్ ప్లై ఓవర్ నిర్మాణ పనులు రెండిటికి కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లను పిలిచారు. ఈ ప్యాకేజీలో 64.611 కిలోమీటర్ల బందరు రోడ్డు విస్తరణలో నాలుగు మేజర్, ఐదు చిన్న, మరో ఐదు పాదచారుల బ్రిడ్డిలతో పాటు బెంజిసర్కిల్ ప్లై ఓవర్ ను నిర్మించనున్నారు. ఈ పనులను దిలీప్ బిల్డ్కాన్ సంస్థ రూ.740.10 కోట్ల అంచనాతో టెండర్డు దక్కించుకుంది.

మొదట ఆనుకున్నట్టగా జ్యోతిమహల్ నుంచి నిర్మల కాన్వెంట్ వరకూ 618 మీటర్ల పొడవునా ఫ్లై ఓవర్ నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. దీనికి రూ.82 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నిర్మల కాన్వెంట్ నుంచి రమేష్ ఆస్పత్రి వరకూ ఈ ప్లై ఓవర్ నిర్మాణాన్ని అదనంగా మరో 820 మీటర్లకు పెంచారు. ఇందు కోసం సుమారు రూ.120 కోట్ల వ్యయం అంచనా. రెండు వైపులా కలిపి మొత్తం 96 పిల్లర్లు నిర్మించనున్నారు.

సూపర్ ఫాస్ట్ గా నిర్మాణం:
త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను రెండువైపులా మొదలు పెట్టనున్నారు. జ్యోతిమహల్ నుంచి ఓ వైపు, నిర్మల కాన్వెంట్ నుంచి మరో వైపు పిల్లర్ పనులు ప్రారంభిస్తారు. ఒక్కో పిల్లర్ నడుమ 30 మీటర్ల దూరం ఉంటుంది. ఇలా 5, 6 పిల్లర్ల నడుమ ఇటు సర్వీస్ రోడ్డు, అటు జాతీయ రహదారిపై 20 అడుగుల మేర బారికేడింగ్ ఏర్పాటు చేసి ఒకేసారి వీటిని నిర్మించనున్నారు. రెండువైపులా పిల్లర్ల నిర్మాణం మొదలవుతుంది. ఈ సందర్భంగా బారికేడింగ్ ప్రాంతంలో జాతీయ రహదారి 20 అడుగులు, సర్వీసు రోడ్డు 14 అడుగులు మాత్రమే వినియోగంలో ఉంటుంది. బారికేడింగ్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్ను మళ్లిస్తారు. పిల్లర్ల ఎత్తు ఐదున్నర అడుగులు వచ్చాక ఆయా ప్రాంతాల్లో బారికేడింగ్ను తొలగిస్తారు.

నూతన డిజైన్లతో నిర్మాణం:
నూతన డిజైన్ల ప్రకారం బెంజిసర్కిల్ ప్లై ఓవర్ 1.438 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఉజ్జయినిలో ఉన్న ప్లై ఓవర్ తరహాలో దీని డిజైన్ల రూపొందించారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. జ్యోతిమహల్ నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు ఒక ఫ్లై ఓవర్, ఎగ్జిక్యూటివ్ క్లబ్ నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు ఒక ప్లై ఓవర్ను నిర్మిస్తారు. రాకపోకలకు విడిగా రెండు ప్లై ఓవర్లను సమాంతరంగా (ఒక్కో ఫై ఓవర్ మూడు లేన్లతో) నిర్మిస్తాడు. మొత్తం ఆరు లేన్లు ఉంటాయి. రెండు ఫ్లై ఓవర్ల మధ్య ఖాళీ ఉంటుంది. అలాగే ప్లై ఓవర్కు ఇరు వైపులా సర్వీసు రోడ్డు ఉంటుంది.

2018 జూన్ నాటికి పనులు పూర్తి చెయ్యటానికి టార్గెట్ పెట్టుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read