ఒక మంచి జరుగుతుంది అంటే, దాన్ని ఆపే వారు కొంత మంది ఉంటారు... ఈ కాలం రాజకీయల్లో అయితే అది మరీ ఎక్కువ... మన రాష్ట్రంలో అయితే, ఇక చెప్పనవసరం లేదు... అమరావతి దగ్గర నుంచి కంపెనీలు పెట్టే పెట్టుబడులు దాకా... నాలుగు ఉద్యోగాలు తెచ్చే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవటం దగ్గర నుంచి, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ దాకా.. అన్ని అడ్డుకోవటానికి చూసేవారే... వీళ్ళ కుట్రలు దాటుకుంటే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకుడు ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం..

తాజాగా, పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్న, ప్రాజెక్ట్ వ్యతిరేకులకి, చేదు వార్త వినిపించింది గ్రీన్ ట్రిబ్యునల్... ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన మట్టి తవ్వకాలను పోలవరం మండలంలోని మూలలంకలో వేయడం వల్ల పర్యావరణానికి, అడువాలకి నష్టం వాటిల్లుతోందంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. దీనిని పరిశీలించిన ట్రైబ్యునల్‌ వాస్తవాలను తెలుసుకునేందుకు ఏప్రిల్‌ 30న ఒక కమిటీని వేసింది. ఈ నెల 1న పోలవరం ప్రాంతంలో పర్యటించిన ఈ కమిటీ.. హరిత ట్రైబ్యునల్‌కు 6 పేజీల నివేదికను అందజేసింది. ఈ నివేదికలో పోలవరం ప్రాజెక్టు కోసం చేపడుతున్న తవ్వకాల మట్టిని ఒకే చోట పోగేయడం వల్ల పర్యావరణ హాని గానీ, జీవ, వాయు కాలుష్యంగానీ జరగడం లేదని స్పష్టం చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవాలనుకున్న వారికి, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఒక చేదు వార్త... మరలా, ఏ రూపంలో వచ్చి, ఈ ప్రాజెక్ట్ కు అడ్డు పుల్ల వేస్తారో, వేచి చూడాలి..

పోలవరం ప్రాజెక్ట్, ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్... 100% ఖర్చు కేంద్రమే భరిస్తుంది... చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు... ఎలా అయినా సరే, 2018 చివరి నాటికి మొదటి విడతగా గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చే విధంగా పనులు చేస్తున్నారు.. ప్రతి సోమవారం, ఈ ప్రాజెక్ట్ సమీక్షిస్తున్నారు... రెండు నెలలకు ఒక సారి, ప్రాజెక్ట్ ఏరియాకు వెళ్లి ఫీల్డ్ విజిట్ చేసి, తగు సూచనలు ఇస్తున్నారు... మరో పక్క, చంద్రబాబ ఈ ప్రాజెక్ట్, పూర్తి చేస్తే, ఇక రాజకీయ సమాధే అవుతుంది అని, ప్రత్యర్ధి పార్టీలు, అన్ని విధాలుగా, ఈ ప్రాజెక్ట్ లేట్ చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి... ఇవన్నీ దాటుకుని, ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ, చంద్రబాబు లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read