ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి చేరువైంది. ప్రపంచం అంతా అరచేతిలోనే ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యల్ని పరిష్కరించుకుంటున్నారు. ప్రధానమంత్రి నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కొందరు ఉన్నతాధికారులు సైతం సకాలంలో స్పందిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్విట్టర్ ద్వారా తనకు సమస్యలు ఉంటే తెలియచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కోరారు. సమస్యలు ఉన్నవారు లోకేష్ ట్విట్టర్ ఎకౌంటు లో, ట్వీట్ చేసిన వెంటనే, లోకేష్ టీం, ఆ సమస్య గురించి మరిన్ని వివరాలు ఫోన్ ద్వారా అడిగి సమస్యలు పరిష్కరిస్తున్నారు.

అయితే, కొంత కాలం క్రిందట, లోకేష్ కు, పులివెందుల నియోజకవర్గం నుంచి, ఒక ట్వీట్ వచ్చింది... ఆయన పేరు హేమంత్ రెడ్డి... పులివెందుల నియోజకవర్గం... ప్రతిపక్ష నేత జగన్ అక్కడ MLA... పులివెందుల మున్సిపాలిటీలో వీధి లైట్లు వేలగట్లేదు అనేది కంప్లైంట్... స్థానిక MLA అయిన పులివెందుల పులి, మడమ తిప్పని వంశంలో పుట్టిన జగన్, అక్కడ ఏ సమస్య వచ్చినా, రెండేళ్ళు ఆగండి, నేనే CM, అప్పుడు మీ సమస్య పరిష్కరిస్తా అంటున్నాడు... హేమంత్ రెడ్డి, 08.04.2017న పుర సేవా యాప్ లో, పులివెందుల మున్సిపాలిటీలో వీధి లైట్లు వేలగట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు.. అక్కడా సమస్య పరిష్కారం అవ్వలేదు... చివరగా మంత్రి లోకేష్ కు సమస్య ట్వీట్ చేశారు... రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యింది... హేమంత్ రెడ్డి, సమస్య పరిష్కారం అయ్యింది అని, లోకేష్ కు థాంక్స్ చెప్తూ, ఒక ట్వీట్ కూడా చేశారు.

అందుకే అంటారు, ఏదైనా మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అని... MLA అయ్యిఉండి, మున్సిపాలిటీలో వీధి లైట్లు సమస్య తీర్చలేనివాడు, ముఖ్యమంత్రి అయ్యి, ఏమి చేద్దాం అనుకుంటున్నాడో మరి...

ఆ ట్విట్టర్ సంబాషణ మీరూ చూడండి...

lokesh twitter 1

lokesh twitter 1

Advertisements

Advertisements

Latest Articles

Most Read