చనిపోయిన ఆప్తుల మృతదేహాలను ఇళ్లకు తీసుకెళ్లడానికి డబ్బుల్లేని భారతాన్ని ఇటీవల కాలంలో చూశాము. ఒడిషా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలను జరిగాయి. ఈ ఆపద సమయాల్లో అలాంటి వారికి అండగా నిలిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చడానికి మహాప్రస్థానం కార్యక్రమం అమలు చేయ్యనుంది ప్రభుత్వం. ముందుగా మెడికల్ కాలేజీలున్న 11 వైద్యశాలలతో పాటు ఏలూరు, విజయనగరం జిల్లా ఆసుపత్రులకు ఒక్కో వాహనాన్ని మహాప్రస్థానం కార్యక్రమం కింద సమకూరుస్తారు.

త్వరలో రాష్ట్రంలోని మిగిలిన ఆసుపత్రులకూ వాహనాలు అందజేస్తారు. ఈ వాహనాల ద్వారా మృతదేహాలను ఇళ్లకు తరలిస్తారు. ఈ నెల 20 నుంచి మహాప్రస్థానం వాహనాలు సేవలు అందించనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read