కర్నూలు జిల్లాకు మహర్థశ పట్టింది. నిన్నదేశంలోనే అతి పెద్ద సోలార్ ప్రాజెక్టు ప్రారంభంకాగా, నేడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా ఐయోవా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ భారీ ప్రాజెక్టును రాయలసీమలోని కర్నూలు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం 500 ఎకరాల్లో రూ.3.5 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. శనివారం గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, అదే విధంగా యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, విశ్రాంత ప్రొఫెసర్లు, విత్తన సరఫరా సంస్థ అధికారులు, ప్రైవేటు విత్తన సంస్థల ప్రతినిధులు, రైతులతో వర్క్ షాప్ నిర్వహించారు. కర్నూలులో ఏర్పాటు చేయబోయే మెగా సీడ్ ప్రాజెక్టు గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు. దీని పై అమెరికాలోని ఐయోవా వర్సిటీ ప్రతినిధులు పాల్గుని ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల పై సలహాలు, సూచనలు ఇచ్చారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో తక్కువ ధరలకు అందించాలనే లక్ష్యంతో సీఎం అమెరికాలోని ఐయోవా వర్సిటీ చేసుకున్న ఒప్పందం మేరకు మెగా సీడ్ ప్రాజెక్టును నెలకొల్పడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఐయోవా వర్సిటీ సహకారంతో కర్నూలు జిల్లాలోని తంగడచ్చ వద్ద 500 ఎకరాల్లో విత్తనాల పై పరిశోధన వినూత్న పద్ధతులు అవలంభించడం, విత్తన విధానాలు, నియంత్రణ, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ కార్యక్రమూల నిర్వహణ, విత్తనాభివృద్ధి జరుగుతాయి.

సింగిల్ విండో విధానంలో రైతులకు విత్తనాలకు సంబంధించి అన్ని అంశాలను ఒకే చోట లభ్యమయ్యేట్లు చేయడమే పార్కు లక్ష్యం. విత్తన సరఫరాలోని వ్యత్యాసాన్ని అధిగమించేందుకు నాణ్యమైన కల్తీ లేని ఆరోగ్యకరమైన విత్తనాలను రైతులకు అందించేందుకు ఉపయోగపడుతుంది. వర్క్ షాప్లో చర్చించిన విషయాల పై సీఎంకు నివేదిక అందించనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు జూన్ నెలలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read