గోదారమ్మ, కృష్ణమ్మ ను అనుసంధానం చేసి, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నీటిని మళ్ళించి, డెల్టా రైతులకు; అటు శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వాలి అన్న చంద్రబాబు ఆశయం నెరవేరి, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ గా పట్టిసీమ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఎందరో నదులు అనుసంధానం చెయ్యాలి అని కలలు కన్నారు, కాని చంద్రబాబు నిజం చేసి చూపించారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్, గత రెండు సంవత్సరాలు నుంచి మంచి ఫలితాన్నే ఇచ్చింది. రాష్ట్ర రైతులని ఆదుకోవటానికి, ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు ముందుకు వెళ్లారు. ఒక పక్క కృష్ణా నదికి వచ్చే నీరు తగ్గిపోవటం, ఎగువ రాష్ట్రాల పేచిలతో, కృష్ణా నది నీటి కేటాయింపులు బాగా తగ్గిపోయిన నేపధ్యంలో, పట్టిసీమ ఒక సంజీవినిలా వచ్చి రైతులని ఆదుకుంది.

అయితే ఇప్పుడు ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ కు జాతీయ స్టాయిలో గుర్తింపు లభించింది. 173 రోజుల్లోనే కృష్ణ,గోదావరి నదుల అనుసంధానం పూర్తి చేసి, దేశంలోనే అతి తక్కువ కాలంలో చేపట్టిన ప్రాజెక్ట్ గా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్తానం దక్కింది. పట్టిసీమ ప్రాజెక్ట్ 30-03-2015 లో ప్రారంభం అయ్యి, 173 రోజుల్లోనే, 18-09-2015న మొదటి పంపు రున్నింగ్ లోకి వచ్చింది.

సాగునీటి ప్రాజెక్టులంటేనే జాప్యానికి మారుపేరు. నత్తనడకన సాగుతూ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చటమే తప్ప ప్రజలకు మాత్రం ఏ నాటికి అవి ఉపయోగపడవు. ఫలానా ప్రాజెక్టు అనే కాదు దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టును చూసినా ఇదే పరిస్థితి. దాంతో అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోయి చివరకు ప్రభుత్వాలకు భారంగా మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దేవాదుల, ఎలిమినేటి మాధవరెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల , హంద్రీ-నీవా తదితర ఎత్తిపోతల పథకాలన్నీ ఇలా వాయిదాలు, పొడిగింపులతోనే సా...గాయి. అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంంలో ఓ గొప్ప విజయం సాధించింది. గోదావరి జలాలను పంపింగ్ చేసే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అంచనా వ్యయం సవరించకుండా నిర్దేశించిన ఏడాది గడువులోగానే పూర్తిచేసింది. సాంకేతిక విలువమేరకు ఈ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దది కాగా ఇరిగేషన్ రంగంలో దేశంలోనే తొలి ప్రాజెక్టు కావటం విశేషం.

ప్రాజెక్ట్ హైలెట్స్ ఏమంటే :
1) ఆసియా లోనే అతి పెద్ద పంప్ హౌస్ - 24 లిఫ్ట్ పంప్స్ తో 80 టీ ఏం సి కెపాసిటీ.
2) భారత దేశం లో ఈ టెక్నాలజీ వాడడం ఇదే మొట్టమొదటిది.
3) 250 మంది సాంకేతిక నిపుణులు, 1000 మంది సాంకేతిక సిబ్బంది మరియు 2000 మంది ఇతర సిబ్బంది వారి సేవలను అందించారు.

పట్టిసీమ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం అడుగులు
దేశంలో ఎన్నాళ్లగానో, ఒక కలగా ఉన్న నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపించిన చంద్రబాబు సర్కార్ కృషిని కేంద్రం మెచ్చుకుంటూ, అన్ని రాష్ట్రాలని ఈ ప్రాజెక్ట్ అధ్యయనం చెయ్యమంటుంది కేంద్రం.

రాయలసీమకు ప్రాణం
చంద్రబాబు ముందుచూపుతో చేపట్టిన నదుల అనుసంధాన ఫలితంగా ఈ ఖరీఫ్ సాగు ఫలప్రదంగా సాగింది. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల వలన కృష్ణా డెల్టా కింది నాలుగు జిల్లాలు, అలాగే రాయలసీమ జిల్లాల ఖరీఫ్ పంటలకు ప్రాణం పోశాయి. పట్టిసీమ ద్వారా కృష్ణకు గోదావరి జలాలు తరలించి తద్వారా మిగిలిన కృష్ణ జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చెయ్యాలన్నముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, ఈ సంవత్సరం కొంత మేరకు ఫలించింది. పై నుంచి కృష్ణా నీరు సరిపడా రాకపోవటం, వర్షాభావ పరిస్తుతుల్లో, పట్టిసీమ రాష్ట్రాన్ని ఆదుకుంది. శ్రీశైలంనాకి కేవలం 345 టియంసీ నీరు వచ్చినా, రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాపాడగలిగింది ప్రబుత్వం.

పట్టిసీమ నీరుతో విరగపండిన వరి
దాన్యం దిగుబడులలో డెల్టా రైతులు కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది వరి విరగ పండింది. ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో దిగుబడులు వచ్చాయి. రైతన్న ఇంట ధాన్యం సిరులు కురిపిస్తోంది. ఎకరానికి 35 నుంచి 45 బస్తాల మేర గింజ రాలుతోంది. సగటున 38 బస్తాలు తగ్గడం లేదు. ఈ ఏడాది వరి అధిక దిగుబడులకు పట్టిసీమ ఎత్తిపోతల ప్రధాన కారణంగా అందరూ అంగీకరిస్తున్నారు. పట్టిసీమ ద్వారా గడిచిన ఖరీఫ్‌ సీజనలో 55 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించారు. పులిచింతల నుంచి 30 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది.

పట్టిసీమ నుంచి వచ్చిన నీటితో నారుమళ్లు మొదలుపెట్టి ఖరీఫ్‌ ప్రారంభించిన రైతాంగం అదే పట్టిసీమ నీటితో సీజనను సకాలంలో ముగించారు. పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీటిలో సారవంతమైన బురద మట్టి, జిగురు, ఒండ్రు ఉండటంతో పంట బాగా పండేందుకు దారి తీసిందని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు.

పట్టిసీమ వ్యతిరేకులు ఇప్పటికైనా మారండి

పట్టిసీమ దండగ ప్రాజెక్ట్ అన్న వారికి, చెంప పెట్టు అంటూ, కృష్ణమ్మ బిరబిరా ప్రవిహిస్తూ, సీమ నేలను తాకుతూ, రైతన్నల బాధ తీర్చింది. పట్టిసీమను ఎగతాళి చేసిన ఆ మేధావులు ఎక్కడ ఉన్నారో తెలీదు కాని, చుక్కు నీరు చూస్తేనే ఆనంద పడే సీమ రైతులు, కృష్ణమ్మ బిరబిరా కాలువల్లో ప్రవహిస్తూ వస్తుంటే, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. పండు వయసులో ఉన్నవారు కూడా, మా జీవితంలో ఇంత నీరు చూస్తాం అనుకోలేదు అంటూ, ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తున్నారు. కలగానే మిగిలిపోతుంది అనకున్న హంద్రీనీవా చంద్రబాబు రెండు ఏళ్ళలో, రెండో దశ పనులు కూడా పూర్తి చేసి, మూడో విడత పనులు కూడా పూర్తి చేసి, సీమను సస్యస్యామలం చెయ్యటానికి కదం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు.

అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది, మేము పట్టిసీమకు వ్యతిరేకం అన్న నాయకులు, కోర్ట్ లకి వెళ్లి ప్రాజెక్ట్ ఆపుతాం అన్న మేధావులు, పట్టిసీమ పరవళ్ళు తట్టుకోలేక, కాలువకు గండి కొట్టిన సంఘ విద్రోహులు, ఇప్పుడు చెప్పండి మీ సమాధానం ? ఈ ఏడాది పట్టిసీమ ప్రాజెక్ట్ రైతులకి, ఎంతలా ఉపయోగపడిందో తెలుసుకుని, మీ అభిప్రాయాన్ని మార్చుకోండి... ప్రపంచం పట్టిసీమను గుర్తించి, కీర్తిస్తుంది, ప్రతిపక్షం కూడా గుర్తిస్తే మంచిది....

pattiseema 25032017 2

Advertisements

Advertisements

Latest Articles

Most Read