ఏం జరుగుతుంది అమరావతిలో, అనే వారికి దిమ్మ తిరిగే సమాధానం... అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు... అడుగడుగునా, అంతర్జాతీయ స్థాయి డిజైన్లు, అత్యుత్తమ మౌలిక వసతులతో నిర్మిస్తున్న అమరావతికి జీవనాడిగా పేర్కొంటున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పరుగులు పెడుతున్నాయి.... ఈ రహదారి నిర్మాణం చూస్తుంటే, ఎదో ఒక ఎయిర్ పోర్ట్ రన్ వే లాగా, అద్భుతంగా ఉంది అంటున్నారు చూసిన వాళ్ళు.. ఇంత తక్కువ సమయంలో, ఇంత ఫాస్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న తీరు చూసి, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలానే ఉంటుంది అంటున్నారు ప్రజలు... అమరావతి లాంటి ఒక మహానగర నిర్మాణానికి, సరైన రోడ్ కనెక్టివిటీ ఎంతో ముఖ్యం... అందుకే, ముందుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు చేపట్టారు... జూన్ నాటికి పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో పనులు సాగుతున్నాయి. ఈ రోడ్డు చూస్తే రాజధాని భవిష్యత్తు అర్థం కావాలని చంద్రబాబు అభిప్రాయం. అందుకు తగ్గట్టే పనులు జరుగుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి ప్రతి వారం ఈ రోడ్డు పనులను సమీక్షిస్తున్నారు.

అటు నాలుగు వరుసలు.. ఇటు నాలుగు వరుసలు! మొత్తం 200 అడుగుల వెడల్పు రోడ్డు. మధ్యలో మెట్రో కోసం కొంత స్థలం కేటాయింపు. అటూ ఇటూ పచ్చదనానికి మరికొంత స్థలం. పాదచారులకు, సైక్లింగ్ చేసేవారికి ప్రత్యేకమైన ట్రాక్ లు!! వెరసి.. రాజధాని అమరావతి దారి.. ఎనిమిది వరుసల రహదారిగా ఉండబోతోంది.. ముందుగా నాలుగు వరుసల రహదారి నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 8 వరుసల రహదారిగా మారుస్తారు.

ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు స్వరూపం:
కృష్ణా కరకట్టకు సమాంతరంగా ఉండవల్లి నుంచి పశ్చిమ దిక్కున ఉన్న దొండపాడు మధ్య 18.27 కిలోమీటర్ల పొడవున 60 మీటర్ల(196.80 అడుగుల) వెడల్పుతో, రూ.215 కోట్ల అంచనా వ్యయంతో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఈ రోడ్డే అమరావతిలోని అన్ని రహదారుల్లో ప్రధానమైనది, భారీది. దీనిలో భాగంగా ఇరువైపులా మూడేసి వరుసల సాధారణ వాహనాల లేన్లు(క్యారేజ్‌ వే), మధ్యలో 2 వరుసల బస్‌ ర్యాపిట్‌ ట్రాన్సపోర్టు (బీఆర్టీ) వరుసలతో మొత్తం 8 వరుసలుంటాయి. 2 వైపులా ఉండే క్యారేజ్‌ మార్గాల తర్వాత కొంత విస్తీర్ణంలో హరితం, అనంతరం నాన మోటార్‌ ట్రాన్సపోర్టు(ఎనఎంటీ) జోన ఏర్పాటు చేస్తారు. ఈ జోనలో భాగంగా సైక్లింగ్‌ ట్రాక్‌లు, అనంతరం మళ్లీ కొద్దిపాటి విస్తీర్ణంలో మొక్కలు, ఆ తర్వాత నడక మార్గాలు ఉంటాయి. బీఆర్టీ జోన, క్యారేజ్‌ మార్గాలపై పడే వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నేలలోకి వెళ్లేందుకు వీలుగా బీఆర్టీ జోనకు ఇరువైపులా, క్యారేజ్‌ మార్గాలు-ఎనఎంటీ జోన్ల మధ్య డ్రెయిన్లు ఏర్పాటు చేస్తారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రెండో ప్యాకేజీలో భాగంగా 3.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. ఈ రోడ్డు మార్గంలో కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ ఉంది. దీనిపై నిర్మించే ఎలివేటెడ్‌ హైవే(ఫ్లైఓవర్‌) 1.5 కిలోమీటర్లు ఉంటుంది. కాలువపై నిర్మించే వంతెన ఐకానిక్‌గా ఉండాలని సీఎం సూచించారు. మరికొన్ని నెలల్లో ఈ ప్యాకేజీకి కూడా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారని సీసీడీఎంసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి పేర్కొన్నారు.

72.16 అడుగుల్లో గ్రీన జోన్లు!
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 196.80 అడుగులు కాగా.. దాని పొడవునా, అదనంగా మరొక 72.16 అడుగుల(22 మీటర్ల) మేర గ్రీన బెల్టులను అభివృద్ధి పరచనున్నారు. అంటే వీటితో కలుపుకొంటే సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెడల్పు 268.96 అడుగులు(82 మీటర్లు) అవుతుంది

నాగార్జున constructions కంపెనీ, దీన్ని 2017 జూన్ నాటికి పూర్తీ చేసే విధంగా పనులు చేస్తుంది. ఈ రహదారి పూర్తి అయితే, రాజధాని గ్రామాల్లో ఎక్కడికైనా నిమషాల్లో చుట్టేయవచ్చు.

సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న తీరు ఈ వీడియోలో చూడవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read