దేశంలో రెండో తయారీ యూనిట్‌ను చైనా మొబైల్‌ ఫోన్ల కంపెనీ షామీ ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో, కేవలం షియామీ ఫోన్ల తయారీ కోసమే కొత్త యూనిట్‌ సిద్ధమైంది. శ్రీసిటీలోనే ఫాక్స్‌కాన్‌ ఆధ్వర్యంలోని ప్లాంటులోనే షామీ ఫోన్లు ఇప్పటివరకు తయారవుతున్నాయి. అయితే ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్లు కూడా ఆ యూనిట్‌లో రూపొందుతున్నాయి. రెండో యూనిట్‌లో మాత్రం కేవలం షామీ ఫోన్లే తయారు కానున్నాయి.

ఈ కొత్త యూనిట్‌కు ఎంత పెట్టుబడి పెట్టిందీ వెల్లడించేందుకు సంస్థ నిరాకరించింది. ‘ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వెల్లడించను. అయితే యంత్రాలు పనిచేస్తున్నప్పుడు, భారత్‌లో సెకనుకు ఒక ఫోన్‌ తయారు చేసే సామర్థ్యం సమకూరిందని షామీ ఇండియా అధిపతి మను జైన్‌ తెలిపారు. దేశీయ విక్రయాల్లో 95 శాతాన్ని ఇక్కడే తయారు చేస్తున్నామన్నారు. వీటికి విడిభాగాలను మాత్రం దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.

ఈ ప్లాంట్‌తో ఐదువేలకు పైగా ఉద్యోగాలను కల్పించే అవకాశం ఏర్పడిందని, మొత్తం సిబ్బందిలో 90 శాతానికి పైగా మహిళలే ఉన్నట్టు కంపెనీ పేర్కొంది.

ఈ క్రింది వీడియో చూడండి, మన నవ్యాంధ్రలో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెడ్‌మి 2 లాంటి మొబైల్‌ ఫోన్స్, శ్రీసిటీలో ఎలా తాయారు చేస్తున్నారో, అక్కడ ఉపాధి దొరకటంతో అక్కడి యువత ఎంత సంతోషంగా ఉన్నారో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read