ఉత్కంఠ రేపిన కడప ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తి అయ్యింది . నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికలో టీడీపీ తరుపున పోటీ చేసిన బీటెక్ రవి గెలుపొందారు.

40 ఏళ్ళ వైయస్ కుటుంబ కంచుకోటను చంద్రబాబు అభివృధి బద్దలుకొట్టింది. వైయస్ జగన్ మీద వ్యతిరేకత, చంద్రబాబు పరిపాలన కలిసి వచ్చాయి.

వైయస్ జగన్ సొంత బాబాయి ఓడిపోవటంతో జగన్ కు ఇబ్బందిగా రాజకీయంగా ఇబ్బందిగా మారే అవకాసం ఉంది. ఒకే కుటుంబం, కులం, ఇవేమీ అభివృధి ముందు నిలబడవు అనే సంగతి రుజువు అయ్యింది. కుప్పం కంటే ముందుగా, పులివెందులకు నీళ్ళు తీసుకువెళ్తా అని చంద్రబాబు చెప్పి, చేసి చూపించారు. ఇవన్నీ, విజయానికి దోహదపడ్డాయి.

కడప వైసీపీకి పట్టున్న ప్రాంతం కావడంతో అక్కడ నెగ్గాలని టీడీపీ, పట్టు కోల్పోకూడదని వైసీపీ రెండూ ముమ్మరంగా ప్రయత్నించాయి. వైసీపీ తరుపున వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేయగా.. టీడీపీ తరుపున బీటెక్ రవి పోటీ చేశారు.

నెత్తురు చుక్క రాలకుండా ఫాక్షన్ ఏరియాలో గెలుపొంది, అపర చాణుక్యుడు అని మరో సారి చంద్రబాబు నిరుపించుకున్నారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read