రాయలసీమకు భారీ పరిశ్రమ రానుంది. ఒక పక్క కరవు పై సమరం చేస్తూనే, పరిశ్రమలతో కూడా రాయలసీమ అభివృద్ధి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కరవు జిల్లా అనంతపురానికి భారీ పరిశ్రమ రానుంది. బస్సుల తయారీలో సుప్రసిద్ధ వీరా వాహన ఉద్యోగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ గుడుపల్లి వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో బస్సుల తయారీ యూనిట్ ను రెండు దశల్లో నెలకొల్పడానికి ముందుకు వచ్చింది.

7000 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించే వీరా వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీవీయూపీఎల్‌)కు ప్రోత్సాహకాన్ని అందించేందుకు పరిశ్రమల శాఖ నిర్ణయించింది. మొదటి దశలో ఏటా 8 వేల బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉన్న యూనిట్ ను నెలకొల్పతారు.

బెంగళూరుకు చెందిన ‘వీరా వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (వివియుపిఎల్‌) కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించిన తరుణంలో, తెలంగాణా రాష్ట్రం కూడా తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కోరింది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు, ప్రోత్సాహాలు, చంద్రబాబు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలతో, వీరా అనంతపురానికి వచ్చింది.

వీరా వాహన ఉద్యోగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఇప్పటి వరకు కోచ్‌ బస్సుల తయారీలో ఉన్న, ఇపుడు కొత్తగా టర్మాక్‌ కోచ్‌ బస్సుల తయారీకి సిద్ధమైంది. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల్ని విమానాల వరకు తీసుకెళ్లేందుకు ఈ బస్సుల్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశం వీటిని పూర్తిగా దిగుమతి చేసుకుంటోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read