రాష్ట్రాభివృద్ధిలో కీలకం కానున్న ప్రధాన పారిశ్రామిక కారిడార్ కు తొలి అడుగుపడింది. విశాఖ-చెన్నెల మధ్య సుమారు 800 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్న ఈ కారిడార్ నిర్మాణానికి తొలి విడతగా 375 మిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంగీకరించింది. ఈ నిధులు మార్చి మొదటి వారంలో విడుదలకానున్నాయి. దీంతో ప్రతిపాదనలకు అనుగుణంగా పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.

వాస్తవానికి దేశం తూర్పతీరం వెంబడి 2,500 కిలోమీటర్ల పొడవునా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సంకల్పించింది. అయితే విశాఖ-చెన్నెల మధ్యనున్న ప్రాధాన్యత దృష్ట్యా తొలి విడతలో దీన్ని పూర్తిచేయాలని నిర్ణయించింది, చెన్నై-విశాఖ కారిడార్ అభివృద్ధికి 631 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు బ్యాంక్ గతేడాది సెప్టెంబర్లో అంగీకరించింది. ఇందులో భాగంగానే ఇప్పడు 375 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించిన పత్రాలకు ఆమోదం తెలిపింది.

ప్రతిపాదించిన రుణం మొత్తంలో 500 మిలియన్ డాలర్లను ఈ కారిడార్లోని ప్రధాన కేంద్రాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించాలి. శ్రీకాళహస్తి, అమరావతి, కాకినాడ, విశాఖపట్నంలలో ఈ సదుపాయాలు కల్పిస్తారు. తొలి విడత మంజూరు చేసిన 375 మిలియన్ డాలర్లలోని 245 మిలియన్ డాలర్లను ఈ నాలుగు కేంద్రాల్లో రెండింటిపై వెచ్చిస్తారు. మిగిలిన 135 మిలియన్ డాలర్లను కారిడార్ నుండి ప్రస్తుత జాతీయ రహదార్లకు అనుసంధాన రహదార్లు, రైల్వేలైన నిర్మాణానికి కేటాయిస్తారు.

ఇందులో భాగంగానే కాకినాడ నుంచి జాతీయ రహదారి వరకు 29.6 కిలోమీటర్ల రహదారిని నాలుగులైనుగా విస్తరిస్తారు. అలాగే కారిడార్లో నీటి సరఫరా ప్రాజెక్ట్లకు కూడా ఈ నిధుల్ని వినియోగిస్తారు. ఏడాదిలోగా మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్రముంది. దీని నిర్మాణంతో తూర్పతీర పారిశ్రామిక రూపురేఖలు వూరిపోతాయని రుణ మంజూరు సందర్భంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారతశాఖ అధిపతి వ్యాఖ్యానించారు. విశాఖ-చెన్నెల మధ్య ప్రస్తుతం 16 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులున్నాయి. కారిడార్ పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే 2025 నాటికి ఈ పెట్టుబడులు 64 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ఆయనపేర్కొన్నారు.

తూర్పు ప్రాంత పారిశ్రామిక కారిడార్ నిర్మాణంతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ కారిడార్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్నుంచి పలు రాయితీలందుతాయి. అలాగే ఈ కారిడార్కు జాతీయ రహదార్లు, రైల్వే ప్రధాన లైన్లతో అనుసంధానముంటుంది. తీరం వెంబడి కొన్ని మధ్యతరహా పోర్టుల నిర్మాణానికి అవకాశాలొస్తాయి. ఇతర కారిడార్లతో పోలిస్తే విమానాశ్రయాలు, రేవులు, జాతీయ రహదార్లు, ప్రధాన రైలు మార్గాలకు అత్యంత చేరువలో ఉన్న కారిడార్ ఇదొక్కటే. పైగా కారిడార్ వెంబడన్నప్రాంతాల్లో ఎప్పడూ ఎలాంటి కార్మిక అశాంతి లేదు. రాజకీయ సుస్థిరత నెలకొనుంది. ఇప్పటికే చెన్నె విశాఖ కాకినాడ ప్రాంతాల్లో భారీ పరిశ్రమలున్నాయి. చెన్నె విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నంలలో భారీ పోర్టులున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read