దక్షిణాదిన ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో 200 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూమి, నీరుకొండ సమీపంలో కేటాయించారు. రెండు దశల్లో అప్పగించే ఈ భూమికి ఎకరం రూ.50 లక్షలుగా ధరగా ప్రభుత్వం నిర్ణయించింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, బిజినెస్‌, వైద్య కోర్సులను అందించనున్నారు. 52 వేల మంది విద్యను అభ్యసించనున్నారు. పదేళ్లలో మొత్తం రూ.4,400 కోట్ల పెట్టుబడితో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చెయ్యనున్నారు. వర్సిటీ ఏర్పాటు పూర్తయ్యేనాటికి 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. విశ్వవిద్యాలయ నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమాన్ని త్వరలో జరగనుంది.

అలాగే ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, అమరావతి కాంపస్ లో, ఫాకల్టీ పోస్ట్లు భర్తీకి కూడా వర్సిటీ అవకాశం ఇచ్చింది. హెచ్ఓడి, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు, ఇక్కడ క్లిక్ చెయ్యగలరు http://www.srmuniv.ac.in/srmap/dean-hods.html

చెన్నై క్యాంపస్‌కు దీటుగా అత్యాధునికతను చాటుకునే విధంగా క్యాంపస్ నిర్మాణానికి ఎస్‌ఆర్‌ఎం డిజైన్ లు సిద్ధం చేసేంది... ఆ డిజైన్ లు ఇవే..

srm university amaravati 1

srm university amaravati 1

srm university amaravati 1

Advertisements

Advertisements

Latest Articles

Most Read