ap thunder 02012017

పిడుగుపడితే ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించడం చూశాం. ప్రతి సంవత్సరం విపత్తుల ద్వారా మృత్యువాత పడుతున్న వారిలో అత్యధికం పిడుగు పాటు వల్లేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నమోదైన గణాంకాలు చెబుతున్నాయి. తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంబిగించింది.

100 మీటర్ల పరిధిలో 45 నిమిషాల వ్యవధిలో రాష్ట వ్యాప్తంగా ఎక్కడైనా పిడుగుపాటును పసిగట్టే టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఈ టెక్నాలజీ కోసం అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ లిమిటెడ్ సంస్థతో, ఇస్రా శాస్త్రవేత్తల సమక్షంలో ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. మరో నెల రోజుల్లోనే ఈ ఆధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే రాష్ట్రంగా, దేశంలోనే మొట్టమొదటి రాష్టంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుఫానులు, వాయుగుండాలు, వర్షాలపై ఇప్రో సహాకారంతో ఎప్పటికప్పుడు నష్ట నివారణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది.

అయితే హఠాత్తుగా పిడుగులు పడినప్పుడు నిస్సహయతతో ఎంతో మంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం తరుచూ జరిగే పరిణామాలు. వీటిని నివారించేందుకు లైటైనింగ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనే సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా పిడుగులు పడడానికి ముందే వాటిని గుర్తించడం సాధ్యమవుతుంది. 45 నిమిషాల వ్యవధిలో, 100 మీటర్ల పరిధిలో ఈ వ్యవస్థ పిడుగుపాటును గుర్తించి, ఆ పరిధిలో ఉన్న సెల్ టవర్లకు సమాచారాన్ని పొందుతుంది. విపత్తు నిర్వహణ శాఖ వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సెల్ ఫోన్ లకు సందేశం పంపుతుంది. ఈ సందేశం తెలుగలోనే పంపటం కాని, లేక నిరక్షరాస్యులైన వారికి సందేశం చదివే వీలుకాదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్ వాయిస్ కాల్ ద్వారా కాని పిడుగుపాటు సమాచారం ప్రజలకు తెలియచేస్తారు. ఈ టెక్నాలజీ వల్ల పిడుగు పాటుకు ముందే ప్రజలు అప్రమత్తం కావడానికి దోహద పడుతుంది. తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలను దాదాపగా నివారించే అవకాశం దొరుకుతుంది. అమెరికాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read