నగదు రహిత లావాదేవీల్లో నిత్యావసరాలను తెచుకున్నఓ నిరుపేద మహిళకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీక్లీ మెగా బంపర్ డ్రాలో రూ.లక్ష నగదు బహుమతి లభించింది.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం అమలు చేస్తున్న డీజీధన్ లక్కీ డ్రాలో విజయవాడ వాసికి రూ. లక్ష బహుమతి దక్కింది. కలెక్టరేట్లో వీసీ నిర్వహిస్తున్న కలెక్టర్ బాబు ఈ విషయాన్ని ప్రకటించారు. విజయవాడ పరిధిలోని చుట్టగుంట రేషన్ దుకాణంలో ఈ నెల 6వ తేదీన, చుట్టగుంటకు చెందిన బుద్దాని రమణమ్మ రూ.66.75 విలువ చేసే రేషన్ సరకులను నగదు రహితంగా క్యాష్ లెస్ ( ఆధార్ ఆధారిత చెల్లింప విధానం) ద్వారా కోనుగోలు చేసింది. రూ. లక్ష బహుమతిని, వెంటనే రమణమ్మ పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఆధార్ తో గుర్తించి తక్షణం రూ.లక్షను ఆమె ఖాతాలో జమ చేశారు.

సోమవారం నిర్వహించిన డ్రాలో రమణమ్మకు రూ. లక్ష లభించిన విషయాన్ని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బహుమతి పొందిన రమణమ్మను విజయవాడ అర్బన్ తహసీల్లార్ కార్యాలయం నుంచి వీసీ ద్వారా అధికారులకు పరిచయం చేశారు. కలెక్టర్ ని చూసి, ఉద్వేగానికి లోనై, కంట తడిపెడుతూ తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజని, నగదు రహిత విధానం ద్వారా చెల్లించినందుకు తనకు క్యాష్ అవారు రావటం పట్ల హర్షం వ్యక్తం చేసింది రమణమ్మ. కలెక్టర్ బాబు, ఈ డబ్బుతో ఏం చేస్తావని ప్రశ్నించగా, ఆమె రూ. లక్షను తన పిల్లల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేయనున్నట్టు చెప్పారు.

రమణమ్మ చుట్టుగుంటలోని కాల్వకట్ట వెంబడి కుటుంబంతో కలిసి నివసిస్తుంది. భర్త నారాయణరావు మొదట్లో కూలికి వెళ్ళేవాడు. ప్రస్తుతం సైకిల్ మీద బట్టలు విక్రయిస్తుంటాడు. రమణమ్మ సొంతంగా ఒక మిషన్ కొనుక్కుని ఇంట్లోనే బట్టలు కుడుతూ ఉపాధి పొందుతోంది. తన ఇద్దరు పిల్లలు భవాని, జయంత్లను ప్రైవేటు స్కూల్లో చదివిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read