sita ram 15042016

సందుకి ఒక పందిరి...రెండు రోజులు ముందు నుంచి కుర్రాళ్ళ హడావిడి...మండపం కోసం చందాలు...ముందు రోజు నుంచి స్పీకర్ లో "శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి" పాటలు...మన పక్కింటి మావయ్యో, బావో పీటల మీద కూర్చుని చేసే హడావిడి...పానకం, వడపప్పు తాయారు చెయ్యటం కోసం బెల్లం కొట్టటం...కళ్యాణం అయిపోయినాక రోడ్లు మీద వెళ్ళే బస్సులు, లారిలు, బళ్ళు వాళ్ళని ఆపి మరి మన సెంటర్లో తాయారు చేసిన పానకం వడపప్పు పంచటం...మనం పానకం తాగేసి, ఇంటికి తీసుకువేల్లటానికి అమ్మ ఇచ్చే రెండు లీటర్ల thumps-up బాటిల్ నిండా పానకం నింపుకుని ఇంటికి తెసుకువెళ్లి సాయంత్రం దాక తాగటం...అన్నదానం...సాయంత్రం వినోద కార్యక్రమాలు...చివరగా ఊరేగింపు.....ఇది కదా “శ్రీ రామ నవమి” హడావిడి అంటే....

కాని, రాను రాను ఈ సందడే లేదు, ఎక్కడో రామలయాల్లో, లేకపోతె బీసెంట్ రోడ్ లాంటి సెంటర్లో తప్పితే, చూడటానికి ఎక్కడా పందిరి లేదు...కనీసం ఇంట్లో అయినా పానకం, వడపప్పు చేసుకునే తీరిక లేదు...వేసవి కాలంలో వడదెబ్బ కొట్టకుండా ఉండటానికి మన పెద్దలు పానకం తాగమంటారు...అలా సందడి చెయ్యకుండా, ఇంట్లో కూర్చుని దూరదర్శన్లో రాముల వారి కళ్యాణం లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం... మెట్రో కల్చర్‌లో మనం మన సంప్రదాయ సిరులను కోల్పోతున్నాం...మన పిల్లలకి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రపంచం లోనే ఉంచుతున్నాం....ఎప్పటికి మేల్కుంటామో ఏంటో...

Advertisements

"శ్రీ రామ నవమి" సందడి అంటే, ఇంట్లో కూర్చుని రాముల వారి కళ్యాణం టీవిలో లైవ్ చూడటమా ? Last Updated: 15 April 2016

Related News