24
Fri, Feb

Top Stories

వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇజ్రాయల్ దేశ రాయబారి డానియల్ కార్మన్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వివిధ అంశాలపై వారు చర్చించారు.

అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వ్యవసాయం, విద్య, నీరు, ఆరోగ్య రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమని సిఎంకు డానియల్ తెలిపారు. సముద్రం నీటి నుంచి మంచినీరు తయారీ గురించి వివరించారు. కుప్పంలో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు త్వరలోనే పూర్తి అవుతుందని వివరించారు.

అలాగే, చంద్రబాబుతో కలిసిన విషయాన్ని డానియల్ కార్మన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, చంద్రబాబును కలవటం ఎంతో ఇన్స్పిరింగ్ గా ఉంటుంది అని, ఆయనతో కలిసి పని చెయ్యటం సంతోషం అని అన్నారు. ఆ ట్వీట్ కింద ఫోటోలో చూడవచ్చు.

cbn israel 24022017 2

‘మనం వున్నా లేకపోయినా సమాజ గమనం ఆగిపోదు, మనం సమాజం కోసం ఏం చేశామన్నదే చరిత్రలో నిలిచిపోతుంది, ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో, దృఢ సంకల్పంతో పనిచేయాల’ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు హితవు పలికారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందించుకోవాలని ఆయా శాఖాధిపతులకు సూచించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో 7 మిషన్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి- వచ్చేది ఫలిత ఆధారిత బడ్జెట్ కావడంతో అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత అవసరమని స్పష్టపరచారు.

ఇక నుంచి అన్ని మిషన్లపై 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం వస్తుందని చెప్పారు. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాలన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో బయోమెట్రిక్, సెన్సార్లు, సర్వెలెన్స్ కెమేరాలు అమర్చాలని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తగిన పరిశ్రమలను స్థాపించేందుకు కూడా కృషి జరగాలని అన్నారు. ప్రధానంగా ఎంఎస్ ఎంఈ యూనిట్ల కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.

Advertisements

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయని, వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా ఈ ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం ప్రధాన ఆకర్షణగా అగ్రి టూరిజంను ప్రోత్సహించాలని చెప్పారు. వాయు-శబ్ద కాలుష్యాలను గుర్తించేలా సాంకేతికతను వినియోగించుకుని, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యావ్యవస్థను సంస్కరించేందుకు, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యారంగానికి అపార నిధులు, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో, నాక్ రేటింగ్స్‌లో రాష్ట్రం వెనుకబడి వుండటాన్ని అధికారుల నిర్లక్ష్యమే కారణమని తప్పుబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పీఎంకేవీవై పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంతోనే సరిపెట్టుకోరాదని మొదటి స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో కనీసం 50 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలగాలని చెప్పారు.

సమీక్షలో ఇండస్ట్రీ సెక్టార్ మిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, నాలెడ్జ్-స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మిషన్‌లకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ శతాబ్దంలోనే అద్భుతమైన నగరంగా చెప్పకునే ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిని తెలుగు సంస్కృతి, చరిత్ర వారసత్వ సంపదలకు ప్రతిబింబంలా తీర్చిదిద్దడానికి తగిన నిర్మాణ రీతులన్నింటినీ క్రోడీకరించాలి అని డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని నిష్ణాతుల కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధ్యయనం, సేకరణ, సమాలోచన, రూపపకల్పన ప్రక్రియలను సత్వరం పూర్తి చేసి ప్రధాన ఆకృతులను సిద్ధం చేసే నార్మన్ పోస్టర్డ్ సంస్థకు అందించడానికి కమిటీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇందులో భాగంగా విజయవాడలో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తోంది. తొలి రోజు సమావేశం విజయవాడలోని సీఆర్డీఏ సమావేశ మందిరంలో డాక్టర్ పరకాల అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నవీన రాజధాని నిర్మాణంలో తెలుగు వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతులను ఎలా అంతర్భాగం చేయాలనే అంశంపై సమాలోచన సాగించారు. నవ నగర సమాహారంగా ఉండే అమరావతికి నగర ముఖద్వారాలు ఎలా ఉండాలి, నిర్మాణ శిల్పం ఎలా అమరాలి..? నిర్మాణ శైలిలో మన సంస్కృతి, వారసత్వసంపద, చరిత్రలను ఎలా నిక్షిప్తంచేయాలనే అంశం పై ఈ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తుందని, నార్మన్ పోస్టర్డ్ సంస్థ తుది ఆకృతిలో ఇవన్నీ పొందుపర్చడానికి వీలుగా సాధ్యమైనంత వేగంగా ఈ బాధ్యతల్నిపూర్తిచేయాల్సి ఉంటుందని నిష్ణాతుల కమిటీ సారధి డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు.

9 నగరాల్లో ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకతతో ఉంటుందని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని సూచనలు చేయాలని కోరారు. రాజధాని శంకుస్థాపనకు దేశం నలుమూలల నుంచి అలాగే రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, వార్డుల నుంచి మట్టి, పవిత్ర జలాలు తీసుకువచ్చారని గుర్తుచేస్తూ ప్రజలందరి ఉమ్మడి భాగస్వామ్యంతో ప్రజా రాజధాని నిర్మాణం సాగుతుందని చెప్పారు. మన రాజధానిలో మన సంస్కృతి ప్రతిబింబించాలన్నది రాష్ట్ర ప్రజలందరు ముక్త కంఠంతో కోరుకుంటున్నారని చెప్పారు. దానికి అవసరమైన సూచనలు చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటయిందని తెలిపారు.

Advertisements

భారతీయ సంస్కృతి, ముఖ్యంగా ఆంధ్రసంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణ శైలి ఉండాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయాన్నివ్యక్తం చేశారు. రాజధానికి దారి తీసే రాహదారులకు, భారీ భవంతులకు, ఇతర ముఖ్య కట్టడాలకు మన చరిత్రను స్పూర్తించేలా తగిన నామకరణం చేయాలని కూడా సమావేశం అభిప్రాయపడింది. ప్రాచనీ కాలం నుంచి ఆధునిక కాలం నుంచి అన్ని ప్రాంతాల సంస్కృతి ప్రతిఫలించాలని కొందరు సూచించారు.

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేసుకోవాలని కొందరు సూచించారు. రహదారి కూడళ్లలో రాతి నిర్మాణాలు ఉంటే కళ్లకు ఇంపుగా ఉంటాయనే భావన వ్యక్తమైంది. పరిపాలన భవనాలకు చారిత్రక నామాలు పెట్టాలని ప్రతిపాదించారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన అమరావతిని అనేక శాతావాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు సహా అనేక రాజవంశాలు పరిపాలించాయని, అలాగే కొద్ది కాలం పాటు బౌద్ధం విలసిల్లిందని, ఆ సంస్కృతి సంప్రదాయాలన్ని నిర్మాణ శైలిలో ప్రతిఫలించాలని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి చెప్పారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చతురస్ర ఆకారంలో ఉండాలని, పరిపాలన భవనాలకు సంబంధించి మన తెలుగు రాజుల వారసత్వ సంపద కళ్లకు కట్టేలా చూడాలని సూచించారు.

నగరం మొత్తం ఒకే వర్ణంలో ఉంటే అద్భుతంగా ఉంటుందని సినీ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చెప్పారు. భవంతులు వెలుపలి భాగంలో కనీసం 5 అంశాలు మన సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించేలా ఉంటే చాలునని, భవనాల ఇంటీరియర్లో మన చరిత్రను తీసుకోవచ్చునని ఆనంద్ సాయి చెప్పారు. అక్కడక్కడ రాతి మండపాల నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ఆంధ్ర చరిత్ర అంటే అందులో ఉత్తరాంధ్ర చరిత్ర ఉండడం లేదని, కొత్త రాజధానిలోనైనా కళింగ సామ్రాజ్యపు ఆనవాళ్లు ఉంటే న్యాయం చేసినట్లు అవుతుందని సాంస్కృతిక శాఖ విజయభాస్కర్ అన్నారు. నాలుగు, ఐదు బౌద్ద జాతక కథలలో కళింగ పట్టణం ఓడరేవు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. కొత్త రాజధానిలో కళింగ సంస్కృతి, వారసత్వం కనిపించాలని చెప్పారు. తెలుగురాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సంస్కృతిని కొత్త రాజధాని నిర్మాణం ప్రతిఫలించాలని చరిత్రకారుడు ఈ శివనాగిరెడ్డి అన్నారు. చరిత్రలో చిన్న చిన్న తెలుగు సామ్రాజ్యలు అనేకం ఉన్నాయని, ఆయూ సంస్కృతులన్నీ రాజధానిలో ఎక్కడో అక్కడ కనిపించేలా నిర్మాణాలు చేయాలని చెప్పారు.

ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను తీడ్రి మోడల్ నమూనా చిత్రాలుగా రూపొందించివాటిని నార్మన్ ఫోస్టర్డ్ సంస్థకు అందించాలని అమరావతి హెరిటేజ్ సిటీ సలహాదారు గల్లా అమరేశ్వర్ చెప్పారు. రాజధానిలో 1800 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాలు ఉంటాయని, అందులో 600 కి.మీ ప్రధాన రహదారులు ఉంటాయని సీఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారి చెప్పారు. రీజనల్ ట్రాఫిక్ కోసం 3 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నట్లు ఆయన కమిటీ సభ్యులకు వివరించారు. సమావేశనంతరం సభ్యులంతా క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం రాజధాన్ని ప్రాంతాన్ని సందర్శించారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఫిన్ టెక్నాలజీ (ఫిన్టెక్ ) టవర్ నిర్మించేందుకు యస్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్ ముంబైలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను తెచ్చారు.

ఇప్పటికే యస్ బ్యాంక్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో మొలిక సదుపాయాలు, ఐటి రంగాలను విస్తరించింది. భారత్ లో ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్లలో కూడా పలు సంస్థలు నిర్వహిస్తోంది.

దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన అమరావతిలో తమ వ్యాపార సామ్రాజ్యా న్నివిస్తరించుకోవాలన్న ఆసక్తితో ఉంది. దీని పై ముఖ్యమంత్రితో చర్చించిన బ్యాంక్ చైర్మన్ రాణాకపూర్ ఫిన్టెక్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చారు.

<div style="text-align: center;">

Advertisements

</div>

ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పరిశ్రమలకిస్తున్న ప్రోత్సాహకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు వివరించారు. నేరుగా అమరావతి చ్చి స్థానిక పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలని సూచించారు.

పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌ బ్యాంక్‌ ఆసక్తి కనబరిచింది.

మైక్సోసాఫ్ట్ ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ‘ఫ్యూచర్ డీకోడెడ్’ సదస్సులోసమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నది ఆయన వివరించారు. ఐవోటీతో అద్భుతాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్‌లో నిరూపించామని ఆయన తెలిపారు. హుద్‌హుద్‌ వంటి భారీ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. సాంకేతికతతో అన్ని రంగాలకూ భద్రత కల్పిస్తున్నామన్నారు. కలలు కనండి.. వాటిని సాధించడానికి పనిచేయండి (‘డేర్‌ టు డ్రీమ్‌.. స్రైవ్‌ టు ఎచీవ్‌’) అనే నినాదంతో ఏపీ ముందుకు సాగుతుందని చంద్రబాబు తెలిపారు.

ఉపాధి, ఇంటర్నెట్ నాలెడ్డి, గృహ, నీరు, పశు దాణ భద్రత వంటివి కల్పిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలు, రోడ్లు, పరిశ్రమలు తదితర అంశాలపై దృష్టి సారించామన్నారు. డిజిటలైజేషన్ కు సంబంధించి ముఖ్యమంత్రుల కమిటీకి తాను చైర్మన్ గా వ్యవహరిస్తున్నానని, ఇప్పటికే మధ్యంతర నివేదిక అందచేశామని, త్వరలో పూర్తి స్థాయి నివేదిక అందచేస్తామన్నారు. విశాఖను తొలి డిజిటల్ నగరంగా ఆవిష్కరించేందుకు నాంది పలుకుతున్నామన్నారు. సాంకేతికను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ను కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.

Advertisements

రియల్ టైమ్ గవర్నెన్సులో క్రైజాలా యాప్ కీలకపాత్ర వహిస్తోందని, రాష్ట్రంలో 62 వేల మంది పోలీస్ అధికారులు దీన్ని ఉపయోగించి క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని తెలుసుకుంటున్నారని వివరించారు. 14.4 మిలియన్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, మరో సిలికాన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్వహణలో కీలకమైన క్లౌడ్-ఫస్ట్ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. రాష్ట్రంలో నైపుణ్యాల ఉపాధి కల్పన పై సత్య నాదెళ్లతో సిఎం చర్చించారు. రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్సులో మైక్రోసాఫ్ట్ తో కలిసి ప్రయోగం చేయబోతున్నామని తెలిపారు.

తీవ్ర ఆర్ధిక లోటు ఒక పక్క.... అయినా సరే, ఎలక్షన్ హామీలు ఎలా అయినా తీర్చాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు... రైతు రుణమాఫీ లాంటి అతి పెద్ద కార్యక్రమం చేస్తూ, 1000 రూపాయలు పెన్షన్ లు ఇస్తూ, ఎలక్షన్ హామీలలోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, ముందుకు సాగుతున్న చంద్రబాబు, ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, నిరుద్యోగ బృతి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రెండు, మూడు మోడల్స్ కూడా వర్క్ అవుట్ చేసారు... ఎలాగైనా ఇది, మార్చ్ 13న ప్రవేశపెట్టే బడ్జెట్ లో చేర్చాలి అని చంద్రబాబు అధికారులని ఆదేశించారు.

రుణ మాఫీ, పెన్షన్ లు లాగానే, నిరుద్యోగ బృతి కుడా చాలా పకడ్బందిగా ఇవ్వనున్నారు. ఇందుకోసం, అన్ని రకాలుగా అవసరమైన టెక్నాలజీ, డేటా, ఉపయోగించుకోనున్నారు. ఎవరికీ పడితే వారికి కాకుండా, నిజమైన లబ్దిదారులకు ఇది ఉపయోగపడే విధంగా, నిరుద్యోగ బృతి ఇవ్వనున్నారు.

Advertisements

చంద్రబాబు సూచించిన దాని ప్రకారం:
ఎంప్లొయ్మెంట్ ఎక్స్చేంజి ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
అలాగే, రిజిస్టర్ చేసుకుని, కనీసం 5 సంవత్సరాలు అయ్యి ఉద్యోగం రాకుండా ఉన్న వాళ్ళు అర్హులు.
ఈ నిరుద్యోగ బృతి, నెలకు రెండు వేలు చొప్పున, కొత్త ఉద్యోగం వచ్చే వరకు, లేఅకపోతే, 2 కాని 3 సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తారు.
దీని కోసం, సంవత్సరానికి, 1000 కోట్లు కేటాయించనున్నారు.

విధివిదానాలు ఇంకా ఖరారు కానప్పటికే, అధికారాలతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో, ఇవి ప్రతిపాదించారు... మరో రెండు, మూడు మోడల్స్ వర్క్ అవుట్ చేసి, ఫైనల్ చేద్దాం అని, అధికారాలను ముఖ్యమంత్రి ఆదేశించారు.

అధికారిక రికార్డు ల ప్రకారం, దాదాపుగా 10 లక్షల నుంచి, 20 లక్షల మంది దాకా, ఎంప్లొయ్మెంట్ ఎక్స్చేంజి ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకుని ఉంటారు అని ఒక అంచనా.

ఇదే జరిగితే దేశంలోనే ఇది సంచలన నిర్ణయంగా మారనుంది. వాస్తవానికి నిరుద్యోగ భృతి 2014 ఎలక్షన్ హామీగా ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కారణంగా ఇప్పటి వరకు, అది సాధ్య పడలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్ కు, ఇప్పుడు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. చంద్రబాబు నిరుద్యోగ బృతి ఇవ్వలేడు అని, యువతని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి అనుకున్న జగన్ ఆశల మీద, చంద్రబాబు నీళ్ళు చల్లారు.

మొన్న సంక్రాంతికి విజయవాడలో జరిగిన ఎయిర్ షో చూసారా ? చాలా బాగుంది కదూ.... మనం భావని ఘాట్, పున్నమి ఘాట్ లో నుంచి ఈ విన్యాసాలు చూసాం... మరి, పైన గింగిరాలు తిరిగుతున్న ఆ ఫ్లైట్ నుంచి, కిందకు చుస్తే ఎలా ఉంటుంది ? చూడటమే కాదు, ఆ అనుభూతి మొత్తం, కెమెరాలో రికార్డు చేసారు, ఫ్లైట్ పైలట్స్.... విన్యాసాలు మొత్తం రికార్డు చేసారు...

Advertisements

ఎయిర్ షో చేయటానికి ఉపయోగించిన నాలుగు ఫ్లైట్స్ కు కెమెరాలు పెట్టి, విన్యాసాలు రికార్డు చేసారు.... విమానాలు గింగిరాలు తిరుగుతూ, పొగ వదులుతూ, పొగతో రక రకాల ఆకృతులు చెయ్యటం వంటి విన్యాసాలు అన్నీ, ఈ కెమెరాలు రికార్డు చేసాయి. పై నుంచి, మన ప్రకాశం బ్యారేజి, కృష్ణా నది, బెజవాడ నగరం ఎలా ఉందో ఈ వీడియో లో మీరే చూడండి..

కనకదుర్గ గుడి టోల్‌ గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఉన్న రోడ్డుకు నేషనల్ హైవే అథారిటీ మరమ్మతులు చేపట్టనున్న సందర్భంగా నెల రోజుల పాటు ఈ మార్గాన్ని మూసివేశారు. దీంతో ఈ మార్గంలో 30రో జుల పాటు ఎలాంటి వాహనాల రాకపోకలకు ఇటు వైపు నుంచి అనుమతించరు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లిస్తూ పోలీసులు చర్యలు చేపట్టారు.

బుధవారం అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందువల్ల నగర ప్రజలు, వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీస్ శాఖ సూచించింది.

Advertisements

విద్యాధరపురం, ఇబ్రహింపట్నం వైపు వెళ్లే వాహనాలు బీఆర్పీ రోడ్డు, వీజీ చౌక్‌, చిట్టినగర్‌ నుంచి సొరంగం మార్గం ద్వారా వెళ్లాలి. వయా ఎర్రకట్ట, సొరంగ మార్గంలోనూ ప్రయాణించవచ్చు వైవీరావు ఎస్టేట్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, సితారా జంక్షన నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలు గొల్లపూడి సెంటర్‌, సితారా జంక్షన, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, మిల్క్‌ ఫ్యాక్టరీ, చిట్టినగర్‌, వీజీ చౌక్‌, పంజా సెంటర్‌, రైల్వే దక్షిణ బుకింగ్‌ రోడ్డు, లోబ్రిడ్జి మార్గంలో రావాలి. గొల్లపూడి సెంటర్‌, సితార జంక్షన, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, వైవీరావు ఎస్టేట్‌, పైపుల రోడ్డు, సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్డులో రాకపోకలు సాగించవచ్చు.

గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యత పై ప్రతిపాధనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టరు బాబు.ఎ. రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ఏర్పాటుపై కంపెనీ ప్రతినిధులు, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా, రెవిన్యూ అధికారులతో బుధవారం ఎయిర్ పోర్టు లాంజిలో జిల్లా కలెక్టరు బాబు.ఎ. ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐటి సూట్ గా తీర్చిదిద్దేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇందులో ఎపిఐఐసికి చెందిన కేసరపల్లిలోని భూములను హెచ్.సి.ల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టరు పరిశీలించారు.

<div style="text-align: center;">

Advertisements

</div>

ఎయిర్ పోర్టు పరిశర ప్రాంతాల్లో నిర్మించే భవనాలకు ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియూ వారి అనుమతి తప్పనిసరిగా కావడంతో దీనిపై ఎయిపోర్టు అధికారులతో కలెక్టరు చర్చించారు.

పరిశీలనలో జిల్లా కలెక్టరు తో పాటు హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టు కంపెనీ ప్రతినిధులు, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్.రంగయ్య, గన్నవరం తాహసిల్టారు మాధురి, ఎపిఐఐసి అధికారులు తదితరురు ఉన్నారు.

ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌.. విజయవాడ నగరంలో ఎలక్ర్టానిక్‌ పరికరాల వ్యాపారానికి కేంద్రం.... కాని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో త్వరలో "హార్డ్ వేర్ బజార్"ను ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. నగరంలోని ఆటోనగర్లో జరిగిన 8 ఐటీ కంపెనీల ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు.

సర్కిల్-2 పరిధిలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్సులో అదనంగా పై అంతస్తు నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. రూ. 9కోట్ల 90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు అంతస్తులో దాదాపు 128 షాపులు నిర్మిస్తున్నారు. ఇందులోనే "హార్డ్ వేర్ బజార్"ను ఏర్పాటు చేయనున్నారు. 2017 జూన్ నెలలో ఈ హార్డ్ వేర్ బజార్ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు.

Advertisements

హార్డ్ వేర్ రంగానికి సంబంధించిన ఏ చిన్న వస్తువయినా ఇక్కడ లబిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. హార్డ్ వేర్ రంగానికి సంబంధించి చిన్న చిప్ దగ్గరి నుంచి భారీ హార్డ్ వేర్ వస్తువులు ఇక్కడ లభించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం, ఎన్టీఆర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 119 షాపులు ఉన్నాయి.

రేపటి నుంచి గన్నవరం-కాశీ మధ్య బోయింగ్‌ సర్వీస్ మొదలుకానుంది. 189 మంది ప్రయాణికులు పట్టే భారీ బోయింగ్‌ 737- 800, విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు, ఎయిర్‌బస్‌ - 320 లాంటి పెద్ద విమానలనే చుసిన గన్నవరం ఎయిర్‌పోర్టు, ఇప్పుడు బోయింగ్‌ 737- 800 లాంటి భారీ విమానాన్ని చూడనుంది. గన్నవరం విమానాశ్రయం చరిత్రలోనే ఇంత పెద్ద భారీ విమానం నడవటం ఇదే మొదటిసారి. గన్నవరం నుంచి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశీకి నేరుగా ప్రత్యేక విమానం అందుబాటులోకి తీసుకురానుంది స్పైస్ జెట్.

ఈ ఫ్లైట్ సర్వీస్ రేపటి నుంచి (ఫిబ్రవరి 19) నుంచి, మధ్యాహ్నం 2.40కి గన్నవరం నుంచి బయలుదేరి, సాయంత్రం 6.50కి వారణాశి చేరుకుంటుంది. తిరిగి మర్నాడు ఉదయం 10 గంటలకు వారణాశిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

Advertisements

కేవలం 4 గంటల 15 నిమిషాల్లో కాశీకి చేరుకునేలా భారీ విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటివరకూ వారణాసికి విమానంలో వెళ్లాలంటే ఇక్కడి నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులో ఢిల్లీకి చేరుకుని ఆక్కడి నుంచి మరోటి మారాల్చి వస్తోంది. రైలు, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు 30 గంటల పైనే పడుతోంది. నేరుగా విమాన సర్వీసు అందుబాటులోనికి రావడం వల్ల నాలుగు గంటల్లోనే కాశీకి చేరుకునేందుకు వీలుంటుంది.

ఆంధ్రప్రదేశ్ తొలి పరిపాలనా రాజధాని విజయవాడను సరికొత్త ఐటి కంపెనీలు పలకరిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత, రాజధాని అమరావతి ప్రాంతానికి ఏ కంపెనీలు రావట్లేదు అనుకునేవారికి ఎట్టకేలకు కొంత ఉపసమనం.

మొదట విడతగా, విజయవాడలో ఫిబ్రవరి 16న ఎనిమిది ఐటి కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
విజయవాడ, ఆటోనగర్ ప్రాంతంలో, ఈ ఎనిమిది ఐటి కంపెనీలు ఫిబ్రవరి 16న ప్రారంభం అవుతాయి.

Accel IT, Horizon IT, AdvanSoft (Chicago), MSR Cosmos, Adept Solutions, Intellisoft and TimesquareIT

అలాగే హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన,15 ఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా, సుమారుగా 3000 మందికి, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తారు.

Advertisements

ఎంతో కాలంగా, నిరుపయోగంగా ఉన్న గాన్నవరంలోని మేధా టవర్స్ కూడా త్వరలో జీవం పోసుకోనుంది. స్పెయిన్ కు చెందిన Grupo Antolin త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే HCL, Neslova Systems కూడా త్వరలో మేధా టవర్స్ నంచి పని చేయ్యనున్నాయి.

ఈ పరిశ్రమల రాకతో, రాజధాని ప్రాంతంలో ఐటి పరిశ్రమలకు పెద్ద ఊతమిచ్చినట్లు అవుతుంది. HCL లాంటి పెద్ద కంపెనీ రాజధానిలో కాలు మోపితే, దాని బాటలో మరి కొన్ని పెద్ద కంపెనీలు వచ్చే అవకాసం ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనే కాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగం అంతగా ఉనికి చాటుకోలేదు. కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

తెలుగు సినిమా చరిత్రకు 85 వసంతాలు... తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’విడుదలై నేటికి 85 సంవత్సరాలు.. 1932 ఫిబ్రవరి 6న, భక్త ప్రహ్లాద విడుదల అయ్యింది. అందుకే, తెలుగు సినిమా పుట్టిన రోజుని, ఈ రోజుగా జరుపుకుంటారు. HM రెడ్డి గారు తొలిసారిగా "భక్త ప్రహ్లాద" సినిమాను నిర్మించారు. 5 - 2 - 1932 నాడు ఆ సినిమా విడుదల అయింది. మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్‌లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది.

ఆనాటి నుంచి నేటి వరకు సినిమా రంగం రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతూ ఇవాళ విశ్వవ్యాపితం అయింది. మొన్నమొన్నటి వరకు రాష్ట్ర సరిహద్దులు దాటని తెలుగు సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతూ అభిమానులను అలరిస్తుంది. ఎనభై అయిదేళ్ల సుదీర్ఘ కాలంలో వేలాదిమంది నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు తమ జీవితాలతో పాటు తెలుగు సినిమాకు కళాసేవ చేశారు.

బెజవాడ మారుతి థియేటర్లో తోలి సినిమా: ఇండియాలోనే తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ మారుతి థియేటర్లో ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రదర్శించడానికి బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా ప్రొజెక్టర్లను తెప్పించారు. తరువాత తొలి తెలుగు టాకీ సినిమా "భక్త ప్రహ్లద" ఇదే ధియేటర్లో ఆడింది.

Advertisements

తెలుగు సినిమా విజయవంతంలో విజయవాడదే అగ్రస్తానం. ఇక్కడ సినిమా పరిశ్రమ వేళ్ళూనుకుంది. తెలుగు సినిమాకు 85 సంవత్సరాలు నిండితే, ఆంధ్రప్రదేశ్ లో, తోలి సినిమా హాలు మారుతి ధియేటర్ విజయవాడలో నిర్మించి, 95 ఏళ్ళు అయ్యింది.

విజయవాడలో ప్రఖ్యాత సినిమాహాళ్లు అప్పట్లో చాలానే ఉండేవి. 1921లో మారుతీ ధియేటర్, 1928లో దుర్గా కళా మందిరం, 1929 లక్ష్మీ టాకీస్, 1939లో రామాటాకీస్, 1940లో సరస్వతీ టాకీస్, 1944లో లీలామహల్ (ఆంద్రాలో ప్రత్యేకంగా ఇంగ్లీషు సినిమాలను ప్రదర్శించడానికి ఈ సినిమా హాల్ నిర్మించారు), 1948లో జైహింద్ టాకీస్, 1949లో జవహర్ థియేటర్ (విజయా టాకీస్), 1950లో శేష్ మహల్, 1951లో రాజస్తాన్ థియేటర్( వినోదా టాకీస్), 1952లో ఈశ్వర మహల్, ఆ తరువాత షహన్షా మహల్ (ఇప్పటి నవరంగ్ థియేటర్), శ్రీనివాస మహల్ ఇలా పలు థియేటరులు వచ్చాయి. ఇప్పుడు వీటిలో రెండు, మూడు మినహా అన్ని థియేటర్లు కనుమరుగు అయిపోయాయి. 1954లో ఆంద్రా ఫిలిం ఛాంబర్ వచ్చింది.

విశాఖపట్నంలో క్వాలిటీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించిన కె.మంగరాజు, ఆ తర్వాత పేరు మార్చి విజయవాడలో పూర్గా పిక్చర్స్ను ఏర్పాటు చేసి ప్రథమ సినిమా పంపిణీదారుడుగా ప్రసిద్ధి పొందారు. అప్పట్లోనే 11 పంపిణీ సంస్థలు విజయవాడలో ఉండేవి. సినిమాలకు కావాల్సిన ప్రచారం కోసం అవసరమైన లిధో ప్రెస్సులు, పబ్లిసిటీ సంస్థలు, వంటివి చాలా వెలిసాయి. అప్పట్లో సినిమా, అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి బాగా ఉండేది.

గౌతమిపుత్ర శాతకర్ణి - ఇది ఒక సినిమా మాత్రమే కాదు.. ఒక చరిత్ర... ఇది బాలకృష్ణ సినిమా కాదు, ఒక తెలుగు వీరుడి వీరోచిత గాథ... ఇది తెలుగుజాతి ఖ్యాతిని నేల నలుచెరుగులా విస్తరించి దేశం మీసం తిప్పిన ఒక అమ్మ కొడుకు చరిత్ర... వివిధ రాజ్యాల,ఘణాలుగా విడివడి ఒకరికొకరు కొట్టుకు చస్తున్న వారందరినీ ఓడించి ఒకే ఛత్రం కిందకి తీసుకువచ్చి అఖండ భారతావనిని సృష్టించిన ఒక తెలుగు వీరుని చరిత్ర... రాజసూయ యాగం నిర్వహించి.. ఒక కొత్త శఖానికి ఆద్యం పోసి ఉగాది అంటూ మనమందరం జరుపుకునే పండుగకి నాంది పలికిన ఒక తెలుగు సార్వభౌముడి చరిత్ర....నిజం ఇది సినిమా కాదు మన చరిత్ర... ప్రతి తెలుగువాడు చూసి తెలుసుకోవాల్సిన చరిత్ర... మన మూలాలు ఎంత బలమో.. మన నెత్తురుకి ఎంత సత్తువ వుందో మనకి తెలిపే చరిత్ర....

తెలుగు జాతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహారాజులు, చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ జాతికీ తీసిపోని ఖ్యాతి తెలుగువారి సొంతం. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత.. మళ్లీ అంతటి అఖండ భూభాగాన్ని ఒకే ఏలుబడిలోకి తెచ్చిన పరాక్రమం శాతవాహనులది. ఆ వంశంలో 23వ చక్రవర్తి... భారతదేశచరిత్రలో నిలిచిపోయి వీరాధివీరుడు.. గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పుడు ఆ శిఖరసమానుడి ఘనత వెండితెరపై నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా, క్రిష్ అధ్బుతంగా మన చరిత్రను మన కళ్ళ ముందు ఉంచాడు.

శాతకర్ణి పాత్రలో బాలయ్య నటన అద్భతం.... నిజం గా శాతకర్ణి బాలయ్యకు పున్నాడేమో అన్నట్టు ఉంటుంది కొన్ని సన్నివేశాల్లో.. తరతరాలుగా తెలుగుజాతి మీద జరుతున్న ప్రతి కుట్రను ... ప్రతి అవమానాన్ని ... గౌరవ మర్యాదల కట్టుబాట్ల మద్య నిశ్శబ్దంగా భరిస్తూ , సహిస్తూ, ఎన్ని కుట్రలు పన్ని తొక్కాలని చూసినా ఎగిరొచ్చి, ఆకాశాన్ని తాకాలన్ని పొగరుగా ముందుకురికే తెలుగోడి కసితో రగిలిపోతున్న తెలుగోడి ఆత్మగౌరవ సమర శంఖారావం అయిన ఈ గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు.

మాటాల రచయత బుర్రా సాయి మాధవ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే... ఆ మాటల్లో తెలుగువాడి పౌరుషం ఏంటో తెలుస్తుంది... ఒక డైలాగ్ ఇక్కడ ప్రస్తావించాలి... ఆ హీరో, ఈ హీరో అని... ఆ కులం, ఈ కులం అని.... ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని కొట్టుకునే మన అందరం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది....
"వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. నా దేశం ఉమ్మడి కుటుంబం, గది కి గది కి గోడలుంటాయ్ గొడవలుంటాయ్. ఈ ఇళ్ళు నాదంటే నాదని కొట్టుకుంటాం కానీ ఎవడో వచ్చి ఈ ఇళ్ళు నాదంటే ఎగరేసి నరుకుతాం.. సరిహద్దుల్లోనే మీకు స్మశానం నిర్మిస్తాం,మీ మొండేలా మీదే మా జెండా ఎగరేస్తాం...."

ముఖ్యంగా ఈ సినిమాలో, తెలుగుజాతి ఖ్యాతి, గౌర‌వం గురించి, ఉగాది ప్రాముఖ్య‌త గురించి, మరీ ముఖ్యంగా మన అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడ్డు ప్రతి సారి, అణచుకోలేని భావోద్వేగం, నిక్కబొడుచుకున్న రోమాలు, ఇదా మన వీరోచిత గాథ అని ఉప్పొంగిపోయే భావన, గర్వంగా ఎగరేసిన తల వంటి అనుభూతులు కలగని ప్రేక్షకుడు ఉండడు.. బాలయ్య ను కళ్ళలోకి చూడాలంటే నే కొన్ని సందర్భాలలో భయం వేసింది ... నిజం గా శాతకర్ణి బాలయ్యకు పున్నాడేమో అన్నట్టు ..

చూసే ప్రతి కంటికీ కన్నుల పండుగ "గౌతమీ పుత్ర శాతకర్ణి ".. ప్రతి గుండెనీ మండే కాగడాలా మార్చేసిన "గౌతమీ పుత్ర శాతకర్ణి ".. పడమటి గాలి వెర్రిగా వీస్తున్న వేళ జాతి జవసత్వాలకి ప్రాణం పోసి నెత్తురు మరిగించిన పౌరుష జ్వాల "గౌతమీ పుత్ర శాతకర్ణి ".. ఖండాలుగా విడివడి ఉన్న అఖండ భారతావనిని ఏకం చేస్తూ యుద్ధాలకి ముగింపు పలికేందుకు యుద్ధానికి నాంది చెప్పి, తెలుగువాడి వాడి, వేడి చాటిన ఒక మహనీయుని చరిత్ర - మనమెరుగని చరిత్రని మనసుకి హత్తుకునేలా చూపి, తెలుగు చిత్రసీమ మకుటాన దర్శకుడు క్రిష్ పొదిగిన వజ్రం....

సమయం లేదు మిత్రమా... అమరావతి రాజధానిగా సమస్త భూమండలానికి నాడు గౌతమిపుత్రుడు పంపిన సందేశం మనకి స్ఫూర్తి కావాలి..ఆ స్పూర్తితో ప్రతి రంగంలోనూ తెలుగువాడు సత్తా చాటాలి..నేడు అదే అమరావతి నుండి మన నవ్యాంధ్ర ప్రయాణం మొదలైంది... ఇప్పుడు కుడా, సమస్త భూమండలానికి అదే సందేశాన్ని తిరిగి పంపుదాం.. జయహో అమరావతి.... జయహో శాతకర్ణి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ వేడుకకు రెడీ అవుతున్న సందర్భంలో, ఇంకోక ఆశ్చర్యాన్ని కలిగించే వార్తా. గౌతమీపుత్ర శాతకర్ణిలో టీడీపీ మహిళా నేత నటించారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Advertisements

అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మహిళా ఎమ్మెల్సీ శమంతకమణి, బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో రెండు నిమిషాల సన్నివేశంలో నటించారు. చిత్రంలో ఓ మార్కెట్‌లో వ్యాపారురాలి పాత్రను శమంతకమణి పోషించారు.

బాలకృష్ణ కూడా, అనంతపురం జిల్లా నుంచి, హిందూపురం ఎమ్మెల్యేగా పని చేస్తున్న విషయం తెలిసిందే

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం మొదలుపెట్టిన దెగ్గర నుంచి అన్నీ సెన్సేషన్స్. బాలయ్య ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, నిన్నటి టీజర్ దాకా, విమర్శకులు ప్రశంసలు అందుకుంది. తిరుపతి వెంకన్న సన్నిధిలో డిసెంబర్ 26న, వైభవంగా ఆడియో వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జురుగుతున్నాయి.

గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం కోసం రూపొందించిన ఆహ్వాన పత్రం ఇప్పుడు మరో సెన్సేషన్ అయ్యింది. ఎప్పుడు లేని విధంగా, గౌతమిపుత్ర శాతకర్ణి డిజిటల్ ఆడియో ఇన్విటేషన్ అదిరింది. ఈ డిజిటల్ ఇన్విటేషన్ లో మొత్తం నాలుగు భాగాలు ఉండగా.. 1 నంబర్ ప్రెస్ చేస్తే.. బాలయ్య గురించి.. 2వ నంబర్ లో క్రిష్ గురించి ఆడియో వీడియో విజువల్స్ వస్తాయి. ఇక 3వ నంబర్ లో శాతకర్ణి ట్రైలర్ ను ఉంచగా... 4ను ప్రెస్ చేసినపుడు ఆడియో రిలీజ్ వేడుక.. వేదిక.. తేదీ.. సమయం.. అతిథుల లిస్ట్ వస్తుంది.

గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు.

గౌతమిపుత్ర శాతకర్ణి డిజిటల్ ఆడియో ఇన్విటేషన్ మీకోసం

శాతవాహన సామ్రాజ్య సింహద్వారం "కోటిలింగాల" సాక్షిగా శతచిత్ర యోధుని "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్ విడుదల. శాతవాహనుల రాజధానిగా వర్థిల్లిన జగిత్యాల జిల్లా కోటిలింగాలలో దర్శకుడు క్రిష్‌తో కలిసి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారికి దేశాన్ని, చరిత్రను అందజేసిన మహానుభావుడు శాతకర్ణి అని పేర్కొన్నారు. తారకరాముని వారసునిగా శాతకర్ణి చరిత్ర ప్రజలకు తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదే "గౌతమిపుత్రశాతకర్ణి" ట్రైలర్

బాలయ్య 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్ర యాత్రను ప్రత్యేక వాహనంలో నిర్వహిస్తున్నారు బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్. ఈ నేపధ్యంలో శనివారం భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర వాహనం విజయవాడ చేరుకుంది. ఇంద్ర‌కీలాద్రి పై ఉన్న కనకదుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్ర‌కీలాద్రికి, జగన్ రాకతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

Advertisements

వంద పుణ్యక్షేత్రాలకు గౌత‌మీ పుత్ర శాతక‌ర్ణీ డిజైన్ల‌తో, తొమ్మిది వాహనాలను పంపి అక్కడి ఆలయాల నుంచి సేకరించిన కుంకుమతో డిసెంబరు 16న తిరుపతి వెంకన్న సమక్షంలో జరిగే ఆడియో ఫంక్షన్‌లో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు అభిమానులు తెలిపారు.

అరకు అంటే ప్రకృతి అందాలు, అమాయక గిరిజనం, మనల్ని మనం మరిచిపోయే కొండకోనలు దృశ్యాలు గుర్తొస్తాయి. అంతేనా..? ప్రపంచాన్నే కట్టిపడేసే అర్గానిక్ కాఫీ రుచికి కూడా కేరాఫ్ అడ్రస్ అరకే. ఏజెన్సీ ఏరియను దాటి ప్రస్తుతం సప్తసముద్రాల అవతల ఉన్న కాఫీ ప్రియులను సైతం మైమరింపచేస్తోంది అరకు కాఫీ.

ఇప్పటివరకు అరుదైన నాణ్యత గల ఉత్పత్తులు పారిస్ వంటి నగరాల నుంచి భారతదేశానికి వస్తుంటాయి. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా మన తెలుగింట పండిన అరకు కాఫీ విదేశంలో గుభాళిస్తోంది. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో, అరకు ప్రాంతంలో భారీ ఎత్తున కాఫీ సాగును ప్రోత్సహించడమే కాకుండా, అరకు కాఫీని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అమోఘం. చంద్రబాబు దార్శనికత ఫలితంగా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత పారిస్ మార్కెట్ లోకి అరకు కాఫీ అడుగు పెడుతోంది. ప్రపంచంలో టాప్ కాఫీ బ్రాండ్ లకి, పోటీ ఇవ్వనుంది, మన అరకు కాఫీ..

చంద్రబాబుతో పాటు నాలుగు వ్యాపార దిగ్గజ సంస్థల అధిపతులు కూడా ఈ కృషిలో భాగస్వాములయ్యారు. మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా నిర్మాణ సంస్థ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్ లు పారిస్ లో అరకు కాఫీ మొదటి స్టోర్ ప్రారంభం అయ్యేందుకు కారణమయ్యారు. ఈ సంస్థల ఆధ్వర్యంలో 20,000 ఎకరాలలో కాఫీ పంట సాగవుతోంది. ఈ సంస్థలే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్ ను తెచ్చి పెట్టారు. ఇప్పుడు అరకు కాఫీ పారిస్ లో అడుగుపెట్టడం అన్నది 150 గిరిజన తెగల విజయం. ఐదు వేరియెంట్లలో అమ్ముడు కానున్న అరకు కాఫీ ధర కిలో రూ.7,000లుగా ఉండనుంది.

Advertisements

విశాఖ మ‌న్యంలో గిరిజ‌నులు పండిస్తున్న కాఫీకి చంద్ర‌బాబు త‌న వంతు ప్ర‌మోట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు దేన్నైనా ప్ర‌మోట్ చేయాల‌నుకుంటే దాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లే వ‌ర‌కు వ‌ద‌ల‌రు. తాజాగా ఆయన విశాఖ మన్యం అరకులో పండిస్తున్న అరకు కాఫీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. రాష్ట్రానికి వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే.. వారికి అరకు కాఫీని రుచి చూపించి.. దాని గొప్పతనం వివరించి చెప్పటమే కాదు.. అరకు కాఫీ మీద సర్వత్రా ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఈ కాఫీని గిఫ్ట్‌గానూ ఇస్తున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన ‘అరకు కాఫీ’, ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో ఆర్గానిక్ కాఫీ మార్కెట్లోకి వస్తోంది. ఈ కాఫీ తయారీకి గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలకు అనువైన వాతావరణం ఉంది. ప్రస్తుతం అక్కడ 96,337 ఎకరాల్లో కాఫీ పంట సాగవుతోంది. ఇందులో అరబికా రకాన్నే గిరిజన రైతులు అత్యధికంగా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ అరకులో పండించే అరబికా రకం కాఫీకి మంచి డిమాండ్ ఉంది.

తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్‌ తర్వాత మేరీ మాత చర్చ్‌ అనగానే విజయవాడలోని గుణదల జ్ఞప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ పర్వదినాల్లో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.

దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం – గుణదల మేరీమాత చర్చి. ఫ్రాన్సులోని లూర్థు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్‌ను పోలినట్టుగా విజయవాడ శివారులోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్‌ తర్వాత మేరీ మాత చర్చ్‌ అనగానే గుణదలే జ్ఞప్తికి వస్తుంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ రోజున పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న క్షేత్రం కనుక ఈసారి మరిన్ని హంగులతో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017 ఉత్సవాలకు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు హాజరవడానికి సిద్ధపడుతున్నారు.

చరిత్ర: అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్‌ జోసఫ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. దానికి రెక్టర్‌గా ఇటలీకి చెందిన ఫాదర్‌ పి. అర్లాటి నియుక్తులయ్యారు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. కాలక్రమంలో ఈ క్షేత్రం జనాదరణ పొందడంతో 1971లో పూర్తిస్థాయి చర్చి నిర్మితం అయ్యింది. గుడి అంకురార్పణ జరిగిన నాటి నుంచి అనాథబాలలు, క్రైస్తవ మత కన్యలు, కథోలికులు (క్యాథలిక్స్‌) ప్రతి ఏటా ఫిబ్రవరిలో అక్కడ మరియమ్మ (మేరీ మాత) ఉత్సవాలు నిర్వహించు కునేవారు. 1933లో ఫాదర్‌ అర్లాటి ఆ«ధ్వర్యంలోనే ఈ కొండ శిఖరాగ్రాన ఓ శిలువ ప్రతిష్ఠితమైంది. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన కథోలికులు, ఫాదర్‌ అర్లాటి ఆధ్వర్యంలో కొండపై ఆరోగ్యమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు.

Advertisements

1947 నుంచి తిరనాళ్ళు: 1946లో అప్పటి ఫాదర్‌ బియాంకి, జిప్రిడా, బ్రదర్‌ బెర్తోలి, ఎల్‌క్రిప్పాలు గుణదల కొండపై మరియమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి, గుహ వద్ద భారీగా బలిపీఠాన్ని నిర్మించతలపెట్టారు ఇందులో భాగంగా గుహ వద్ద ఉన్న శిలను తొలిచేందుకు పూనుకున్నారు. అయితే 1947లో ఫాదర్‌ బియాంకి అకస్మాత్తుగా ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. నిర్మిస్తున్న బలిపీఠానికి సంబంధించిన నిర్మాణాలు అప్పుడు కురిసిన భారీవర్షానికి కొట్టుకు పోయాయి. అయినా సరే మిగిలిన ఫాదర్లు నిరుత్సాహపడలేదు. ఫాదర్‌ బియాంకి వచ్చే సమయానికి తిరిగి నిర్మాణ పనులు పూర్తిచేశారు. ఫలితంగా 1947లో భారీ స్థాయిలో మరియమాత ఉత్సవాలు జరిగాయి. దక్షిణాన విస్తృత ప్రచారం పొందాయి. 1948లో కలరా ప్రబలిన కారణాన ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా అంతకంతకూ ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయి. ఇవాళ గుణదల మాత ఉత్సవాలంటే తెలియనివాళ్ళు లేరు.

ఫిబ్రవరిలోనే ఎందుకు..?
ఫ్రాన్సులోని లూర్థు నగరం దాపున ఉన్న కొండ అడవిలో బెర్నాడెట్‌ సోబిరస్‌ అనే పధ్నాలుగేళ్ల బాలిక వంట కలప ఏరుకునేందుకు వెళ్లగా అక్కడ మేరీ మాతను పోలిన స్త్రీ కనిపించి మాట్లాడిందని ఆ అమ్మాయి వచ్చి తల్లికి చెప్పింది. ఆ తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీన మరియమాత భక్తులకు కనిపించినందువల్ల అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కనుక గుణదలలో కూడా ఫిబ్రవరి 11న ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి జనవరి 31న నవదిన ప్రార్థనలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూర్వం ఫిబ్రవరి 11న ఒక్కరోజే ఉత్సవాలు జరిగేవి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో గుణదల మాత ఉత్సవాలు నిర్వహణ జరుగుతోంది.

భక్తిశ్రద్ధలతో... శిలువ మార్గం
గుణదల కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుహ నుంచి కొండపైన శిలువ వరకు చెదురుమదురు కాలిబాటలు ఉండేవి. అయితే 1951లో గుహకు ఇరువైపులా ఆర్చిలను నిర్చించి, శిలువ వరకు మెట్లమార్గం ఏర్పాటు చేశారు. ఈ కాలిబాటలో క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే 14 స్థలాల విశిష్టత వివరించేలా, జపమాల పవిత్రతను తెలుసుకునేలా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా నవదిన ప్రార్థనల్లో పుణ్యక్ష్రేతం రెక్టర్‌ చర్చి నుంచి గుహ వరకు దివ్యసత్‌ ప్రసాద పూజను నిర్వహిస్తారు.

మొక్కులు తీర్చుకునే రోజులు
మేరీ మాత ఉత్సవాలు జరిగే మూడు రోజులూ క్రైస్తవులంతా భక్తిప్రపత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు. నవంబర్‌లో జరిగే ప్రత్యేక ఆరాధనలకు, నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సాగే ప్రత్యేక ప్రార్థనలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు రావడం ఆనవాయితీగా వస్తోంది.

కృష్ణా జిల్లాలోనే కాక ఇరుగు పొరుగు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ తిరునాళ్లకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. సోమవారం రాత్రి మెట్టినింటి నుంచి అమ్మవారు బయలుదేరి మంగళవారం సాయంత్రం ఉయ్యూరు ప్రధాన రహదారి పై ఉన్న ఆలయానికి చేరుకుని ఈనెల 26 వరకు భక్తలకు దర్శనమిస్తారు. భక్తులు గండదీపాలతో మొక్కులు తీర్చుకుంటారు. తిరునాళ్ల ముగింపు రోజు రాత్రి ఆలయం నుంచి బయలుదేరి మెట్టినింటికి చేరుతుంది. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం తిరునాళ్ల ప్రాంరభం రోజున ఉయ్యూరు పట్టణ పోలీసులు పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పిస్తారు.

తిరునాళ్లలో 11వ రోజైన, 16వ తేదీన జరిగే శిడిబండి వేడుక వైభవంగా జరుగుతుంది. కొబ్బరితోట ప్రాంతం నుంచి శిడిబండి బయలుదేరి శివాలయం రోడ్డు, ప్రధాన సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

అమ్మవారి చరిత్ర
వీరమ్మతల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలుక పెద్ద కడియం గ్రామంలో బొడు పరుసురామయ్య, పార్వతమ్మ దంపతుల ముదుబిడ్డ శివ వీరమ్మకు ఎనిమిదో ఏట ఉయ్యూరుకు చెందిన పారుపూడి చలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో వివాహం జరిపించారు. వివాహానంతరం యుక్తవయస్సు వచ్చిన శివ వీరమ్మను కాపురానికి పంపారు. చింతయ్య వీరమ్మల సంసారం ఆనందంగా సాగుతున్న సమయంలో కరణం సుబ్బయ్య కళ్ళు వీరమ్మపై పడ్డాయి. ఉయ్యూరు గ్రామం లో ,కరణం సుబ్బయ్య కు స్త్రీ వ్యామోహం ఎక్కువ. ఆమెను లోబరుచుకునేందుకు సుబ్బయ్య చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతని బావమరిదితో చింతయ్యను హతమార్చేందుకు పధకం రూపొందించి చంపుతారు. ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లి పోతుంది. తాను ప్రేమించిన భర్తతో సహ గమనం చేయాలని నిస్చయించుకొంది .

తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకొని, అతని వంశం నిర్వంశం కావాలని శపించింది .సుబ్బయ్య అకస్మాత్తు గా చని పోయాడు .అతనితో అతని వంశము అంతరించింది .వీరమ్మ పుట్టినింటి వారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. ఆమె కోపం వచ్చి పుట్టి నింటి వారిని కూడా ”నిర్వంశం ”కావాలని శాపంపెట్టింది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి ”జిన్నా సాహెబ్ ”అంగీకరించారు. చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు. వీరమ్మ కు అగ్ని గుండం ఏర్పాటు అయింది. గుండం తవ్వ టానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోక పొతే, మాదిగ వారు వచ్చి తవ్వారట అందుకే సిడి బండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Advertisements

ముత్తైదువులు పసుపు దంచుతుంటే, రోలు పగిలింది. వీరమ్మ తల్లి మోకాలు అడ్డు పెట్టి ,తానూ రోకటి పోటు వేసింది. ముత్తైదువులకు పసుపు, కుంకుమలు పంచి పెట్టింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కన్పిస్తుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు భోరున విలపిస్తుండగా, అత్తా మామలు, బంధు గణం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్య స్త్రీలతో, తోడి కొడాలితో ,”పారెళ్ళు ”పెట్టించుకొని, పెళ్లి కూతురులా ,పుష్పాలతో శిరోజాలను అలంకరించుకొని, సాధ్వీమ తల్లి, పతివ్రతా శిరోమణి, వీరమ్మ తల్లి, భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి, భగ భగ మండే ఆ మంటలో తానూ, భర్త చితి పై చేరి అగ్ని గుండంలో సహ గమనం చేసింది. ఆదర్శ మహిళగా, మహిమ గల తల్లిగా ఆ నాటి నుంచి, ఈ నాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకొంటోంది.

అందరూ ఆలోచించి, వీరమ్మ అత్త మామల తో సంప్రదించి, గ్రామస్తులతో సమావేశం జరిపి, సహగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు. చెరువు తవ్వించారు. వీరమ్మ, చింతయ్యల విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు. ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘ శుద్ధ ఏకాదశి రావటం, అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజూ నుంచే ఉత్సవాలు ప్రారంబించటం జరుగుతోంది.

తిరునాళ్ళు పదిహేను రోజుల్లోను, ఉయ్యూరులో ఏ ఇంట్లోను పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు. ముందే సిద్ధం చేసుకొంటారు. కారం కూడా కొట్టరు. ఇవి స్వచ్చందంగా అందరు పాటించే నియమాలే. తిరునాళ్ళ రోజుల్లో, బంధువులను పిల్చుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకొంటారు . ఆమె పవిత్రతను ఇలా తర తరాలుగా పాటిస్తూ, నేటికీ నిలబెట్టు కొంటున్నారు ఉయ్యూరు, పరిసర గ్రామాల ప్రజలు.

విశాఖపట్నం, అది మన నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని... మహా నగరం విశాఖ హుద్‌హుద్‌ తుపాన్‌ దెబ్బకు కుదేలైపోయింది. ఎదుగుతున్న సుందర నగర భవిత ఇక ఇప్పుడు అంధకారమే అనుకున్నారు అందరూ... ఈ రెండు ఏళ్ళలో వైజాగ్, పడింది, లేచింది, నిలబడింది, ప్రకృతి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు పరిగెడుతుంది...ఇది ఆంధ్రావాడి దమ్ము అంటే...

తుఫానుకి అతలాకుతలం అయిన విశాఖ, సంవత్సరం తిరగకుండానే, స్వచ్ఛభారత్‌ మిషన్‌లో ర్యాంకింగ్స్ లో దేశంలోనే 5వ ర్యాంకులో నిలిచింది. దేశంలోనే ఎల్‌ఈడీ లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తొలి కార్పొరేషన్‌గా జీవీఎంసీ ఖ్యాతి గడించింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూ, బ్రిక్స్‌ సదస్సు , భాగస్వామ్య సదస్సుతో విశాఖకు ప్రంపంచ స్థాయి గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు ఏకంగా, రెండో సారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు కు ఆతిథ్యం ఇచ్చేందుకు, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం సిద్ధమవుతుంది.

విశాఖకు సుందర నగరంగానే కాదు, ఉపాధి కేంద్రంగా మంచి పేరు ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా వాసులతో పాటు, ఇటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు కూడా విశాఖలో ఉపాధి అవకాశాలను చూసుకుంటారు. అలాగే, పొరుగున ఉన్న ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కూడా విశాఖకు పొట్ట చేత పట్టుకుని వస్తూంటారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్ధలతో పాటు, వందలాదిగా ప్రైవేటు రంగంలోనూ ఉన్నాయి.

Advertisements

మన నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని ఇలాగే సుందర నగరంగానే ఉండాలి.... పెట్టుబడులు రావాలి... ఎప్పటికీ, శాంతి భద్రతలతో, పూర్తి ప్రశాంతంగా ఉండాలి... ఎదుగుతూనే ఉండాలి... నవ్యాంధ్ర ప్రగతిలో భాగస్వామి కావలి... ఈ క్రింద వీడియో చూడండి, ఎక్కడ నుంచి, ఎక్కడకి వచ్చామో... వైజాగ్ సిటీ ఇలాగే కలకలలాడుతూ ఉండాలి....

శ్రీకాళహస్తి పూర్వ వైభవం సంతరించుకుంది. ఆరేళ్ల క్రితం శ్రీకాళహస్తిలో కుప్పకూలిన రాజగోపురం స్థానంలో, కొత్త గోపురం కొలువుదీరింది. దాదాపు 500 ఏళ్లపాటు శ్రీకాళహస్తికి మకుటాయమానంగా శోభిల్లిన రాజగోపురం 2010లో కూలిపోయిన సంగతి తెలిసిందే. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ గోపురం కూలిన ప్రదేశంలోనే, ఆనాటి నిర్మాణ పద్ధతులతోనే, నవయుగ నిర్మాణ సంస్థ కొత్త గోపుర నిర్మాణాన్ని పూర్తి చేసింది. పాత గోపురానికి అచ్చుగుద్దినట్టున్న కొత్త గోపురాన్ని నిర్మించారు.

పాతగోపుర ప్రాభవం ఇదీ.
గజపతులను యుద్ధంలో ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు తన విజయ ప్రస్థానానికి ప్రతీకగా 1516లో ఈ గోపురాన్ని నిర్మించారు. 96 అడుగుల పొడవు, 64 అడుగుల వెడల్పు, ఏడు అంతస్తులతో 136 అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించారు. ఎలాంటి పునాదులు లేకుండా ఇసుకపైనే దీనిని నిర్మించడం విశేషం. శ్రీకాళహస్తి క్షేత్రానికి చుట్టూ సుమారు 15 కిలోమీటర్ల పరిధి వరకు ఈ గోపురం కనిపించేది.

Advertisements

నవయుగ గోపురం ఇలా.
కుప్పకూలిన రాజగోపురం స్థానంలో సొంత ఖర్చులతో తిరిగి రాజగోపురాన్ని నిర్మించేందుకు నవయుగ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. 2010 ఆగస్టు 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2011 మే 29న పనులను ప్రారంభించిన నవయుగ నిర్మాణ సంస్థ చైర్మన్ చింతా విశ్వేశ్వరరావు నూతన గోపురం వెయ్యేళ్లు వరకు ఉండాలన్న ఆకాంక్షతో, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఏ విధంగా నిర్మించారో అదే రీతిలో తీర్చిదిద్దారు. 92 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పుతో గోపుర నిర్మాణానికి పునాదులు వేశారు. ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున ఈ గోపురాన్ని నిర్మించారు. ఇందులో 35 అడుగుల మేర రాతి కట్టడం. మిగిలిన నిర్మాణాన్ని ఇటుకలతో పూర్తి చేశారు. గోపుర నిర్మాణంలో పాత తరహాలోనే కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డుసొన వినియోగించారు. ఎక్కడా సిమెంటును వినియోగించలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గోవిందరావుపల్లె నుంచి ప్రత్యేక రాళ్లను తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన సుమారు 250 మంది శిల్పులతో చెక్కించిన శిల్పాలను ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ నిర్మాణంలో సుమారు 20 టన్నుల బరువుగల ఒకే రాతిని వినియోగించారు. రూ.50 కోట్ల ఖర్చు చేశారు.

బెజవాడ బెంజ్ సర్కిల్ తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో... విజయవాడకే ఒక గుర్తింపు ఈ బెంజ్ సర్కిల్.. ఒక పక్క చెన్నై, ఒక పక్క మచిలీపట్నం, ఒక పక్క హైదరాబాద్, ఒక పక్క విశాఖ వెళ్ళే రోడ్డులను కలిపే ఈ బిజీ బెంజ్ సర్కిల్ కు ఆ పేరు ఎలా వచ్చింది ? దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అటు చెన్నై, ఇటు కోలకత్తాను కలిపే జాతీయ రహదారాలను కలిపే, బెంజ్ సర్కిల్ అంటే గుర్తుకువచ్చేది ట్రాఫిక్.. ఎటు నుంచి, ఎటైనా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దాటితే, ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో... ఇప్పటి జనరేషన్ కు, బెంజ్ సర్కిల్ అంటే, ట్రెండ్ సెట్ మాల్ అనే ల్యాండ్ మార్క్ స్ట్రైక్ అవుతుంది. అంతటి పెద్ద మల్టీప్లెక్ష్ వచ్చింది మరి. కాని, మన తాతలకి, తండ్రులకి, బెంజ్ సర్కిల్ అంటే గుర్తుకు వచ్చేది అక్కడ ఒక మూలన ఉండే, "బెంజీ కంపనీ". బెంజ్ సర్కిల్ అనే పేరు కూడా, ఆ బెంజ్ కంపెనీ వల్లే వచ్చింది.

ఇప్పుడు ఉన్న బెంజ్ సర్కిల్ పక్కన, B.శేషగిరి రావు & సన్స్ అనే ఆటోమొబైల్ కంపెనీ ఉండేది. తరువాత అది జాస్పర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. బాడిగ శేషగిరి రావు గారు, ఈ కంపెనీ ఫౌండర్. ఈయన, మచిలీపట్నం MPగా పని చేసిన బాడిగ రామకృష్ణ తండ్రిగారు. B.శేషగిరి రావు & సన్స్ , 1955 ప్రాంతంలో, టెల్కో అనే ఆటోమొబైల్ కంపనీకి డీలర్ గా ఉండేది. ఈ టెల్కో కంపెనీనే, ఇప్పటి టాటా మోటార్స్. ఈ షోరోంలో బెంజ్ ట్రక్స్ అమ్మేవారు, ఈ షోరోం కారణంగానే అప్పటి నుంచి ప్రజలు, ఈ ప్రదేశాన్ని, బెంజ్ సర్కిల్ అని పిలవటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీ, జాస్పర్ ఆటో సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో బెంజ్ సర్కిల్లో కార్యకలపాలు చేస్తుంది.

బెంజ్ సర్కిల్లో ఒక విగ్రహం ఉంటుంది, ఎప్పుడైనా గమనించారా ? ఆ విగ్రహం కాకాని వెంకటరత్నం గారి విగ్రహం. వీరు జై ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డిల వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో వీరు కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు.

ఇప్పుడు బెంజ్ సర్కిల్, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఒక ముఖ్య కూడలి. దాదాపుగా రోజుకి 80 వేల నుంచి, లక్ష వరకు వాహనాలు వెళ్తాయి అనేది ఒక అంచనా. బెంజ్ సర్కిల్ ట్రాఫిక్ సమస్య తీర్చటానికి ఇక్కడ ఒక పెద్ద ఫ్లై ఓవర్ కట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మన కలల రాజధాని అమరావతిలో, బెంజ్ సర్కిల్ కు ఒక ప్రత్యెక గుర్తింపు ఉండాలి అని ఆశిద్దాం.

కోయంబత్తూరులో ఉన్న యోగా గురువు సద్గురు జగ్గీవాసుదేవన్ ఈషా యోగా కేంద్రంలో జరగనున్న మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం కోయంబత్తూరు వస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి మహాశివుని విగ్రహాన్ని మోదీ ప్రతిష్ఠించనున్నారు.

Advertisements

ఈ వేడుకల్లో పాల్గునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరు వెళ్తారు. ఈ వేడుకల్లో తమిళనాడు రాష్ట్ర ఇనచార్జ్‌ గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగరరావు, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొననున్నారు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో కూడిన అడ్వాన్సు లైఫ్ సపోర్టు(ఎఎల్ఎస్) అంబులెన్సును సీఎం చంద్రబాబునాయుడు గురువారం వెలగపూడిలోని తాత్కా లిక సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 13 జిల్లాలకు అత్యా ధునిక సాంకేతిక టెక్నాలజీతో కూడిన 76 అడ్వాన్సు లైఫ్ సపోర్టు(ఎఎల్ఎస్) అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఒక్కొక్క అంబులెన్స్ ఖరీదు రూ.32లక్షలగా పేర్కొన్నారు. ఈ అంబులెన్స్లలో 38 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి కామినేని వివరించారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రతి లక్ష మందికి ఒకటి చొప్పన 450 అంబులెన్స్లు ఉన్నట్లు తెలిపారు. వీటిని ఆధునీకరిస్తూ ప్రతి 5 లక్షల జనాభాకు ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అంబులెన్స్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisements

ఈ అంబులెన్సులో టెలీమెడిసిన్ ద్వారా రోగికి ప్రత్యేక వైద్యసహాయం అందించే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి కామినేని వెల్లడిం చారు. త్వరలో ఈ ఎఎల్ఎస్ అంబులెన్స్లలో టెలీ మెడిసిన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఎంపి నిధుల నుంచి రాష్ట్రానికి మరో 13 ఎఎల్ఎస్ అంబులెన్సులు రానున్నట్లు చెప్పారు.

శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.

శివరాత్రి అంటే ఏమిటి? ఎప్పడు వస్తుంది?
శివ అనగా మంగళకరము, శుభప్రదము. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి "చీకటి" అజ్ఞానమునకు సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవు తుంది. అందుకే అది శివరాత్రి, మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశిని, మాస శివరాత్రి పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు.

మార్గశిర మాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Advertisements

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు – “మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”

ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివం అంటే చైతన్యమని, శివుడి నుంచే యోగ సంప్రదాయం వచ్చిందని తరతరాల విశ్వసమని గుర్తు చేశారు. శివతత్వం అనుసరణీయమని చంద్రబాబు అన్నారు. అభిషేకప్రియుడైన శివుడు ఆది దేవుడని, కోరిన వరాలిచ్చే బోళాశంకరుడని ఆయన అభివర్ణించారు.

రాష్ట్రంలోని శక్తిపీఠాలు, పంచారామాలు, భక్తుల హర హర మహాదేవ ఘోషలతో మారుమోగే రోజు మహాశివరాత్రి అని చంద్రబాబు చెప్పారు. శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు శివరాత్రి అని, లోక కల్యాణం కోసం గరళకంఠుణ్ణి ఆనందంగా ఉంచేందుకు భక్తులు జాగరూకులై జాగరణతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలోనే స్థాపించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేసిన తరువాత కేంద్రం స్పందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావడం జరిగింది.

విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకోసం అప్పటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం నేతృత్వంలో సాగిన ఉద్యమం 1966లో కీలక మలుపు తిరిగింది. ఆంధ్రా విశ్వ విద్యాలయం విద్యార్ధులు భారీగా ఆందోళనల్లో పాల్గొన్నారు. పోస్టాఫీసు, ఏవీఏన్ కాలేజీ డౌన్ వద్ద, జగదాంబ ధియేటర్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది విద్యార్ధులు, రిక్షా కార్మికులు మరణించారు. ఈ కాల్పులకు నిరసనగా హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తి వందలాది మంది అరెస్టులకు దారితీసాయి. వరంగల్, ఆముదాలవలస, విజయనగరంలో కూడా కాల్పులు చోటుచేసుకుని పదులకొద్దీ ఉద్యమకారులు తుపాకీ గుళ్ళకు బలయ్యారు. ఉద్యమం పతాకస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నట్టు 1970 ఏప్రిల్ 10న పార్లమెంట్ లో ప్రకటించింది.

ఈ ప్లాంట్ ఏర్పాటుకు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.1982 ఫిబ్రవరి 18న విశాఖ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు విశాఖ ఉక్కు ప్యాక్టరీ మూడున్నర దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం 35వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 18,000ల పైచలకు శాశ్వత కార్మిక ఉద్యోగస్తులకు ,20,000ల పైచలకు ఒప్పంద కార్మికులకు ఉపధి కల్పిస్తూ 35 వసంతాలు పూర్తిచెసుకుంది.

Advertisements

ఎన్నో అంచనాలతో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభంలోనే అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంది. కర్మాగారం నిర్మాణం ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి అప్పలు కూడా పెరిగిపోయాయి. వడ్డీ భారంతో 1998వ సంత్సరానికి స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో సీల్లుప్లాంటు యూజమాన్యం, అధికారులు, కార్మికులు సమిష్టిగా పనిచేసి, ఉత్పత్తిని పెంచి, ప్రభుత్వ సహకారం కూడా కొంత తోడవ్వడంతో తక్కువ కాలంలోనే లాభాల బాట పట్టించారు.

1972లో శంకుస్థాపన చేయబడిన విశాఖ స్టీల్ ప్లాంట్ 1982 ఫిబ్రవరి 18 వరకూ స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలో ఉండేది. భారత ప్రభుత్వం 1982 ఫిబ్రవరి 18న "రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)గా ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా కొనసాగుతోంది.

విశాఖ ఉక్కు కర్మాగారం 2001 నుంచి ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ అప్పులను తీర్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తూ దేశీయ పారిశ్రామిక యవనికపై గర్వంగా నిలబడింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం అన్నిరకాల విస్తరణ పనులు పూర్తి చేసుకుని 6.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా పరుగెడుతోంది. సీల్ మెల్ట్ షాపు సెంటర్ ప్లాంట్, బ్లాన్స్ ఫర్నెస్ తదితర విభాగాలు ప్రారంభమై రెండో దశ ఉత్పత్తి ఊపందుకుంది.

2025 నాటికి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు.

టీమిండియా రెండోసారి అంధుల టి20 క్రికెట్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.

అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, భారత జట్టుకు సారధ్యం వచించింది, ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి. భారత జట్టు రెండోసారి టి20 ప్రపంచకప్‌ సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన అజయ్‌ మొత్తం 296 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అజయ్‌ 9 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

గుంటూరు జిల్లా గురజాలకు చెందిన 26 ఏళ్ల అజయ్‌ కుమార్‌ రెడ్డి జట్టుకు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అజయ్‌, భారత జట్టు తరఫున క్రికెట్‌ ఆడటం వెనుక తల్లిదండ్రుల త్యాగం, భార్య ఇచ్చిన స్ఫూర్తి, పనిచేసే సంస్థ అందించిన సహకారం ఎంతగానో ఉన్నాయి అంటారు, అజయ్.

Advertisements

కళ్ళు ఎలా పోయాయి అంటే...
నాలుగేళ్ల వయసులో తెల్లారుజామున నిద్రలేచి వేగంగా బయటికి పరిగెడుతుంటే తలుపు గడియ మొన ఎడమ కంటికి గుచ్చుకుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ కన్ను కోడిగుడ్డంత వాచింది. చివరికి కన్ను పోయింది. ఒకటో తరగతిలో చివరి బెంచ నుంచీ బోర్డుపైన అక్షరాలు కుడికన్నుతో చూస్తే స్పష్టంగా కనిపించేవి. ఆరో తరగతికి వచ్చేసరికి మొదటి బెంచ్‌కు వచ్చినా బోర్డుపై ఉన్న అక్షరాలు పోల్చుకోలేనతంగా దృష్టి తగ్గిపోయింది. అదే సమయంలో అజయ్ అమ్మానాన్నలు నర్సరావుపేటకు మకాం మార్చారు. అక్కడే ఉన్న బ్లైండ్‌ స్కూల్‌లో ఏడో తరగతిలో అజయ్ ను చేర్పించారు. రెండేళ్ల తర్వాత స్కూల్‌లోని క్రికెట్‌ జట్టులో చేరాడు అజయ్. అప్పటి నుంచి, వెనక్కు తిరిగి చూడలేదు.

2006లో ఆంధ్రప్రదేశ్ టీంకు, 2010లో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు సెలెక్ట్‌ కావడం, 2012లో వైస్‌ కెప్టెన్‌, 2014లో టీం ఇండియా కెప్టెన్ అయ్యాడు అజయ్.

టి20 క్రికెట్‌ టోర్నమెంట్ లో, అజయ్తో పాటు, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన దున్నా వెంకటేశ్వర రావు, టి. దుర్గా రావు (శ్రీకాకుళం), జి. ప్రేమ్‌ కుమార్‌ (కర్నూలు) కూడా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మీ ప్రతిభ అమోఘం.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారు... హాట్స్ అఫ్ అజయ్ & టీం...