balayya in tenali 30032016

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెనాలి లో సందడి చేసాడు.మంగళవారం తెనాలి లోని మార్కెట్ కమిటీ ప్రాంగణం లో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల బల ప్రదర్శన ని ప్రారంబించారు.టాపు లేని జీపు పై పట్టణమంతా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు.అనంతరం ఎన్టిఆర్,శివరామకృష్ణయ్య ల విగ్రహాలకు పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన చేసారు.అనతరం ఎడ్ల బండ్ల పోటి లను ప్రారబించిన బాలకృష్ణ తెలుగు సంప్రదాయాలను కొనియాడారు.

తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలువనిచ్చాడు మాతృభాష తల్లి పాలతో సమానమని, పరాయి బాష డబ్బా పాల వంటి దని అన్నారు. పాశ్చాత్య మోజులో వడి మన సంప్రదా యాలకు దూరం కావద్దని యువతకు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంగ ళవారం రాత్రి బాలకృష్ణ ప్రారంబించారు. ఈ నందర్బంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్ర సాద్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నవనేవి రాజ కుమారి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎడ్ల పోటీలను ప్రారంబించిన అనంతరం బాలకృష్ణ గుర్రంపై స్వారీ చేసి అబిమానులను అలరించాడు.

Advertisements

ఆంధ్రా ప్యారిస్ లో సందడి చేసిన బాలయ్య Last Updated: 30 March 2016