akshya patra 24032016

మనం ఇంట్లో నలుగురికి అన్నం వండటానికి, మన ఇంట్లో ఆడవాళ్లు పొద్దున్నే 6 గంటలకి మొదలుపెడితే, మధ్యానం 12 అవుద్ది వంట చెయ్యటానికి, ఇంట్లో పనులు అవ్వటానికి. అలాంటిది రోజుకి పదిహేను లక్షల మందికి అన్నం పెడుతుంది  అక్షయపాత్ర. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుడా  అక్షయపాత్ర ద్వారా మధ్యన భోజన పధకం అందిచాలి అనుకుంటుంది.

అసల ఏంటి ఈ అక్షయపాత్ర ?

ఇస్కాన్‌ వ్యవస్థాపకులు భక్తి వేదాంత, ఒక రోజు మాయపురలో ఓ భక్తి కార్యక్రమానికి హాజరుయ్యి, కార్యక్రమం ముగిసాక, రెస్ట్ తీసుకున్తున్నారు. ఇంతలో ఎదో గొడవ, వెళ్లి చుస్తే ఎంగిలి ఆకులలో అన్నం కోసం, కుక్కలతో పాటు, కొంత మంది అనాధ పిల్లలు కొట్టుకుంటున్నారు. ఆ దృశ్యంలో నుంచి, భక్తి వేదాంత మనసులోంచి పుట్టిందే ఈ అక్షయపాత్ర. అలా 1997లో 1500 మందితో మొదలుయ్యి లక్షమందికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది ఇస్కాన్‌ సంస్థ. అక్షయపాత్రకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన మధ్యాహ్న భోజన పథకం వరంగా మారింది. మధ్యాహ్న భోజనానికి అయ్యే ఖర్చులో 65 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. మిగిలిన 35 శాతం నిధుల కోసమే అక్షయపాత్ర విరాళాలను సేకరిస్తోంది.

అంత మందికి వంట ఎలా వండుతారో తెలుసా ?
అక్షయపాత్ర దేశంలోనే అతిపెద్ద వంటశాల. ఆత్యాధునికమైన స్టీం కుకింగ్‌ విధానాన్ని అనుసరిస్తురు. వంద కేజీల అన్నం పదిహేను నిమిషాలు, పన్నెండువేల లీటర్ల సాంబారు పది నిమిషాలలో వండొచ్చు. అక్షయపాత్ర వంటశాలకి 50 వేల మంది నుంచి లక్షన్నర మందికి భోజనాన్ని వండే సామర్థ్యం ఉంది. కేవలం గంట వ్యవధిలోనే లక్ష మందికి వంట పూర్తవుతుంది. వండే సమయంలోనే కాకుండా పాత్రలలోకి మార్చినా, వాహనాలలోకి తరలించినా ఎక్కడా ఎవరూ అహారాన్ని ముట్టుకునేది ఉండదు. కేవలం పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది. యంత్రాలే అన్నీ చేసుకుపోతాయి.

15 ఏళ్ల ప్రస్థానంలో 15 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్న అక్షయపాత్ర మరో నాలుగేళ్లలోనే 50 లక్షల మందికి అన్నం పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.

ఈ వీడియో చూడండి, ఎంత సులువుగా అంత మందికి వంట వండుతున్నారో.

{youtube}aziKmC7ZLpM|500|250|1{/youtube}

Advertisements

రోజుకి అరకోటి మందికి అన్నం.. ఎలా పెడుతున్నారో తెలుసా? Last Updated: 24 March 2016