కార్లు, బైకులు కాదు, ఏకంగా ట్రక్కులతోనే రేసింగ్ అంటు విజేతగా నిలిచిన ట్రక్ రేసర్ గన్నవరంకు చెందిన, అన్నే నాగార్జున... ఒక సామాన్య లారీ డ్రైవర్ కొడుకు, ఇప్పుడు ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ ట్రక్ డ్రైవర్ అయ్యారు... అది కూడా ఒకసారి కాదు.. వరుసగా రెండేళ్ల పాటూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.. పోయిన సంవత్సరం కూడా ట్రక్ డ్రైవింగ్ రేస్ లో టాప్ గా నిలిచి, ఈ ఏడాది కూడా మొదటి స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రక్ రేస్ లో గన్నవరంనకు చెందిన అన్నే నాగార్జున విశేష ప్రతిభ చూపి విజేతగా నిలిచాడు. గన్నవరంలోని టాటా స్టీల్ యార్డులోని శేఖర్ లాజిస్టిక్ సంస్థలో ట్రక్ డ్రైవరుగా పని చేస్తున్న నాగార్జున ఈ నెల 19న ఢిల్లీలోని బుద్ అంతర్జాతీయ సర్క్యూట్లో టాటా మోటార్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ట్రక్ రేస్ లో పాల్గొన్నారు. భారీ ట్రక్కులు, లక్షల మంది జనం చూస్తుండగా.. ట్రాక్‌పై వాహనాన్ని పరుగులు తీయిస్తూ... తనకు తిరుగులేదని నాగార్జున నిరూపించాడు. మొదటి స్థానాన్ని పదిలం చేసుకుని రూ.12 లక్షల నగదు బహుమతి, షీల్డ్‌ను అందుకున్నాడు.

గన్నవరం సమీపంలోని వెంకట నరసింహపురానికి చెందిన 29 ఏళ్ళ అన్నే నాగార్జున, ఒక సామాన్య లారీ డ్రైవర్ కొడుకు. నాగార్జున తండ్రికి సొంతంగా లారీ ఉండేది. తండ్రితో పాటు లారీలో వెళ్ళినప్పుడు. తండ్రి డ్రైవింగ్ చూసి నేర్చుకునేవారు. అలా డ్రైవింగ్ తన సొంతగా నేర్చుకుని, దానిలో మరింత లోతుగా నైపుణ్యం సాధించారు. 2015 డిసెంబర్‌లో ట్రక్‌ డ్రైవర్లకు పోటీలు జరుగుతున్నాయనే విషయం తెలుసుకుని, 500 మందితో పోటీకి దిగారు. తొలి దశలోనే 500 మందిలో 150 మంది ఎంపికయ్యారు. రెండో దశలో 64 మంది, మూడో దశలో 23 మంది మిగిలారు. వీరికి చివరి దశలో 21 కిలోమీటర్ల రేస్‌ను నిర్వహించారు. ఆఖరికి 17 మంది మిగిలారు. వీరందరికీ గత ఏడాది దిల్లీలోని బుద్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో శిక్షణ ఇచ్చారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రేస్‌ట్రాక్‌. ఇక్కడ అత్యంత కఠినమైన శిక్షణ పూర్తయ్యే సరికి 12 మంది డ్రైవర్లు మిగిలారు. వీరందరికీ పోటీ నిర్వహించగా.. నాగార్జున విజేతగా నిలిచాడు.

అలాగే ఈ సంవత్సరం కూడా, ఈ పోటీలు పెట్టగా, నాగార్జున మొదటి స్థానాన్ని పదిలం చేసుకుని, ఆంధ్రా వాడి దమ్ము చూపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read