అప్పుడెప్పుడో జగన్ చేసిన అవినీతి కేసులో మారిషస్ కోర్ట్, అప్పట్లో నరేంద్ర మోడీ సారధ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగానే జగన్ కు ఉన్న ట్రాక్ రికార్డు ఇది. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఇంకెంత ట్రాక్ రికార్డు ఉంటుందో తెలుసా ? జగన్ చేసే పనుల వల్ల, దేశానికే నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన జర్క్ మర్చిపోక ముందే, నిన్న చైనాలోని బీజింగ్‌ కేంద్రంగా నడుస్తున్న ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ అమరావతికి షాక్ ఇచ్చింది. మేము కూడా రుణం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అయితే, ఈ సందర్భంలో వాళ్ళు రాసిన లేఖ చూస్తే, కేంద్రమే భయపడే పరిస్థితి వచ్చింది. జగన్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ, కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించింది.

aiib 24072019 2

ఈ దెబ్బతో కేంద్రం కూడా భయపడే పరిస్థితి వచ్చింది. జగన్ వైఖరి వల్ల, దేశంలో మిగతా ప్రాజెక్ట్ ల నుంచి కూడా ఏఐఐబీ తప్పుకునే పరిస్థితి వచ్చింది. కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన ఏఐఐబీ, ప్రతి దానికి ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా అని కేంద్రాన్ని హెచ్చరించింది. ఒక ప్రభుత్వం రుణం కావలి అంటుంది, మరో ప్రభుత్వం అవసరం లేదు అంటుంది. ఇలా అయితే, మా బ్యాంక్ ప్రతిష్ట దెబ్బ తింటుందని అని చెప్పింది. ఈ అంశం పై మేము తీవ్ర ఆగ్రహంగా ఉన్నాం. ఈ విషయం పై అంతర్జాతీయ వేదికల పై చర్చ పెడతాం. ఇలాగే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, జరిమానా విధించే అవకాశం కూడా లేకపోలేదు అంటూ తీవ్రంగా హెచ్చరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, మేము మీ దేశంలో ఏ ప్రాజెక్ట్ కి సహకరించం, అన్ని ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకుంటాం అని హెచ్చరించింది.

aiib 24072019 3

మన దేశంలో మౌలిక వసతుల సహకారానికి ఏఐఐబీ ముందుకొచ్చింది. అలాగే చంద్రబాబు అధికారంలో ఉండగా, అమరావతిలో కూడా మౌలిక వసతులకు లోన ఇవ్వటానికి బ్యాంక్ ను ఒప్పించారు. రాజధానికి ఈ బ్యాంకు రూ.1400 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ వైఖరి చూసిన బ్యాంక్, ఇలాంటి వైఖరితో లోన్ ఇవ్వం అని చెప్పేసింది. అమరావతి ఒక్కటే కాదు, చంద్రబాబు ముందుకు రావటంతో, దాదపుగా 7 వేల కోట్లు వివిధ ప్రాజెక్ట్ లకు ఇవ్వటానికి ముందుకొచ్చింది. పట్టణ ప్రాంత తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థల మెరుగుదల ప్రాజెక్టు కోసం 2800 కోట్లు, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు కోసం 3100 కోట్లు, 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రాజెక్టు కోసం 1100 కోట్లు ఇవ్వటానికి రెడీ అయ్యింది. ఇప్పుడు జగన్ వైఖరితో, అన్ని ప్రాజెక్ట్ ల నుంచి బ్యాంక్ తప్పుకోనుంది. అయితే మన రాష్ట్రంలోనే కాదు, జగన్ వైఖరితో దేశం నుంచే తప్పుకుంటాం అని బ్యాంక్ హెచ్చరించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read