వినియోగదారులకు వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలుగా విజయవాడలోనే పూర్తిస్థాయి ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఇ- కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రారంభించింది. ఈ సెంటర్‌ వివరాలను సంస్థ ఫుల్‌ఫిల్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా గురువారం విలేకరులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్‌ ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదని ఆయన తెలిపారు. దేశంలో ఇలాంటివి 50కిపైగా ఉన్నాయని, విజయవాడలో ఈ నెల 16 నుంచి సేవలు మొదలవుతాయని చెప్పారు. వాస్తవానికి ఈ సెంటర్‌ను తొలుత విశాఖలో నెలకొల్పాలని భావించినా.. విజయవాడ నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు అధికంగా ఉండటంతో బెజవాడవైపే మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు.

amazon 13072018 2

ఈ ప్రాంతానికి చెందిన వారు ఇకపై ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయగానే వేగంగా వస్తువుల డెలివరీ ఉంటుందని సక్సేనా వివరించారు. ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ విజయవాడ శివార్లలోని నిడమానారులో వచ్చింది. 20 వేల స్క్వేర్ ఫీట్ లో, 15 వేల క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ స్పేస్ తో, ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ను అమెజాన్ ప్రారంభించింది. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో, నిడమానూరుని ఎంచుకున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ సెంటర్ , సోలార్ పవర్ సిస్టం ద్వారా పవర్ జెనరేట్ చేసుకుంటామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

amazon 13072018 3

విజయవాడలో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఏర్పాటుచేయడంతో, వేలమంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించుకునే వీలవుతుందన్నారు. ప్యాకేజింగ్‌, రవాణా, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటి వంటి సహాయక వ్యాపారాలు వృద్ది చెందుతాయన్నారు. ఈ సెంటర్‌ ద్వారా అమెజాన్‌ తన స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 3.2 మిలియన్‌ క్యూబిట్‌ ఫీటుకు పెంచుకుంది. దీంతో వినియోగదారులకు త్వరితగతిన సరుకులను అందజేయనుంది. యువతకు వేలకొద్దీ ఉద్యోగవకాశాలను కూడా ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ సృష్టించనుందని అమెజాన్‌ ఇండియా తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read