రాష్ట్ర పోలీస్ దళం ఆక్టోపస్ బృందం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అద్భుత విన్యాసాలు, ఆంధా పోలీసుల ధైర్యసాహసాలకు అద్దం పడుతున్నాయని ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రశంసించారు.

రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభం అనంతరం ఆక్టోపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనను, పోలీస్ బృందం చేసిన విన్యాసాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డి.జి.పి ఎన్ సాంబశివరావు, తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయుధ ప్రదర్శనను తిలకించి ఆయూ ఆయుధ పరికరాలు పనిచేసే తీరును అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా యు.ఎస్.ఎ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ట్, ఆస్ట్రియాకి చెందిన గ్లోక్, ఇజ్రాయేల్ కు చెందిన సి.యస్.ఎం. డోగో, జర్మనీకి చెందిన ఎంపి-5 ఎస్.డి, నార్వేకు చెందిన బ్లాక్ హార్నెట్, బల్లేరియాకు చెందిన ఏకే-47, ఇటలీకి చెందిన స్సాస్, వంటి ఆయుధాలను ఆక్టోపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం ఆక్టోపస్ బృందం వివిధ విన్యాసాలను అత్యంత ధైర్యసాహసాలతో కూడి నిర్వహించారు. శత్రువులను, ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కునేందుకు పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరచడంతో పాటు ఎంతో కఠినతరమైనవిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇటువంటి సాహస క్రీడా విన్యాసాలను విద్యార్ధి దశలోనే విద్యారులకు అందించే చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఆక్టోపస్ బృందం విన్యాసాలలో భాగంగా అబ్సెల్లింగ్ వాల్డ్రాప్, స్పైడర్ టెక్నిక్, పవర్ క్విక్ అసెండర్స్, స్పీడ్ర్యాప్లింగ్, బ్లాక్ హార్నెట్, బంగీజంప్, డోగో వంటి విన్యాసాలు ఆకటుకున్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడి తేలికైన పరికరంతో 1.6 కిలోమీటర్ల పరిధిలో జరిగే సంఘటనలను చిత్రీకరించే డ్రోన్ పరికరం అందుబాటుల్లోకి తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఆభినందించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read