ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన గణిపినేని సుధాకర్(58) తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతూ 1100 కాల్ సెంటర్ ను సంప్రదించగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెనువెంటనే స్పందించడంతో సి.యం.సహాయనిధి క్రింద 5 లక్షల రూపాయల ఖరీదైన వైద్య సహాయాన్నిఅందించటం ద్వారా బాధితుడు త్వరగా కోలుకోవటం జరిగిందని కృష్ణా జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం తెలిపారు.

చీమకుర్తి గ్రామానికి చెందిన సుధాకర్ కు మే నెలలో త్రీవమైన గుండె నొప్పి రావడంతో వైద్య చికిత్స నిమిత్తం విజయవాడలోని రమేష్ హాస్పటల్ నందు ఇంజీయోగ్రామ్ వైద్య చికిత్సలు తీసుకున్నారు. నెల తరువాత
బాధితునికి తిరిగి హృదయ స్పందన 180 నుండి 200 పెరగడంతో జూన్ 30వ తేదిన ప్రకాశం జిల్లా కిన్స్ లో చేర్పించగా ఫలితం లేకపొవడంతో మద్రాసు అపోలో హాస్పిటల్ లో జలై 1వ తేదీన చేర్చించటం జరిగిందన్నారు.

అప్పటికే బాదితుని హృదయ స్పందన 200 గా వుండడంతో పాటు రోజుకు లక్ష రూపాయల చోప్పన 10 లక్షల రూపాయలు వైద్య ఖర్చుల క్రింద అవుతుందని డాక్టర్లు తెలుపగా లక్ష 83వేల రూపాయలు లారీ డ్రైవర్ల సహకారంతో హాస్పిటల్ ఫీజుగా చెల్లించి ఏమి చేయలేని స్థితిలో ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన 1100 కాల్ సెంటర్ ను జులై 3వ తేది అర్ధరాత్రి సంప్రదించగా తగు సమాచారం ముఖ్యమంత్రికి చేరిన వెంటనే బాధితుని వైద్యం నిమిత్తం కృష్ణ జిల్లా కలెక్టరును సంప్రదించవలసినదిగా ముఖ్యమంత్రి నుండి ఆదేశాల మేరకు బాధితునికి తిరిగి రమేష్ హాస్పటల్లో చికిత్స ప్రారంభించారు.

రమేష్ హాస్పటల్ డాక్టర్లు కిన్స్ అపోలో హస్పటల్ రిపోర్టులను పరిశిలించి బాధితునికి 7 లక్షల విలువగల ఐ.సి.డి. పరికరాన్ని గుండె లోపలి భాగంలో అమర్చవలసివున్నదని నిర్ధారించటంతో తక్షణం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 5 లక్షల రూపాయలు విడుదల చేయడంతో సత్వరం గుండె శాస్త్రచికిత్స చేసి ఐ.సి.డి. పరికరాన్ని అమర్చడం ద్వారా బాధితుడు కొలుకోవటం జరిగిందన్నారు.

జులై 14వ తేదీన చీమకుర్తి గ్రామానికి చెందిన సుధాకర్ రమేష్ హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయి తన కుంటుంబ సభ్యులతో ఆనందంగా తన గ్రామానికి చేరుకోవటం జరిగిందని జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం తెలిపారు.

బాధిత కుటుంబం 1100 కి గుండె చికిత్సకు సత్వరం వైద్యం కొరకు సంప్రదించగా ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించి బాధితునికి మైరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా కృష్ణా కలెక్టరు క్యాంపు కార్యాలయంలోని కమాండ్ కంట్రాల్ సెంటర్ ఆదేశించారు.జిల్లా వైద్య అధికారులు, రమేష్ హాస్పటల్ వైద్యులతో నిరంతరం సంప్రదించి గుండె శస్త్ర చికిత్సకు కావలసిన మొత్తాన్ని ముఖ్యమంత్రికి నివేదించగా తక్షణం ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఆ నిధులతో అన్ని ఏర్పాట్లు చేయడంతో బాధితుడు త్వరితగతిన కోలుకోవటంతో సంపూర్ణ న్యాయం చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read