పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం డిసెంబరు 3వ తేదీన దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ పర్యటనలో సామ్‌సంగ్‌, హ్యూండాయ్‌, లోప్టే సహా పలు ప్రఖ్యాత సంస్థల యాజమాన్య ప్రతినిధులతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తుంది. మొత్తం 6 ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఆటోమైబైల్ దిగ్గజం ‘కియా’ వైస్ చైర్మన్ , లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్, కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవో , OCI కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్, యంగ్ వన్ కంపెనీ చైర్మన్, కొరియా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తో, ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి.

అలాగే, 17 కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో, కియాకు అనుబంధంగా ఉన్న మరో 27 టూ టైర్, త్రీ టైర్ సంస్థల ప్రతినిధులతో గ్రూపు మీటింగ్స్ ఉంటాయి. అలాగే దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి... బూసన్ కాన్సులేట్ జనరల్ జియాంగ్ టెక్ మిన్... బూసన్ మెట్రో పాలిటన్ సిటీ మేయర్ సుహ్ బైంగ్సూ తో మీటింగ్స్ ఉంటాయి. 2 ఎంవోయూలు ఇప్పటికి ఖరారు అయ్యాయి, మరొకటి జరిగే అవకాశం ఉంది... ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ ఎంవోయూ (ఇది ప్రాపర్టీ కంపెనీ), (అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు పై)... కియా మోటార్స్‌ 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందం.... బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం ఉంది...

ఈ మధ్యనే దక్షిణకొరియా కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్ మిన్ నేతృత్వంలో ఏపీలో పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఏపీలో పర్యటించింది. ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ రాష్ట్రంలో భూముల లభ్యత, రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఈ బృందం సంతృప్తి చెంది వెళ్లింది... ఎలక్ట్రిక్ స్టీల్, లాజిస్టిక్, నిర్మాణరంగం, ఫైనాన్స్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్, హెవీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, బ్యాటరీ, మీట్ ప్రాసెసింగ్, లిక్కర్స్, షిప్ బిల్డింగ్, మెడికల్, మెరైన్ అక్విప్‌మెంట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. వీటి అన్నిటి మీద, చంద్రబాబు పర్యటనలో మరింత స్పష్టత వచ్చే అవకాసం ఉంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read