ఆంధ్రప్రదేశ్ సెల్ ఫోన్ల తయారీ కేంద్రంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఫాక్స్ కాన్, షియామీ లాంటి సంస్థలు, మొబైల్ ఫోన్ లను ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేస్తుండగా, ఇప్పుడు మరో కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఫోన్ ల తయారీకి సిద్ధమయింది.

తిరుపతి కేంద్రంగా సెల్‌కాన్‌, అత్యాధునిక ఫోన్ల తయారీ చెయ్యనుంది. ఈ నెల 22న రేణిగుంట విమానాశ్రయంవద్ద నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇక్కడ నుంచే, సెల్‌కాన్‌, నెలకు 4 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది.

20 ఎకరాల విస్తీర్ణంలో యూనిటú నెలకొల్పింది. రూ.150 కోట్ల పెట్టుబడి. సెల్‌కాన్‌ ఇక్కడ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ఆరంభంలో 2500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 2020 కల్లా ఈ కంపెనీ యూనిట్‌ నుంచీ 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొబైల్‌ తయారీతోపాటు, వాటి పరికరాలను కూడా ఆ సంస్థ ఇక్కడి నుంచీ తయారు చేయనుంది.

శ్రీ వెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట, రేణిగుంట వద్ద 122 ఎకరాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ లో సెల్కొన్ 20 ఎకరాలు, మైక్రో మాక్స్ 15 ఎకరాలు, కర్బోన్ 15.28 ఎకరాలు, లావా 20 ఎకరాలు ఉపయోగించుకుని తమ విభాగాలను నెలకొల్పుతున్నారు. ఈ నాలుగు సంస్థలు వివిధ దశల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులను పెడుతున్నారు. ఇంకా వీటితో పాటు అసుస్, వన్ ప్లస్ సంస్థలు కూడా రాష్ట్రానికి రానున్నాయి. 2015 నవంబరులో ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో శరవేగంగా యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి తయారీకి సిద్ధమైన తొలి కంపెనీ ‘సెల్‌కాన్‌’.

ఈ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రాంతంలో, మొబైల్‌ కంపెనీలన్నింటిద్వారా మొత్తం 40వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read