చిన్న వయసు... చదువులో టాప్... పేదరికం ఓ వైపు... కబళిస్తున్న కాన్సర్ రోగం మరోవైపు... ఆ యువతిని మానసిక వేదనకు గురిచేస్తుండగా.. తల్లితండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు... ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షలు సాయం మంజూరు కావడం, వైద్యం కోసం ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ఆ కుటుంబంలో ఆశలు చిగురుస్తున్నాయి.

కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన ఉషారాణి డిగ్రీ చదువుతోంది. తండ్రి రామకృష్ణ ఆటోనగర్ లో వెల్డర్. చదువులో ప్రతిభ చూపిస్తున్న ఉషారాణికి లుకేమియా సోకి ప్రాణాపాయ పరిస్థితిలో ఉందని వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం పాండిచ్చేరి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో అప్పులు చేసి 20 రోజుల క్రితం అక్కడకు తీసుకువెళ్లారు. సొమ్ములు అయిపోవడం, భాషా సమస్య ఎదురుకావడంతో వారు తిరిగి ఇంటికి చేరుకొన్నారు.

రోజు రోజుకూ ఉషారాణి ఆరోగ్యం క్షీణిస్తుండడం, వైద్యానికి అయ్యే ఖర్చు రూ.13 లక్షలు భరించే పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా కలత చెందారు. ఈ క్రమంలో వారు 28-06-2017 వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వద్దకు వెళ్లి సాయం అడి గారు. దీంతో ఆయన 29-06-2017 న ఉదయం , తల్లితండ్రులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి ఉషారాణి ఎదుర్కొంటున్న ప్రాణాంతక పరిస్థితిని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేలించిపోయారు. ఆ పాపను ఎలా అయినా బ్రతికించాలని, పాప కోలుకుని మంచిగా చదవాలి అని, అప్పటికప్పుడే స్పందించి ఉషారాణి వైద్యానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదంతా కేవలం మూడు గంటల వ్యవధిలో జరిగిపోయింది.

ఉషారాణి, ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఉషారాణిని చికిత్స కోసం తన వాహనంలోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read