రాజధాని గా అమరావతి ని నిర్ణయించినప్పటి నుంచి కొన్ని వర్గాలకు శక్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణానికి భూమి నుంచి మొదలుకొని అనేక అవాంతరాలు, ఆ శక్తులు సృష్టించాయి .

అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టుకోవాలన్న ప్రజా సంకల్పానికి తూట్లు పొడిచేలా వారి ప్రవర్తన సాగింది. రాజధాని పంటలు తగలుపెట్టటం దగ్గర నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు దాకా, ఇలా అన్ని రకాలుగా... ముఖ్యమంత్రి సంకల్ప బలం కానివ్వండి, ప్రజల కోరిక కానివండి ఆ అడ్డంకులు అన్ని అధిగమించి ముందుకు సాగుతున్నం...

తాజాగా అమరావతి మీద జరుగుతున్న, మరో కుట్ర బయటపడింది. రాజధాని ప్రాంతంలోని 26 గ్రామాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు భాగస్వామ్యంతో రూ.3221 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 5న జరిగే ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతికి రుణం మంజూరు పై తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇంకేముంది, మళ్ళీ అమరావతి మీద ఏడ్చే వారికి పురుగు కుట్టింది. ఎలా అయినా, ప్రపంచ బ్యాంకు ఇచ్చే రుణం రాకుండా ఉండటానికి, మహా కుట్ర జరిగింది. అమరావతికి రుణం ఇచ్చే ప్రాసెస్ ని ప్రపంచ బ్యాంకు మొదలుపెట్టింది. దీనిని అడ్డుకోవటానికి, అక్టోబర్ నెల నుంచి లెటర్లు రాస్తూనే ఉన్నారు... అయితే ప్రపంచ బ్యాంకు అవి పట్టించుకోలేదు... తాజాగా, మే 25వ తేదీన ‘రాజధాని రైతుల’ పేరిట 22 పేజీల మరో ఈ-మెయిల్‌ పంపించారు. ఇందులో అమరావతి మీద విషం చిమ్ముతున్న, ఒక తెలుగు పత్రికలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లూ జత చేశారు. దీనికి మద్దతు పలుకుతూ ‘1600 మంది సభ్యులున్న స్థానిక రైతు సమాఖ్య’ పేరిట మరో లేఖ పంపించారు.

ల్యాండ్‌ పూలింగ్‌లో అన్యాయం జరుగుతుంది అని, కొండవీటి వాగు వల్ల అమరావతికి పర్యావరణ సమస్యలు వస్తాయని, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది అని, భూకంప ప్రభావం ఉంది అని ఇలా అన్ని రకాలుగా బెదిరిస్తూ, అమరావతికి రుణం ఇస్తే అంతే సంగతులు అని భయపెట్టే స్థాయిలో ప్రపంచ బ్యాంకుకి లెటర్ రాశారు.

ప్రపంచబ్యాంకు దీనిపై దృష్టి సారించింది. రైతుల అభ్యంతరాలను పరిశీలించాలని ప్రపంచ బ్యాంకు తనిఖీల బృందం (ఇన్స్‌పెక్షన్‌ ప్యానెల్‌) తాజాగా నిర్ణయం తీసుకుంది. అమరావతి వెళ్లి ప్రత్యక్షంగా తనిఖీలు చేయడానికి అనుమతి ఇవ్వాలని, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుకి ఇన్స్‌పెక్షన్‌ ప్యానెల్‌ లేఖ రాశారు. ఇది పెద్ద సమస్య కాదు.. దీన్ని కూడా అధిగమించి, రుణం తెచ్చుకుంటాం.... కాకపొతే, కొంచెం లేట్ అవ్వచ్చు...

కాని, ఇది రైతుల పేరుతో అమరావతి మీద జరుగుతున్న కుట్ర... రైతుల పేరుతో హై కోర్ట్ లో కేసులు వేసిన వారా ఈ కుట్ర పన్నింది ? గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసిన వారా ?

అమరావతి పై ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసిన వారు ‘మా పేర్లు బయటపెట్ట వద్దు’ అని ప్రపంచ బ్యాంకు తనిఖీల ప్యానెల్‌ను కోరారు. ఇది కుట్ర అని చెప్పటానికి, ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి. ధైర్యంగా ఎదుర్కోలేక ఇలా అంతర్జాతీయ స్థాయిలో కూడా అమరావతి పరువు తీస్తున్నది ఎవరు ? 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చిన రైతులు నాశనం అయిపోవాలి అని కోరుకునేది ఎవరు ? దగా పడ్డ ఆంధ్రుడికి, ప్రపంచ స్థాయి రాజధాని ఉండకూడదు అని ఆలోచించే ఇంటి దొంగలు ఎవరు ?

రాజధాని వ్యతిరేక శక్తులు ఎవడైనా సరే !! గుర్తు పెట్టుకోండి, అమరావతి లో ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసే రాజధాని కట్టుకుంటాం !! ఇది ఐదు కొట్ల మంది ఆంద్రుల కల !! ఎవడో ఒకడు వచ్చి దానికి అడ్డం పడాలంటే ఆగేది కాదు, దాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. ప్రపంచం మొత్తం ఎదురుతిరిగినా అక్కడ రాజధాని వస్తుంది. వచ్చి తీరుతుంది. అడ్దంకులు సృష్టించేవారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. ఆంధ్రుల పదఘట్టనల కింద మీలాంటి వాళ్లు నలిగిపోతారు. గుర్తు పెట్టుకోండి, అది ప్రజల రాజధాని, ప్రజల కోసం ప్రజలు తమ భూములు ఇచ్చి మరీ నిర్మించుకుంటున్న ప్రజా రాజధాని, అక్కడ ప్రతి మట్టి రేణువులో ఆంధ్రుల సంకల్పం ఉంది . అక్కడ పెట్టే ప్రతి ఇటుక లో ఆంధ్రుల భవిష్యత్తు ఉంది. మా భవిష్యత్తు కోసం మేము కట్టుకుంటున్న మా రాజధాని.

amaravati 27062017 2

amaravati 27062017 3

amaravati 27062017 4

Advertisements

Advertisements

Latest Articles

Most Read