మన రాష్ట్ర ప్రగతికి అడ్డు పడుతూ, ఢిల్లీ పెద్దలు పన్నిన కుట్రలకు, మన రాష్ట్రంలో కొంత మంది తోడేళ్ళు కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎన్ని కుట్రలు పన్నుతున్నారో చూస్తున్నాం.. ఇలాంటి కుట్రలను ఎదుర్కుంటూ, మరో పక్క రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు చంద్రబాబు... ఇప్పటికే కియా సంస్థ తన ప్లాంట్ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, ఇప్పుడు కియా అనుబంధ పరిశ్రమలు కూడా, రెడీ అవుతున్నాయి. కొరియాకు చెందిన 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు, కియాకి అనుబంధంగా ఏర్పాటు అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక కంపెనీ అయిన, Faurecia Interior Systems, ఈ రోజు శంకుస్థాపన చేసుకుంది.

kia 14062018 2

Faurecia Interior Systems అనే సంస్థ, కార్ ఇంటీరియర్ తాయారు చేస్తుంది. ఈ కంపెనీ కార్ ఇంటీరియర్ తాయారు చెయ్యటంలో, ప్రపంచంలోనే ఒక టాప్ కంపెనీ గా ఉంది. కియా మోటార్స్ నిర్మాణం జరుగుతున్న చోట, ఈ ప్లాంట్ ఈ రోజు శంకుస్థాపన జరుపుకుంది. 180 రోజుల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చెయ్యనున్నారు. 12 ఎకరాల్లో, ఈ కంపెనీ స్థాపన జరగనుంది. మొత్తం 50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఈ ప్లాంట్ లో, 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ 16 ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు, రూ.4,790 కోట్ల పెట్టుబడులతో 6.,583 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఈ పరిశ్రమల కోసం, అనంతపురము జిల్లా ఎర్రమంచి దగ్గర తాము దక్షిణ కొరియా క్లస్టర్ కు 534 ఎకరాలు, గుడిపల్లిలో 71 ఎకరాలు, , అమ్మవారిపల్లి గ్రామం దగ్గర 131 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది.

kia 14062018 3

చంద్రబాబు మాట్లాడుతూ, కియా మోటార్స్ సహా ఆంధ్రప్రదేశ్‌లో దిగ్గజ కంపెనీలైన ఇసుజు మోటార్స్-అనుబంధ సంస్థలు, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయని, వీటిలో సుజుకి ఇప్పటికే శ్రీసిటీలో వాహన ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. కియామోటార్స్ కు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని, తాము నిబద్ధతతో ఉన్నామని, ముందుగానే అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. ఈ ప్రాంతం ఒక ఆటోమొబైల్ క్లస్టర్ గా అభివృద్ధి కావాలన్నది తమ అభిమతమని అన్నారు. తాను ఇటీవల బుసాన్‌లో పర్యటించానని చెప్పారు. అనంతపురాన్ని రెండవ స్వగృహంగా భావించాలని ముఖ్యమంత్రి కోరారు. ఓవైపు పారిశ్రామికీకరణను పెద్ద ఎత్తున చేపడుతూనే మరోవైపు భారీ స్థాయిలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read