ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డ్రీం ప్రాజెక్ట్ ప్రారంభించటానికి, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 27వతేదీన ఆంధ్రపద్రేశ్ రాజధాని అమరావతికి వస్తున్నారు... చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభించటానికి రాష్ట్రపతి వస్తున్నారు... ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు... మంగళవారం ఆయా శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఇంటికి తక్కువ ధరకే కేబుల్, ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. చంద్రబాబు నాయుడు 150 రూపాయలకే ఫైబర్ గ్రిడ్‌ ద్వారా కేబుల్, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా డిసెంబర్ 27 నుండి దీనికి సంబంధించిన పనులు మొదలుకానున్నాయి.

godavari 12122017 2

ఫైబర్‌ గ్రిడ్‌ కింద రెండు బాక్సులనూ సాఫ్ట్‌వేర్‌తో కలసి రూ.4వేలకే అందచేస్తారు. ఒకేసారి రూ.4 వేలు చెల్లించే వినియోగదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. అంత చెల్లించలేని వాళ్లు... తొలుత రూ.1700 చెల్లించి, మిగిలింది నెలకు రూ.99 చొప్పున మూడేళ్లపాటు విడతల వారీగా చెల్లించవచ్చు. అదేవిధంగా రూ.500 చెల్లించి... నెలకు రూ.99 చొప్పున నాలుగేళ్లపాటు సులభవాయిదాల్లోనూ చెల్లించే వీలుంది. దక్షిణ కొరియా, చైనా నుంచి ఈ బాక్సులు వచ్చేందుకు కనీసం 7 వారాలు పడుతుంది. అందువల్ల, రాష్ట్రంలో టీవీ ప్రసారాలు, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని పైబర్‌ గ్రిడ్‌ అధికారులు భావిస్తున్నారు.

godavari 12122017 3

నెలకి రూ.149కి ఉచిత టెలిఫోన్‌, 10ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన ఇంటర్‌నెట్‌, ఉచిత ఛానళ్లతో కూడిన కేబుల్‌ టీవీ ఇవ్వాలని ఏపీ ఫైబర్‌ తొలుత ప్రతిపాదించింది. తాజాగా ఇందులో మార్పు చేసి సాధారణ వినియోగదారునికి అవసరమయ్యే పే ఛానళ్లను సైతం నెలకి రూ.149 రుసుంతోనే ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగులోని చాలా వరకు పే ఛానళ్లతోపాటు కొన్ని హిందీ, ఇంగ్లీష్‌ పే ఛానళ్లు, క్రీడలకు సంబంధించిన మరికొన్ని పే ఛానళ్లు ఇందులో ఉండనున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన ఛానళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు సైతం పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల చేస్తున్న ప్రసారాల్లో 220 ఛానళ్ల వరకు వస్తున్నాయి. వీటిల్లో వివిధ భాషలు, విభాగాలకు చెందిన పే ఛానళ్లు ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read