అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉండగా, గన్నవరం ఎయిర్ పోర్ట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు... ఏడాది లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ హోదాను అందుకుంది... అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకో కలిగింది... మరో పక్క అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయ్యేలా చూసారు... అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి... ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది... అయితే ఇవన్నీ అశోక్ రాజీనామా చెయ్యకముందు జరిగిన పనులు... రాజీనామా చేసిన తరువాత పరిస్థితి మారిపోయింది..

airlines 02062018 2

ఇన్ని చేసినా, ఇప్పటికీ కేంద్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ లకి, పర్మిషన్ ఇవ్వటం లేదు.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దుబాయ్ కు అంతర్జాతీయ సర్వీసుల కోసం కసరత్తు చేసి, ఎయిర్ ఇండియా సర్వీసు నడిపేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు.. కాని చావు కబురు చల్లగా చెప్పింది ఎయిర్ ఇండియా. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమని చెప్పింది. ఈ తరుణంలో, ఇప్పుడు దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ ఆశలు చిగురింప చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి వీలుగా స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అరబ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధంగా ఉన్న ఫ్లై దుబాయ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ కోస్తా ప్రజలకు తీపి కబురు అందించింది. ఎయిర్‌ ఇండియా ఇచ్చిన షాక్‌తో స్తబ్దుగా ఉన్న పారిశ్రామికవేత్తలలో కూడా తాజా కబురుతో జోష్‌ వచ్చింది.

airlines 02062018 3

కిందటి నెల చివర్లో 24, 25 తేదీల్లో చెన్నైలో జరిగిన సదరన్‌ రీజియన్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ వల్ల అనుకోకుండా ఫ్లై దుబాయ్‌ నుంచి ఆసక్తి వ్యక్తమైంది. ఈ సమావేశానికి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూదనరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి ఉన్న అవకాశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేశారు. దేశీయంగా ఇండిగో, ఎయిర్‌ ఆసియా, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఫ్లైదుబాయ్‌, ఎయిర్‌ ఇండియా వంటి అనేక ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రతినిథులు పాల్గొన్నారు. విదేశీ అవకాశాలకు సంబంధించి ఏపీడీ ప్రజంటేషన్‌ను అన్ని విమానయాన సంస్థలు ఆసక్తిగా విన్నప్పటికీ, ఫ్లై దుబాయ్‌ సంస్థ తక్షణం స్పందించింది. స్లాట్‌ కోరుతూ సివిల్‌ ఏవియేషన్‌కు దరఖాస్తు చేయటం కూడా వెంటనే జరిగిపోయింది. మరి కేంద్రం, ఎలా స్పందిస్తుందో చూడాలి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read