రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో వెనుకబడిన రాష్ట్రానికి, రాజధాని అమరావతి ప్రాంతానికి ఐటి కంపెనీల రాక మొదలైంది. విజయవాడ ఆటోనగర్‌లోని ఇండ్‌వెల్ టవర్‌లో ఎనిమిది ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో 650 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. చంద్రబాబు మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా చాలా కంపెనీలు విజయవాడకు వచ్చేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో, ఐటీ మొదలుపెట్టినప్పుడు కూడా, ఇలా చిన్నగానే మొదలైంది అని, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికే సైబరాబాద్ గుండెకాయ అయ్యింది అని అన్నారు. ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉండేదని.. దాన్ని విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా మార్చే క్రమంలో హైటెక్‌సిటీని ఏర్పాటుచేశానన్నారు. ఆ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు తాను ఎంతగా శ్రమించారో వివరించారు.

నైపుణ్యం కలిగిన యువత ఏపీ సొంతమని, వారికి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లినవారు తిరిగి పుట్టినగడ్డకు వచ్చి కంపెనీలు ఏర్పాటుచేయడాన్ని సీఎం అభినందించారు. ప్రస్తుతం ఎనిమిది కంపెనీలతో ప్రారంభమైన ఈ ప్రస్థానం భవిష్యత్తులో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

త్వరలో అమరావతిలో ప్రారంభం అయ్యే ఐటి కంపెనీలు:
విజయవాడలో మరో నాలుగు ఐటి కంపెనీలు జూన్ లో ప్రారంభం కాను న్నాయి. వీటితో 500 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి.

ఎంతో కాలంగా, నిరుపయోగంగా ఉన్న గన్నవరంలోని మేధా టవర్స్ కూడా త్వరలో జీవం పోసుకోనుంది. స్పెయిన్ కు చెందిన Grupo Antolin త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే HCL, Neslova Systems కూడా త్వరలో మేధా టవర్స్ నంచి పని చేయ్యనున్నాయి. ఈ పరిశ్రమల రాకతో, రాజధాని ప్రాంతంలో ఐటి పరిశ్రమలకు పెద్ద ఊతమిచ్చినట్లు అవుతుంది. HCL లాంటి పెద్ద కంపెనీ రాజధానిలో కాలు మోపితే, దాని బాటలో మరి కొన్ని పెద్ద కంపెనీలు వచ్చే అవకాసం ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

అలాగే మంగళగిరిలో జులైలో ప్రారంభించే మరో 3 కంపెనీలతో వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి.

ఇవాళ విజయవాడలో ప్రారంభమైన కంపెనీలు
Edbrix, MSR Cosmos, Vintech, JOLT Technologies, Adept Talent, Paytam, AdvanSoft International, Accel International Inc

ఈ ఆఫీసుల ఫోటులు కింద చూడవచ్చు.

vijaywada it companies 17022017 2

vijaywada it companies 17022017 3

vijaywada it companies 17022017 4

vijaywada it companies 17022017 5

vijaywada it companies 17022017 6

vijaywada it companies 17022017 7

vijaywada it companies 17022017 8

vijaywada it companies 17022017 9

Advertisements

Advertisements

Latest Articles

Most Read