తెలుగుదేశం ఎమ్మల్యేను, కేరళ సియం ప్రశంసించటం ఏంటి అనుకుంటున్నారా ? మన రాష్ట్ర ఎమ్మల్యే చేసిన పని, ఇప్పుడు టాక్ అఫ్ ది కంట్రీ అయ్యింది. అనేక రాష్ట్రాల్లో వార్తలు కూడా వచ్చయి. పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు పై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశంసలు కురిపించారు. ఆత్మలు, దయ్యాలు లేవంటూ నిరూపించేందుకు కొన్ని రాత్రులు శ్మశానంలో నిద్రించిన ఆయనను విజయన్‌ ఎంతగానో మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న పినరయి విజయన్‌ ఆయనను పలు విధాలుగా ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ''మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యోధుడు రామానాయుడు. దెయ్యాల గురించి భయపడుతున్న పనివాళ్ళలో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు మరిన్ని రాత్రులు శ్మశానంలో గడపాలని నిర్ణయం తీసుకున్నారు. రామానాయుడు చేస్తున్న ఈ ప్రయత్నం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశం యావత్తు ఆయన సాహసంపై దృష్టి నిలిపింది.'' అని విజయన్‌ ట్వీట్‌ చేశారు.

ramanaidu 25062018 2

అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడానికి, కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్ట ర్ నిమ్మల రామానాయుడు నేరుగా శ్మశాన వాటికలోనే ఒక రాత్రి నిద్ర చేశారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ స్మశాన వాటికను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి పనులు మందగమనంతో ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే నిమ్మల పనుల నత్తనడక పై ఆరా తీశారు. శ్మశానంలో పనులు, మరో వైపు తవ్వకాల్లో ఎముకలు బయటపడడం తదితర కారణాలతో కార్మి కులు భయాందోళనలకు గురవుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వాస్తవానికి అభివృద్ది పనుల్లో 50 శాతం ఈ మాసాంతానికే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పనుల పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.

ramanaidu 25062018 3

కార్మికుల్లో నెలకొన్న భయాం దోళనలను పోగొట్టడానికి, మనోస్థైర్యం ఇవ్వడాని కి ఎమ్మెల్యే సాహతోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆయన శ్మశాన వాటికలోనే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అక్కడే మడత మంచం పై నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు తేవడంలోనే ఆనందం లేదని వాటిని సద్వినియోగం చేసి అభివృద్ధి జరిగినప్పుడే సం తృప్తి కలుగుతుందన్నారు. శ్మశానంలో నిద్రించడం పట్ల ఆయన స్పందిస్తూ తనకు ఏవిధమైన భయాందోళనలు లేవని, సాటి మనిషిగా కార్మికుల్లో ధైర్యాన్ని నింపి పనులను వేగవంతం చేయించడానికే రాత్రి బసకు ఉపక్రమించానని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read