ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ కొరియా కార్ల తయారీ సంస్థ కియో మోటర్స్‌ పరిశ్రమ నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా పెనగొండ మండలం, ఎర్రమంచి, గుడిపల్లిలో, 587.84 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం ఇప్పటికే అప్పగించింది. ప్రతిష్ఠాత్మక కియో కార్ల పరిశ్రమను తమ వద్ద నెలకోల్పేలా పలు రాష్ట్రాలు తీవ్రంగా యత్నించాయి. అయితే సంస్థ ఏపీలో పరిశ్రమ నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చిన సంగతి తెలిసిందే. ఏటా 3లక్షల కార్లు తయారీ సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం 1.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కాగా 2019 ద్వితీయార్దానికల్లా ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కియా, ఇప్పుడు కియా ఇండియా వెబ్సైటులో అనంతపురం ప్లాంట్ గురించి ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన MoU ఫోటోలు కూడా పోస్ట్ చేసింది.
http://www.kia-motors.in/web/html/india/IndiaPlant.jsp

అంతే కాదు, ఇప్పటి నుంచి ఉదోగ్యాల కోసం ధరఖాస్తు చేసుకోవాటానికి అవకాశం ఇచ్చింది.
http://www.kia-motors.in/web/html/india/Careers.jsp

అంతే కాకుండా డీలర్షిప్ కోసం కూడా, ధరఖాస్తు చేసుకోవాటానికి అవకాశం ఇచ్చింది.
http://www.kia-motors.in/web/html/india/NewDealerApplication.jsp

మొత్తానికి "కియో మోటర్స్‌" తన పనులు అన్నీ చకచక పూర్తి చేసేస్తుంది. కియో మోటర్స్‌ రాకతో అనంతపురం రాత మారిపోనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read