ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నీ ఇచ్చేసాం, లెక్కలు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే... మీకు ఇంకా లక్షలు లక్షలు కోట్లు ఇస్తాం అంటున్నారు.. కాని యూసీలు చూపించాలి అంట... అలాగే, దొలేరా సిటీ గురించి చంద్రబాబు చేస్తున్న విమర్శలు పై వెనకేసుకుని వచ్చారు... ఈ రోజు కూడా, జీవీఎల్ అనేక ఆరోపణలు చేసారు... జీవీఎల్ వ్యాఖ్యల పై లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు... ఇది లోకేష్ స్పందన "ఏపీ ప్రభుత్వం సమర్పించిన యూసిలు సరిగా లేవు అని చెప్పటానికి, జివిఎల్ ఎవరు ? సమర్పించిన యూసిలు సరిగా లేని యెడల, కేంద్రంలోని ఆ శాఖల వారు వివరణ అడగాలి. వెనుక బడిన జిల్లాలుకు కేటాయించిన రూ. 1000 కోట్లు నిధులకు, సంబందించిన యూసిలు ఇప్పటికే సమర్పించడం, అవి కేంద్ర శాఖలు ఆమోదించడం కూడా జరిగింది అని, తమరికి తెలియపరుస్తున్నాను."

gvl 04062018 2

"అమరావతిలో డ్రైనేజీ పనులకు ఏ విధమైన నిధులు విడుదల చేయలేదు. రూ. 460 కోట్లు & రూ. 540 కోట్లు విజయవాడ మరియు గుంటూరు నగరాలకు మాత్రమే విడుదల చేసారు. ఇప్పటి వరుకు అయిన పనులకు గాను, రూ. 349 కోట్ల యూసిలు సమర్పించటం జరిగింది. రెండు నగరాల్లో మిగిలిన పనులు, వచ్చే సంవత్సరం నాటికి పూర్తి అవుతుంది. ఇప్పటివరకు కేంద్రం అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమే, యూసిలు రూ. 1583 కోట్లకు సమర్పించండం, దానిని వారు ఆమోదించారు. జివిఎల్ గారు, ఏ "ఊహాజనిత ప్రాజెక్ట్" కి రూ. 8962 కోట్లు నిధులు విడుదల చేసాము అంటున్నారో, ఆ వివరాలు తెలపాలి, లేదా మీరు చెప్పినవి అబద్దాలు అని ఒప్పుకోండి. కాగ్ రిపోర్ట్ 2016 - 17 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన రూ. 83900 కోట్ల ఎడ్యుకేషన్ సెస్ లెక్కలలో అవకతవకలు జరిగినట్టు ప్రశ్నించింది. జ్యూట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు, వివిధ శాఖల యూసిలు సమర్పించకపోవటం వీటిలో ముఖ్యమైనవి."

gvl 04062018 3

"ఇప్పుడు బీజేపీ వారు, కాగ్ కేంద్ర ప్రభుత్వం పై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్తుందా. యూసిలు సమర్పించడం, వాటిని ఆమోదించడం అనేది పరిపాలనలో జరిగే రొటీన్ ప్రాసెస్. అది కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పరిధిలోనిది. ఈ విషయం పట్టుకుని, బీజేపీ వారు నిధులు దుర్వినియోగం జరగుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పై రాజకీయం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి యూసిలు అవసరం లేదనే విషయం జివిఎల్ నరసింహ రావు గుర్తుంచుకోవాలి." అంటూ లోకేష్ స్పందించాలి. ఇక్కడ లోకేష్ చెప్పిన సూచన కూడా, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూసీలలో తప్పు ఉంటే, యూసీలు ఇవ్వకపోతే అడగటానికి జీవీఎల్ ఎవరు, అమిత్ షా ఎవరు ? కేంద్రంలోని అధికారులు కాని, ప్రధాని కార్యాలయం కాని, ప్రధాని కాని ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఎందుకు అడగలేదు ? అది అడిగితే రాష్ట్రం చెప్తుంది నిజమో, కేంద్రం చెప్తుంది నిజమో తెలుస్తుంది కదా... కొంచెం మీ కేంద్రానికి ఈ సూచన ఇవ్వండి జీవీఎల్ గారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read