జాతీయ స్థాయిలో ఆంధ్రుడి సత్తా ఎంటో మరోసారి తెలిసింది. జాతీయ స్థాయిలో ఏ విభాగంలోనైనా మొదటి ఐదు స్థానాల్లోపే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. రాజధాని కూడా లేకుండా ఏర్పడిన కొత్త రాష్ట్రం , కేవలం మూడు సంవత్సరాలలో ఈ స్థాయికి ఎదిగిందంటే దానికి కారణం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వారికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు దీక్షాపట్టుదలలే కారణం.

మొన్న ఏకంగా 19 అవార్డులు, నిన్న పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ లో... తాజాగా, పురపాలన, అమృత పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. అమృత్ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం 13 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. వీటిలో 10 విభాగాల్లో నూటికి నూరు శాతం సంస్కరణలు తీసుకురాగా మరో మూడింటిలో దాదాప పూర్తి కావచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి 97 పాయింట్లు సాధించింది. మొత్తం 130 పాయింట్లకు గాను 126.05 పాయింట్లు సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

దీంతో రాప్రంలోని అమృత్ నగరాలకు అదనంగా మరో 10 శాతం నిధులు కేంద్రం కేటాయించనుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 32 అమృత నగరాల్లో 54 లక్ష్యాలను 4 సంవత్సరాలుగా సాధించాల్సి ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read