పచ్చటి ప్రకృతి ఒడిలో... సర్వాంగ సుందరంగా.... నవ్యాంధ్ర రాజధాని మంగళగిరిలో... నిర్మించిన ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్స్‌ ప్రాంగణంలో రెండెకరాల స్థలంలో ఐదంతస్థుల్లో నిర్మించిన ఏపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఈనెల 16వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రూ.40కోట్ల ఖర్చుతో 5 ఫ్లోర్లతో 1.10లక్షల చదరపు అడుగుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. గత ఏడాది అక్టోబర్‌లో భూమిపూజ చేసి, కేవలం 10నెలల్లో మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసి ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తం అయిదు ఫ్లోర్లు:
ఈ భవనంలో సుమారు 40వేల చదరపు అడుగుల నిర్మాణంలో ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు సీఐడీ విభాగానికి కేటాయించారు. దీనితో సీఐడీకి డీజీపీ మొదటి ప్రాధాన్యం ఇచి నట్లయింది. ఇక రెండు, మూడో అంతస్థుల్లో పీ అండ్‌ ఎల్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు,

ట్రైనింగ్‌ అధిపతి, శాంతి భద్రతల ఏడీజీ, టెక్నికల్‌ సర్వీసెస్‌ తదితర విభాగాల అధిపతుల కార్యాలయాలకు అద్దాల గదులు నిర్మించారు. పలువురు ఐజీలు, ఇతర అధికారులు కూడా ఆయా ఫ్లోర్‌లలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఐదో అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్స్‌ హాల్‌, ఎస్పీలతో మాట్లాడేందుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం:
కార్యాలయం లో లిప్ట్‌ మొదలుకొని ఏ గదిలోపలికి ప్రవేశించాలన్నా బయోమెట్రిక్‌ తప్పనిసరి. సిబ్బంది కార్యాలయంలోకి ప్రవేశించాలంటే వేలిముద్రతోనే తలుపు తెరుచుకుంటుంది. ఆఫీసర్ల పేషీల్లోకి ఆయనతోపాటు పేషీ సీసీకి మాత్రమే బయోమెట్రిక్‌ లాక్‌ తెరిచే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా పై అంతస్తులో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలతో సువిశాలమైన గదిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేసారు. ఇక ఈ భవనానికి పశ్చిమాన పచ్చని చెట్లతో ఆహ్లాదంగా మంగళగిరి కొండ ఉంటుంది. మరోవైపు చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి సుమారు రెండు కిలోమీటర్ల మేర కనిపిస్తుంది. డీజీపీ పేషీకి ఎదురుగా కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉంటుంది. కారిడార్‌ నుంచి డీజీపీ పేషీ వరకూ చక్కటి కొటేషన్లతో పలు డిస్‌ప్లే బోర్డులు అమర్చారు. భవనంలో పనిచేసేవారి మనసుకు ప్రశాంతత లభించేలా చక్కటి సంగీతం వినిపించేవిధంగా ఏర్పాట్లు చేశారు.

ఆహ్లాదకర వాతావరణం:
నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా పచ్చని చెట్లను నరికేయకుండా ప్రొక్లెయిన్‌తో తొలగించి, మరో ప్రాంతంలో నాటారు. ప్రధాన ద్వారం నుంచి భవనంలోకి ప్రవేశించగానే కుడివైపు మెట్లు, లిప్ట్‌ ఉంటాయి. ఎడమవైపు రిసెప్షన్‌, వెయిటింగ్‌ హాల్‌ ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌లోనూ ఎదురుగా కారిడార్‌ ఉంటే కుడివైపు అధికారి, ఎడమ వైపు సిబ్బంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కారిడార్‌లో సీసీ కెమెరాలతోపాటు ఫైర్‌ సేప్టీ ఏర్పాట్లు చేశారు. ఈ భవనంలో కొత్తగా చెప్పుకోవాల్సింది గోడలు లేకుండా పిల్లర్స్‌ వేసి అద్దాలతో నిర్మించడం. అవసరాన్ని బట్టి బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలు వాడినా సిబ్బంది, ఇతరత్రా గదులకు రెండు అద్దాలు అమర్చి మధ్యలో ఆర్గానిక్‌ గ్యాస్‌ నింపారు. భవనం లోపల పనిచేసుకునే వారికి బయటి ఎండ వేడి తెలియకుండా ప్రశాంత వాతావరణంలో పనిచేయడానికి వీలుగా ఏర్పాట్లుచేసినట్లు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రతి ఫ్లోర్‌కు డైనింగ్‌ హాల్‌, సమావేశ మందిరం, రెండు కామన్‌ టాయ్‌లెట్లు నిర్మించారు.

police head quarters mangalagiri 13082017 2

Advertisements

Advertisements

Latest Articles

Most Read