ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం, 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగం ప్రపంచానికి తెలిసిందే. దేశమే కాదు, ప్రపంచమే ఈ మోడల్ చూసి ఆశ్చర్యపోయింది. ఇన్ని ఎకరాలు, ఒక్క ఆందోళన లేకుండా ప్రభుత్వానికి రావటం, ఎక్కడా లేదు. అయితే, ఇంకా ఒక 500 ఎకరాలు దాకా రావాల్సి ఉంది. వీరు రకరకాల కారణాలతో, ఇంకా భూములు ఇవ్వలేదు. నిజంగా ఇవ్వటం ఇష్టం లేని వారు కూడా ఉండే ఉంటారు. కాని, కొంత మంది కుల, పార్టీ పిచ్చ ఉన్న వారు మాత్రం, కావాలని గోల చేస్తున్నారు. వీరిని మొన్నటి దాక జగన తోడుగా ఉండి రచ్చ చేసే వాడు. ఇప్పుడు జగన్ పాదయాత్రలో బిజీగా ఉండటంతో, పవన్ కళ్యాణ్ ఈ రచ్చ చేసే బాధ్యత తీసుకున్నాడు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల నాశనమే టార్గెట్ గా, నిన్న అమరావతిలో పర్యటించాడు పవన్.

pk 23072018 2

పర్యటన ఒక్కటే కాదు, మీరు ఎదురు తిరగండి అంటూ ప్రజలని రెచ్చగొడుతున్నాడు. బులెట్లు వర్షం కురిసినా వెనక్కు తగ్గద్దు అంటూ, అక్కడ ఉన్న కొంత మందిని రెచ్చగొడుతున్నాడు. అయితే, నిన్న పవన్ పర్యటన వెనుక ఉన్న కారణం తెలిస్తే, నిర్ఘాంతపోతారు... పోయిన వారం అమరావతిని ఆపటానికి, జనసేన పార్టీ తరుపున ఒక నాయకుడు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసాడు. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఆ పిటీషన్ కొట్టేసింది. దీంతో అమరావతి పై మరో కుట్రకి ప్లాన్ చేసారు. ఈ రోజు నుంచి, ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల బృందం అమరావతిలో మరోసారి పర్యటించబోతోంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాజధానిలో తాము రుణ సహాయం అందించాలనుకుంటున్న ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.

pk 23072018 3

దీంతో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది కేంద్రం. ఈ లోన్ చెడగొట్టటానికి, సరిగ్గా ఈ ప్రపంచ బ్యాంకు బృందం వచ్చే టైంలోనే, అమరావతిలో అలజడి సృష్టించటానికి పవన్ వచ్చాడు. అక్కడ టెన్షన్ వాతావరణం కలిపించి వెళ్ళాడు. పవన్ పర్యటన ఉద్దేశం, ప్రపంచ బ్యాంకు ఋణం రాకుండా చెయ్యటమే అనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అమరావతి ప్రాజెక్టులకు రూ.3400 కోట్ల రుణం కావాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు మూడేళ్ల క్రితం కోరారు. ఆ పై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు అమరావతికి వచ్చి మాట్లాడి వెళ్లారు. సీఆర్డీయే అధికారులు సైతం అమెరికా వెళ్లి అధికారులతో చర్చలు జరిపారు. రుణం విడుదల ఇక లాంఛనమే అనుకొంటున్న సమయంలో.. రాజధానిలో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జగన్ పార్టీ కి చెందిన కొందరు వరల్డ్‌ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. దాంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మిగతా చెడగొట్టే పని చేస్తున్నాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read