చిత్తూరు జిల్లా, శ్రీసిటీ పారిశ్రామిక పార్కులోని ఆల్‌స్టామ్‌ ఇండస్ట్రీలో తయారైన మెట్రో రైలు బోగీలను, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి సరఫరా చేశారు. ఆల్‌స్టామ్‌ తమ మొదటి మెట్రోపాలిస్ రైలును, రౌస్ హిల్ డిపోకి సరఫరా చేసినట్టు సిడ్నీ మెట్రో ప్రకటించింది.

6 కోచ్ లు ఉన్న రైలును ఆల్‌స్టామ్‌, చిత్తూరు జిల్లా, శ్రీ సిటీ లో నిర్మించింది. 2014 సెప్టెంబరులో, సిడ్నీ మెట్రో 280 మిలియన్ యూరోల ఒప్పందం కుదుర్చుకుంది.

Alstom’s Urbalis 400 communications-based train control (CBTC) సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా, ఆటోమేటిక్ రైలు ప్రొటెక్షన్ & ఆటోమేటిక్ రైలు ఆపరేషన్ (ATP/ATO)విధానాల ద్వారా, ఈ రైలు ఆటోమేటిక్ గా ఆపరేట్ అవుతుంది.

ఆల్‌స్టామ్‌ వివరించిన దాని ప్రకారం, మూడు డబల్ డోర్స్, లగేజ్ పెట్టుకోవటానికి రెండు వరసలు ఉంటాయి. ఈ ఎయిర్ కండిషన్డ్ రైలుకి, 38 సిసి కెమెరాలు, అత్యవసర ఇంటర్కాంమ్ వ్యవస్థ, రెండు ప్రయాణీకుల సమాచార ప్రదర్శన వ్యవస్థలు, 6 లైవ్ ఎలక్ట్రానిక్ రూట్-మ్యాప్లు ఉంటాయి.

బొగీలను అత్యాధునికంగా రూపొందించిన ఆల్‌స్టామ్‌ యాజమాన్యాన్ని, చక్కని మౌళిక వసతులతో పరిశ్రమలకు ప్రోత్సాహమిస్తున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని సిడ్నీ మెట్రో అభినందించింది. వందకు పైగా విదేశీ పరిశ్రమలతో అభివృద్ది చెందుతున్న శ్రీసిటీ మేకిన్‌ ఇండియా ఉద్యమానికి దేశానికే ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read