ఈ రోజు ఉదయం పార్లమెంటులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.. కేంద్రం పై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్న టిడిపి ఎంపీలు, వివిధ పార్టీల మద్దతు కోసం రంగలోకి దిగారు... తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు గురువారం లోక్‌సభలో సోనియా గాంధీ, జ్యోతిరాదిత్యలను కలిసారు... వారితో కొద్ది సేపు మంతనాలు జరిపారు.... ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వారికి వివరించారు.... దీంతో ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం...

parliament 08022018 2

అయితే ఆంధ్రప్రదేశ్ సమస్యలు, టిడిపి ఎంపీలకు మద్దతుగా, కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. 184 నిబంధన కింద ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ, ఓటింగ్ జరపాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే నోటీసులు అందజేశారు... టీడీపీ ఎంపీలతో మంతనాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సమస్యల కోసం, ఎదో ఒకటి పార్లమెంట్ లో మా తరుపున చేస్తాం అని సోనియా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ వెంటనే నోటీసులు ఇవ్వడం గమనార్హం...

parliament 08022018 3

అయితే నిన్న టిడిపి ఎంపీల ఆందోళన విషయంలో, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలతో, టిడిపి ఎంపీలకు, కాంగ్రెస్ ఎంపీలకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది... ఆ సందర్బంలో కూడా సోనియా, కేశినేని నాని మధ్య మాటలు నడిచాయి... అదే సందర్భంలో రాజ్యసభలో కూడా, కేవీపీ చేస్తున్న ఆందోళనకు మా మద్దతు లేదు అని కాంగ్రెస్ ప్రకటించింది... అయితే, ఈ రోజు టిడిపి ఎంపీలు స్వయంగా సోనియాని కలవటం, సపోర్ట్ ఇవ్వాలని, బీజేపీ ఎదో ఒక నిర్దిష్టమైన ప్రకటన ఇచ్చేలా చెయ్యటం కోసం, మీరు కూడా కలిసిరావాలని సోనియాని కోరటం, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రజా ఆందోళన వివరించటంతో, సోనియా వెంటనే రంగంలోకి దిగి, ఏపి సమస్యల పై చర్చించాలి అంటూ, మల్లికార్జున ఖర్గే నోటీసు ఇప్పించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read