గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రాజీనామా చేసినట్టు అసెంబ్లీలో కలలకలం రేగింది... అధికారుల తీరుతో వంశీ మనస్తాపం చెంది రాజీనామా రెడీ చేస్తే, పక్కనే ఉన్న పెనమలూరు ఎమ్మల్యే బోడె ప్రసాద్, ఆ లేఖ చించి వేసారు... విషయం లోకేష్ కి తెలీటంతో, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు కళా వెంకటరావు, చినరాజప్ప జోక్యం చేసుకుని, వంశీతో మాట్లాడి ప్రస్తుతానికి విషయం సద్దుమనిగేలా చేసారు... డెల్టా షుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో రైతులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది అని ఇప్పటికే ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసారు వంశీ... ముఖ్యమంత్రి ఈ విషయంలో న్యాయం చేస్తాను అని చెప్పారు...

vamsi 22112017 21

అప్పటి నుంచి, వంశీ సియం కార్యాలయం సిబ్బందిని కలుస్తున్నారు... అయితే, ఇవాళ అక్కడ ఒక అధికారి, మీకు ఇక్కడ సంబంధం లేదు, బయటకు వెళ్ళండి అనటంతో, వంశీ తీవ్ర మనస్తాపానికి గురై, రాజీనామాకు సిద్ధ పడ్డారు... రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌... వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు...

vamsi 22112017 31

కాగా డెల్టా షుగర్స్‌ను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. . డెల్టా షుగర్ ఫ్యాక్టరీ మూసివేస్తే అనేక ఇబ్బందులు ఏర్పడతాయని, రైతులు హనుమాన్ జంక్షన్ నుంచి ఉయ్యూరుకు చెరకు తరలించాల్సి వస్తుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం పెరగటంతో పాటు రవాణా ఖర్చులు పెరుగుతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యాక్టరీని మూసివేయవద్దని కోరారు. ఈ పరిణామాలతో, ఇవాళ ఈ సంఘటన జరగటం కలకలం రేపింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read