ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం సాధించిన అరుదైన ఘనతను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పనితనం.. అందరికీ ఆదర్శం.. అంటూ అంతా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

వంద గంటల్లో 10 వేల మరుగుదొడ్ల నిర్మాణం’ అంశంగా విజయనగరం జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజానీకానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు లభించాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బహిరంగ మలవిసర్జన జిల్లాగా విజయనగరం జిల్లాను మార్చాలన్న ధృడ సంకల్పంతో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ తనదైన కృషి సలిపారు.

అందులో భాగంగా తొలి విడతగా జిల్లా లోని 71 గ్రామాల్లో 100 గంటల్లో 10వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మార్చి10న ఉదయం 6 గంటలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్‌ కేవలం 100 గంటల వ్యవధిలో అంటే అదే నెల 14 ఉదయం 10 గంటల లోపు లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకున్నారు. అధికార యంత్రాంగం సహకారంతో ఆమేరకు 100 గంటల్లో 10 వేల మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని అధిగమించారు. కే

వలం 100 గంటల్లో 10 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మింపబడడంతో జిల్లా ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. ఇప్పటికే లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా ఈ అరుదైన ఘనతకు స్థానం దక్కింది. తాజాగా సాక్షాత్తు దేశ ప్రధాని కూడా జిల్లా అధికార యంత్రాంగం సాధించిన ఘనతను ప్రశంసించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read