సరిగ్గా పదేళ్లు... కృష్ణా డెల్లా రైతులకు జూన్ నెలలో సాగు నీరిచ్చి... ఆ నీటి కష్టాలను పక్కకు తోసేస్తుంది "పట్టిసీమ". పదేళ్ల తర్వాత తూర్పు డెల్లా రైతులకు తొలి సారిగా జూన్ నెలలో సాగునీరు అందజేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ నీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విడుదల చేస్తారు.

పట్టిసీమ ద్వారా రోజుకు 2500 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి చేరుతోంది. పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయకముందు ఎనిమిది అడుగుల నీటిమట్టం ప్రకాశం బ్యారేజిలో ఉండేది. ఇప్పడు అది ఆదివారం నాటికి 11 అడుగులకు చేరింది. సోమవారానికి ఈ నీటి మట్టం 12 అడుగులకు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి పట్టిసీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాలోకి తరలించాలన్నది సర్కారు సంకల్పం. ఈ ఏడాది దీన్ని 100 టీఎంసీలకు పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఎంత ఎక్కువగా నీటిని కృష్ణాలోకి పంపింగ్ చేస్తే అంత మంచిదని జల వనరుల శాఖ చూస్తున్నది. జూలై, ఆగష్టు, సెప్టెంబర్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో లక్షలాది క్యూసెక్కల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నది. గోదావరికి వరదలు వస్తే పట్టిసీమ ద్వారా మరింత ఎక్కువ నీటిని కృష్ణాకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. తద్వారా ప్రకాశం బ్యారేజిలో నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతున్నదని వారి అభిప్రాయంగా ఉన్నది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read