hero surya 05042016 1

తమిళ సూపర్ స్టార్ సూర్య రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. అదికూడా మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లలో. సూర్య తన తాజా చిత్రం '24' సినిమా షూటింగ్ కోసం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, ఈడిగపల్లె గ్రామానికి సోమవారం వచ్చాడు. రాత్రి పొద్దుపోయే దాక షూటింగులో పాల్గొన్నాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు.

మార్గమధ్యలో వలసపల్లె అనే గ్రామం వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక మహిళ తీవ్ర గాయాలు అయ్యి రోడ్డుపై పడి ఉంది. ఆమె రోడ్డుపై పడి ఉండటాన్నిగమనించిన హీరో సూర్య, ఆమెను తన వాహనంలో ఎక్కించుకొని, చికిత్స నిమిత్తం తిరుపతి తరలించారు. మదనపల్లె చేరుకున్నాక కుడా ఆ మహిళ పరిస్థితిపై ఆరా తీశారు.

మానవత్వం చాటుకున్నాహీరో సూర్య రియల్ లైఫ్ హీరో అని అక్కడ ప్రజలు మెచ్చుకున్నారు.

Advertisements

రాత్రి పూట చిత్తూరు జిల్లలో మానవత్వం చాటిన హీరో సూర్య Last Updated: 05 April 2016