జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఇప్పటి వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై, 500 పైగా దాడులు జరిగాయని, 8 మంది చనిపోయారని తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తున్న సంగాతి తెలిసిందే. వైసిపీ అరాచకాలు తట్టుకోలేక, గ్రామాల నుంచి ప్రాణ భయంతో వెళ్ళిపోయిన కార్యకర్తలను, గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసి అక్కడ ఉంచారు. అయితే, పోలీసులకు ఎంత చెప్పినా, ఎవరూ పట్టించుకోవటం లేదని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అందుకే చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. ఈ నెల 11న చలో పల్నాడు పేరుతొ, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో పాటుగా, వైసిపీ బాధితులు అంతా అక్కడకు హాజరు కావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అనే అనుమానాలు వస్తున్న తరుణంలో, ఇప్పుడు మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.

palnadu 09092019 2

గురజాల పోలీసులు, గురజాలలో, ఈ రోజు నుంచి, 12వ తారీఖు వరకు 144 సెక్షన్ పెట్టారు. దీనికి కారణంగా, మొహరం పండుగ, గణేష్ నిమ్మజనం అని ఉత్తర్వుల్లో పెర్కున్నారు. అయితే, ఇలా పండుగల రోజుల్లో 144 సెక్షన్ పై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. ముఖ్యంగా, గ్రామాల్లో ఘనంగా, ఊరంతా ఏకమై జరుపుకునే గణేష్ నిమ్మజనంలో కూడా 144 సెక్షన్ ఎలా పెడతారు అంటూ కొంత మంది ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు లేకపోలేదని, తెలుగుదేశం నేతలు అంటున్నారు. చంద్రబాబు గారు ఈ నెల 11న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కాబట్టి, వైసిపీ ప్రభుత్వ అరాచకాలు బయటకు రాకుండా ఉండేందుకు, చంద్రబాబు పర్యటనను అడ్డుకునే క్రమంలో, ఇలా 144 సెక్షన్ పెట్టేరని తెలుగుదేశం ఆరోపిస్తుంది.

palnadu 09092019 3

500 మంది పై దాడి చేసి, 8 మందిని చంపేస్తే కూడా, ఆందోళన చేసే హక్కు కూడా లేదా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని పై అనవసర రాద్ధాంతం చేసి, చంద్రబాబు పై మరోసారి కక్ష తీర్చుకునే ప్రయత్నంలో, ఇలా 144 సెక్షన్ పెట్టి, ఆ రోజు మరింత ఉద్రిక్త పరిస్థితులు రేపే ఉద్దేశంతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. మరో పక్క, ఈ రోజు హోం మంత్రి, మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలేమీ లేవని, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు. మరి అలాంటప్పుడు 144 సెక్షన్ ఎందుకు పెట్టారని తెలుగుదేశం ప్రనిస్తుంది. మరో పక్క, తెలుగుదేశం పునరావాస కేంద్రంలో అందరూ పైడ్ ఆర్టిస్ట్ లే ఉన్నారు అంటూ, హోం మంత్రి ప్రకటన చేసారు. అక్కడ తలలు పగిలి, ఒంటి నిండా కుట్లు వేసుకున్న వాళ్ళు రోజు మీడియాతో మాట్లాడుతున్నా, ఆ బాధితుల్ని, సాక్షాత్తు హోం మంత్రి గారే, పైడ్ ఆర్టిస్ట్ లు అనటం పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 144 సెక్షన్ పెట్టటంతో, చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుంది, చంద్రబాబు తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి. అమరావతి అసలు ఉంటుందా, ఉండదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్ర గందరగోళ పరిస్థతితులకు తావు ఇచ్చింది. ఇంత జరుగుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అమరావతి పై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దీంతో అమరావతి ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూషన్ ప్రజల్లో ఉంది. ఒక పక్క ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతికి రుణం ఇవ్వం అంటూ తేల్చి చెప్పాయి. జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం దగ్గరకు వెళ్లి, అమరావతికి ప్రస్తుతానికి ఎలాంటి సహాయం అవసరం లేదని చెప్పారు. అయితే అమరావతి పై పెట్టుబడులు పెట్టె వారు కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నారు.

singapore 09092019 2

ముఖ్యంగా అమరావతిలోని స్టార్ట్ అప్ ఏరియాలో పెట్టుబడులు పెట్టాటానికి రెడీ అయిన సింగపూర్ ప్రభుత్వం, కూడా కన్ఫ్యూషన్ లో పడింది. పోయిన వారం సింగపూర్ మంత్రి శ్రీధరన్ ఈ విషయం పై, సింగపూర్ పార్లమెంట్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమరావతిలో అధికార మార్పిడి జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వ వైఖరి పై గమనిస్తున్నాం అని అన్నారు. అలాగే, ప్రభుత్వ బ్యాంక్ కూడా అమరావతికి రుణం ఇవ్వకుండా వెనక్కు వెళ్లిందని, ఈ పరిణామాలు అన్నీ గమనిస్తున్నాం అని అన్నారు. అయితే ఈ రోజు మరో సింగపూర్ మంత్రి వీవీయన్‌ బాలకృష్ణన్ కూడా అమరావతి పై స్పందించారు. వీవీయన్‌ బాలకృష్ణన్ సింగపూర్ ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి. ఆయన కూడా ఈ రోజు సింగపూర్ లో జరిగిన ఒక సదస్సులో, అమరావతి పై మాట్లాడారు.

singapore 09092019 3

సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుందని, అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సింగపూర్ ప్రభుత్వం గమనిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును సమీక్షించాలని భావిస్తోందని సింగపూర్‌ కన్సార్షియం తమకు తెలిపిందని సింగపూర్ మంత్రి వెల్లడించారు. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కోసం తాము వేచి చూస్తున్నామన్నారు. సమీక్ష ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ఎలాగూ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి పై ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, సింగపూర్ ప్రభుత్వం, ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టే అనుకోవాలి. చూద్దాం, జగన్ మోహన్ రెడ్డి గారి మనసు ఏమైనా మారుతుంది ఏమో.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత మూడు నెలలుగా, తెలుగుదేశం పార్టీ పై వెంటాడి, వెంటాడి చేస్తున్న రాజకీయ దాడుల పై, నిరసన తెలిపేందుకు, భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల పై గత మూడు నెలలుగా, ఇప్పటి వరకు 500 పైగా దాడులు జరిగాయి, 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి, పల్నాడులో దాడులు ఎదుర్కోవటానికి, ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నలు మూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు ఇక్కడకు రావాలని, ఆలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపీ బాధితులు ఇక్కడకు రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. అయితే, ఈ ఆందోళనకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? లేక శాంతి భద్రతలు సాకుగా చంద్రబాబుతో పాటు అందరినీ అడ్డుకుంటుందా ? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

cbn 09092019 2

అయితే ఈ ఆందోళన కార్యక్రమం పై చంద్రబాబు మాత్రం పట్టుదలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు, నేతలు ఒంటరి వారు కాదని, ఈ కార్యక్రమంతో, చాటి చెప్పాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్తి కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని, ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ మొద్దు ప్రభుత్వానికి చాటి చెప్పుదామని చంద్రబ్బు అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరూ తరలి రావాలని, నిన్న నిర్వహించిన టెలి-కాన్ఫెరెన్స్ లో చెప్పారు. పార్టీ కార్యకర్తల పై దాడులు గురించి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనీ చంద్రబాబు అన్నారు. అలాగే ఎక్కడైతే పోలీసులు తెలుగుదేశం సానుభూతి పరులు, పెట్టిన కేసుల గురించి, పట్టించుకోవటం లేదో, అక్కడ ప్రైవేటు కేసు పెట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు.

cbn 09092019 3

ఈ నెల 10న తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సమావేశం అవుతుందని, పార్టీకి చెందిన న్యాయవాదులంతా హాజరవుతారని, చట్ట పరంగా ఏమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామని చెప్పారు. కార్యకర్తల పై దాడులు, అక్రమ కేసులు పై ఈ లీగల్ సెల్ అండగా ఉంటుందని, కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. వీళ్ళ ఆటలు ఇంకా సాగనివ్వను, ప్రభుత్వాలు మారినప్పుడు భావోద్వేగాలు సహజం అని ఇన్నాళ్ళు కాంగా ఉన్నాం, కాని మూడు నెలలు అయినా, ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారని, వీళ్ళ సంగతి చూస్తానని, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ముందు నా పై కేసులు పెట్టమనండి చూద్దాం అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. బాబాయి ని చంపినివాడిని ఇప్పటి వరకు పట్టుకోలేక పోయారు కాని, మన పైన మాత్రం దాడులు చేస్తున్నారని అన్నారు. బాధితులు అందరినీ బస్సులు పెట్టి, ఈ నెల 11న ఆత్మకూరు తీసుకువెళ్తాం, అంటూ చంద్రబాబు ధైర్యం చెప్పారు. అయితే ఈ కార్యక్రమం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

జగన్ ప్రభుత్వం పై, మరోసారి కేంద్రం ఫైర్ అయ్యింది. ఒక పక్క విజయసాయి రెడ్డి, మేము చేసి ప్రతి పనికి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి, మేము అన్నీ వారికి చెప్పి, వారి అనుమతితోనే చేస్తున్నాం అని చెప్తుంటే, కేంద్రం మాత్రం, ప్రతి విషయంలోనూ తీవ్రంగా స్పందిస్తుంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి, కేవలం చంద్రబాబుని ఎలా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో, చంద్రబాబు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తాను అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఇంపాక్ట్ రాష్ట్రంలోనే కాక, దేశం మొత్తం విద్యుత్ పెట్టుబడులు పై పడింది. ఒప్పందాలు జరిగిన సమయంలో అటు కేంద్రం కాని, ఇటు ట్రిబ్యునల్ కాని పర్యవేక్షణలో జరుగుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదు. అయినా సరే, ఎదో జరిగిపోయింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో ముందుకు వెళ్లారు.

rksingh 09092019 2

అయితే, ఈ చర్యను కేంద్రం తప్పుబట్టింది. ఇలా చేస్తే, పెట్టుబడులు పెట్టె వారు, వెనక్కు వెళ్లి పోతారని, ఒకసారి ఒప్పందం అయిన తరువాత, మళ్ళీ సమీక్ష చేస్తే, పెట్టుబడి వర్గాలు, ఇది మంచి పరిణామం కాదని చెప్పింది. చివరకు హైకోర్ట్ కూడా, ఇదే చెప్పింది. అలాగే ట్రిబ్యునల్ కూడా ఇవే ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం చెప్పినట్టే, జపాన్ ప్రభుత్వం, ఈ వ్యవహారం పై అసహనం వ్యక్తం చేస్తూ, మా పెట్టుబడి దారులను ఇబ్బంది పెడితే, మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టం అని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా జగన్ వైఖరి మారలేదు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ హైదరాబాద్ వచ్చారు. కేంద్రం వంద రోజుల ప్రగతి పై, ఆయన ఒక నివేదక సమర్పించారు. ఈ సందర్భంగా జగన్ పై విరుచుకు పడ్డారు. పవర్ ప్రాజెక్ట్ ల పై జగన మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంతా స్వయంగానే జరిగింది అని మేము చెప్పినా వినటం లేదని అన్నారు.

rksingh 09092019 3

సరైన విధానం ఉంటేనే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, ఈ వాతావరణాన్ని చెడగొడుతూ, మేము చెప్పినా జగన్ వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి ఒక లేఖలతో జగన్ వచ్చి రద్దు చేయమని కోరారని, దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు మాత్రం ఇవ్వ లేవని, సరైన ఆధారాలు లేకుండా పీపీఏను రద్దు చేయాలని జగన్ కోరుతున్నారని ఆర్కే సింగ్ ఆరోపించారు. జగన్ వైఖరితో పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, పవర్ ప్రాజెక్టుల పై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ఇప్పటికైనా జగన్ గారు మారతారో, ఇంకా తవ్వుతూనే ఉంటారో చూద్దాం.

Advertisements

Latest Articles

Most Read