వైసిపీ అధ్యక్షుడి జగన్ మోహన్ రెడ్డి పై, అనేక కేసులు ఉన్న సంగతి తెలిసిందే. తన తండ్రి అధికారంలో ఉండగా, ఆదాయానికి మించిన ఆస్థులు వెనకేసారని, సిబిఐ అభియోగాలు మోపింది. తీవ్ర ఆర్ధక నేరాలు ఉండటంతో, ఈడీ కూడా కేసులు పెట్టింది. జగన్ మోహన్ రెడ్డి పై మొత్తం 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. 2012 మే నెలలో జగన్ మోహన్ రెడ్డి ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, అప్పటి నుంచి విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసుల విచారణలో భాగంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్ కు రావాల్సి ఉంటుంది. అయితే జగన్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా శుక్రవారం కోర్ట్ కు వెళ్ళలేదు. ప్రతిసారి న్యాయమూర్తికి ముఖ్యమంత్రిగా విధులు ఉన్నాయని చెప్తూ, మినహయింపు పొందుతున్నారు.

jagancourt 06092019 1

అయితే ప్రతి సారి ఇది కుదరదు కాబట్టి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్ట్ లో, ఒక పిటీషన్ దాఖలు చేసారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావాలంటే కుదరదు, తన తరుపున, న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి హాజరుఅవుతారు, అనుమతి ఇవ్వండి అంటూ కోర్ట్ లో పిటీషన్ వేసారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 ని కోట్ చేస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో గురువారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అని, తనకు చాలా ప్రభుత్వ బాధ్యతలు ఉన్నాయని, అలాగే ప్రతి వారం అమరావతి నుంచి హైదరాబాద్ రావాలి అంటే, చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదని, అందుకే తరుచు హైదరాబాద్ వచ్చి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి గండి కొట్టలేనని, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, మినహాయింపు ఇవ్వాలని కోరారు.

jagancourt 06092019 1

తన వ్యక్తిగత హాజరు ఎప్పుడు అవసరం అని కోర్ట్ అనుకుంటే, అప్పుడు వచ్చి హాజరు అవుతానని జగన్ కోర్ట్ కు చెప్పారు. ప్రతి వాయిదాకు నిందితుల హాజరు అవసరం లేదని, గతంలో, బసవరాజ్‌ ఆర్‌.పాటిల్‌, భాస్కర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఈ పిటీషన్ పై ఈరోజు విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది. అయితే ఈ వినతిని జగన్ గతంలో కూడా కోరారు. తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని, దాఖలు చేసుకున్న పిటిషన్‌ను 2014లో ఇదే కోర్టు తిరస్కరించగా హైకోర్టు సమర్థించింది. ఇక మరో పక్క, ఈ రోజు శుక్రవారం కావటంతో, జగన్‌ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు విచారణ జరిగింది. ఈ కేసులో విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రమే హాజరయ్యారు. ఇవాళ ఈ కేసులో 11చార్జిషీట్ల విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం రావటంతో, ఆయన వర్గీయులు అందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అయితే కొంత మందికి మాత్రం, అమితంగా, ఒకటి కంటే ఎక్కువ పదవులు ఇస్తున్నారు. ఉదాహరణకు, జగన్ మోహన్ రెడ్డి గారికి, నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డి విషయానికి వస్తే, ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అంటే జగన్ మోహన్ రెడ్డి గారికి అమితమైన ఇష్టం కాబట్టి, విజయసాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ హెడ్ గా చేసారు. అంతే కాదు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అంతే కాదు, మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ని చేసారు. ఇలా అనేక పదవులు ఇచ్చారు. ఒకే వ్యక్తకి ఇన్ని పదవులు ఇచ్చి, ఆ వ్యక్తి అంటే తనకు ఎంత నమ్మకమో చెప్పకనే చెప్పారు. అయితే ఇప్పుడు అలాగే మరి కొంత మందికి కూడా ఇలాగే ఎక్కువ పదవులు ఇస్తున్నారు.

vishnu 05092019 2

ఉదాహరణకు, వైసీపీ పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు, ఎమ్మెల్యేగా ఉన్నా సరే, ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి తోడు, ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ పగ్గాలను అప్పగించే యోచనలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ పదవితో పాటుగా, ఎంతో పోటీ ఉన్న, ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా కూడా అవకాసం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడో, రేపో వెలువడం ఖాయమని మల్లాది విష్ణు వర్గీయులు చెప్తున్నారు. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తి ఇన్ని పదవులు ఇవ్వటం కంటే, అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరికి, ఈ పదవి ఇవ్వచ్చు కదా అనే వాదన వినిపిస్తుంది.

vishnu 05092019 3

అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తనను నమ్ముకున్న వారినే ఆదిరిస్తారని, ఆయనకు నమ్మకం ఉన్న వారికే పదవులు ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మరో పక్క మల్లాది విష్ణు, స్వర్ణా బార్ విషయంలో , కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయంలో, ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి టిటిడి పదవులు ఇవ్వటం మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మల్లాది విష్ణు కాకపొతే, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓడిపోయినా ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఆ పదవి ఇవ్వచ్చు అనే వాదన వినిపిస్తుంది. ద్రోణంరాజు శ్రీనివాస్ పేరును కూడా జగన్ పరిశీలనలోకి ఉందని చెబుతున్నారు. అయితే తమ నేతకు మాత్రం ఎదో ఒక పదవి రావటం ఖాయం అని, మల్లాది విష్ణు వర్గీయులు అంటున్నారు.

అధికారం ఉంటే ఎవరైనా మాట వింటారు. నీ అంతటి వాడు లేడంటు భజన చేస్తారు. పదవులు కోసం, కాంట్రాక్టులు కోసం అధినేత దగ్గర లాబియింగ్ చేస్తారు. ఒక్కసారి అధికారం పొతే మాత్రం, అసలు రంగులు బయట పడతాయి. ఇది కేవలం నాయకులతోనే వచ్చిన సమస్య. కార్యకర్త మాత్రం, ఎప్పుడూ పార్టీకి నాయకుడికి విధేయుడిగానే ఉంటారు. ఇలాంటి ఫేజ్ నే ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కాకినాడలో పర్యటిస్తున్నారు. మొన్నటి వరకు ఉభయగోదావరి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. అయితే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫలితాలు తారుమారు అయ్యాయి. ఇక అధికారం పొతే ఏముంది, నాయకుల అసలు స్వరూపాలు బయట పడతాయి. ఇలాంటి సమయంలో కలిసికట్టుగా, నాయకుడిగా అండగా ఉండి, పార్టీని నిలబెట్టాల్సిన నేతలు డాన్స్ లు వేస్తున్నారు.

cbn 05092019 1

దీంతో జిల్లాలో టిడిపి పార్టీలో నాయకుల మధ్య ముసలం మొదలైంది. పక్క పార్టీ వైపు చూస్తూ, అటు ఏ కారణం చెప్పి వెళ్ళాలో అర్ధం కాక, సొంత పార్టీ పైనే నిందలు మోపి, పార్టీ అధిష్టానాన్ని బ్లాకు మెయిల్ చెయ్యటానికి సిద్ధం అయ్యారు. ఇదే కోవలో సీనియర్ నేత తోట త్రిమూర్తులు ఉన్నారు. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరతారంటూ, గత కొంత కాలంగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన జగన్‌ను కూడా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే జిల్లాకు చంద్రబాబు వచ్చిన సందర్భంలో, ఆయనను కూడా ఆహ్వానించారు. ఆయన రాకపోవటంతో, ఏకంగా చంద్రబాబే కబురు పంపించారు. సమావేశానికి రాకుండా వెంకటాయపాలెంలోనే త్రిమూర్తులు ఉండిపోయారు.

cbn 05092019 1

అయితే తిరుముర్తులు మాత్రం, నేను పార్టీకి రాజీనామా చెయ్యలేదని, పార్టీ అధిష్టానంతో నాకు ఏ ఇబ్బంది లేదని, కొంత మంది నేతలతోనే సమస్య అని, తన వద్దకు వచ్చియన్ నేతలతో చెప్పుకొచ్చారు. వారి పై తరువాత మాట్లాడుకుందామని, అధినేత జిల్లాకు వచ్చిన సమయంలో ఇలా చెయ్యటం భావ్యం కాదని, సీనియర్ నేతగా ఉన్న మీరు, ఇలా చెయ్యకుండా, అధినాయకుడి వద్దకు రావాలని కోరారు. అయినా సరే, సమావేశానికి రాలేనని త్రిమూర్తులు తేల్చిచెప్పారు. దీంతో త్రిమూర్తులు పార్టీ మార్పు ఖాయంగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. రామచంద్రాపురం నియోజవర్గం నుంచి తోట నాలుగుసార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల కృష్ణ చేతిలో పారాజయం పొందారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం నేతలు టార్గెట్ గా, వాళ్ళని ఎదో ఒక కేసులో ఇరికించి శిక్ష పడేలా చేసేలా, కార్యాచరణ నడుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పై 30కి పైగా కమిటీలు, ఎంక్యిరిలు వేసారు. వంద రోజులు నుంచి తవ్వుతున్నా, చంద్రబాబు విషయంలో జగన్ మోహన్ రెడ్డికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం నేతల పై ఫోకస్ పెట్టారు. అక్కడ ఉన్న నేతల పై పాత కేసులు అన్నీ తిరగదోడుతున్నారు. కోడెల లాంటి వారి పై, కావలని కేసులు పెట్టించి మరీ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతల పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇవేమీ పెద్ద నేరాలు కూడా కావు. అయితే ఏదైనా తప్పు తప్పే కాబట్టి, తప్పు చేసిన వారిని సమర్ధించలేము కాని, రాజకీయ కక్ష గురించి మాత్రం ప్రస్తావించాలి.

cbi 05092019 2

ఈ క్రమంలోనే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, సిబిఐ విచారణ కోరారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడిగా ఉన్న అక్రమమైనింగ్ కేసు పై సీబీఐ విచారణ చేయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసు హైకోర్ట్ లో ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే విషయాన్నీ హైకోర్టుకు తెలిపింది. అయితే చంద్రబాబు హయంలో, సిబిఐకి రాష్ట్రంలోకి వచ్చే అధికారం లేదు, దీంతో జగన్ ప్రభుత్వం ఇప్పటికే, సిబిఐకి అవసరమైన జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించింది. ఇదే విషయాన్నీ హైకోర్టుకు చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం తరుపున, సిబిఐ విచారణ కావాలని, కేంద్రానికి లేఖ రాస్తే, జగన్ వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి సీబీఐ కేసు అవుతుంది.

cbi 05092019 3

అయితే యరపతినేని శ్రీనివాసరావు వర్గీయులు మాత్రం, ఎలాంటి విచారణకు అయినా సిద్ధం అని, కాని రాజకీయ కక్ష సాధింపు మాత్రం మంచిది కాదని అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా, ఎలాంటి రాజకీయ కక్ష చెయ్యలేదని గుర్తు చేస్తున్నారు. ఇలా నేతల పై కేసులు పెట్టుకుంటూ ఇబ్బంది పెడితే, జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన రోజున, అనేక కేసులు ఉన్న వైసీపీ నాయకులు పై కూడా ఇలాగే కక్ష తీర్చుకునే రోజు వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యల పై కాకుండా, ఇలా రాజకీయ కక్షలతోనే రాజకీయం గడిచి పోతుంది. అయితే, ఇదే సందర్భంలో, తప్పు ఎవరు చేసినా తప్పే, వారికి చట్ట ప్రకారం శిక్షలు పడాల్సిందే. అది టిడిపి అయినా, వైసీపీ అయినా.

Advertisements

Latest Articles

Most Read