ఏపీ రాజధాని అమరావతిలో బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాంతో పాటు భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం ఏ-కన్వెన్షన్‌హాల్‌లో జగ్జీవన్‌రామ్ 109వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మాట్లాడుతూ బడుగులకు అండగా నిలిచిన నేత జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. ఎన్టీఆర్‌తో జగ్జీవన్‌రామ్ సన్నిహితంగా ఉండేవారని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, జగ్జీవన్‌రామ్ భవన్‌ను నిర్మించామని సీఎం చెప్పుకొచ్చారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారన్నారు. దళిత బిడ్డ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశామని తెలిపారు. పేదరికంలేని సమాజం తేవడమే తన జీవితాశయమని స్పష్టంచేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నానని, పేదలకు న్యాయం చేయడమే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.ఇప్పటికే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు తాజా గా జగ్జీవన్ రామ్ విగ్రహమ్ కూడా ఏర్పాటు చేస్తానని తెలిపి దళితుల గుండెల్లో చిరస్తాయి గా నిలిచిపోనున్నట్లు అక్కడున్న దళిత ప్రజాప్రతినిధులు చర్చించుకున్నారని సమాచారం.
Advertisements
Comments
RSS feed for comments to this post