Top Stories

ఐపీఎల్-12 సీజన్ కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ వేలం పాట ప్రక్రియ కొనసాగుతోంది. 2019 సీజన్ కు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్ లోని 8 జట్లు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో పేసర్ ఉనాద్కట్ ను రూ.8.4 కోట్లతో రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యువీ కనీస ధర రూ. 1 కోటి ఉండగా అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇక ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి కనీస ధర రూ.50 లక్షలు ఉండగా రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కొనుగోలు చేయడంతో జాక్ పాట్ కొట్టాడు. హనుమ విహారి స్వస్థలం. .ఏపీలోని కాకినాడ. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు నుంచి కెరీర్ ప్రారంభించిన విహారి..ప్రస్తుతం ఆంధ్రా జట్టుకు ఆడుతున్నాడు. 2010 నుంచి 2016 వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016-17 సీజన్‌లో ఆంధ్రా జట్టుకు మారిన తర్వాత విహారి కెరీర్‌ ఊపందుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాట్‌తో సత్తాచాటిన విహారి 5142 పరుగులు చేశాడు. 15 సెంచరీలతో పాటు 22 అర్ధ సెంచరీలు సాధించాడు. 302 అత్యధిక స్కోరు. 2017-18 సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో టాప్‌-5లో నిలిచాడు. ఆంధ్ర క్రికెట్‌ నుంచి భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రస్తుత జాతీయ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చివరి ఆటగాడు. 1999లో న్యూజిలాండ్‌పై వికెట్‌ కీపర్‌గా అతడు అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయిలో అంచనాలు పెంచిన ఆటగాడు ఇప్పటిదాకా లేడు. కానీ 19 ఏళ్ల ఎదురుచూపుల అనంతరం 24 ఏళ్ల హనుమ విహారి ఇప్పుడు భారత టెస్టు జట్టులోకి రావటం, ఇప్పుడు ఏకంగా ఎక్కువ పోటీ ఉండే, ఐపీఎల్ లాంటి చోట, హాట్ ఫేవరేట్ గా ఉన్నాడు. భారత క్రికెట్ జట్టులో రానిస్తున్నట్టే, ఐపీఎల్ లో కూడా, మంచి పేరు తెచ్చి, మన రాష్ట్రం పేరు నిలబెట్టాలని కోరుకుందాం.. Add new comment

రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అధునాతన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వైద్యం అందించే సమయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు, ఆసుపత్రిలో రోగుల రద్దీని తగ్గించేందుకు పేషంట్ యాక్సిస్ కార్డు విధానానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి నుంచి ఈ విధానాన్ని రాష్టవ్య్రాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్ రోగులకు ఈ కార్డుల ద్వారా సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ముఖ్యంగా ఆసుపత్రిలో రోగుల సహాయకుల సంఖ్య తగ్గించడం, పారిశుద్ధ్యాన్ని పెంచడం, వైద్యసేవల్లో అందే జాప్యాన్ని నివారించడం, ఆసుపత్రిలో పిల్లల అపహరణను నిరోధించేందుకు ఈ కార్డు విధానానికి శ్రీకారం చుట్టారు. జనవరి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ కార్యక్రమానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ విధానంలో భాగంగా రోగి ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి అందించే వైద్యసేవలు, వినియోగించే మందులు, వైద్యులు, వార్డు, రోగి వెంట సహాయకులుగా వచ్చిన వారి వివరాలను కార్డులో పొందుపరుస్తారు. రోగికి అందాల్సిన, అందుతున్న వైద్యసేవల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ సిస్టమ్‌లో నమోదవుతుంది. ప్రతి ఆసుపత్రిలో విభాగాల వారీగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎలక్ట్రికల్ గేట్ సిస్టమ్‌ను ముందుగా ఆయా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. రోగికి అందించిన యాక్సిస్ కార్డును స్కాన్ చేయగానే గేటు తెరుచుకుంటుంది. అనంతరం ఆ వార్డులోని వైద్యులు, సిబ్బంది రోగిని పరీక్షించి అవసరమైన సేవలు అందిస్తారు. ప్రస్తుతం గుంటూరు వైద్యశాలలో అవసరమైన 10 ప్రదేశాలలో యాక్సిస్ గేట్లు అమర్చేందుకు ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే జిల్లా పరిపాలనాధికారి కోన శశిధర్, జీజీహెచ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. Add new comment

పోలవరం పై ఏపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటానికి, స్నేహితులు ఇద్దరూ అయిన, కేవీపీ, విజయసాయి, పోలవరం పై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగారు. కేంద్ర సహాయం గురించి కాదండోయి, ఏపి ప్రభుత్వం, అవినీతి చేసిందా, కాంట్రాక్టు ఇచ్చిందా, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు. అయితే వీళ్ళకు దిమ్మ తిరిగే సమాధానం లభించాయి. ఏపి ప్రభుత్వం భేష్ అనే సమాధానం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యతాపరమైన లోపాలేవీ ఇప్పటి వరకు గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక చెలింపులు జరిపినట్టు పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ)తో పాటు కాగ్‌ నివేదిక నిర్ధారించిన విషయం వాస్తవమేనని జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం మంత్రి రాతపూర్వకంగా పైవిధంగా జవాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులను వారి నుంచి తిరిగి రాబట్టాలని కూడా పీపీఏ సూచించిందని మంత్రి తెలిపారు. ఈ అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ, త్వరితగతిన ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయించే హడావుడిలోనే భూ సేకరణ, స్టీల్‌ కొనుగోలుతో పాటు మరికొన్ని పనుల్లో ఆయా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిపిందని చెప్పారు. ఈ మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసినట్లుగా తెలిపారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; పోలవరం హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్ట్‌ను ఏదైనా కంపెనీకి లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వ్యవహరించిందా అన్న మరో ప్రశ్నకు మంత్రి మేఘ్‌వాల్‌ జవాబిస్తూ 2016 సెప్టెంబర్‌ 16న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపట్టినట్లు వివరించారు. కాబట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ కాంట్రాక్టులైనా ఇచ్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా ఒక లక్షా 5 వేల 601 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని, అందులో ఇప్పటి వరకు 3 వేల 922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించడం జరిగిందని మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం, భూసేకరణ, పరిహారం, పునరావాసంపై విడిగా అడిగిన ప్రశ్నలకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం, భూ సేకరణ, పరిహారం, పునరావాసం కోసం రూ. 57,940.86 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు పంపినట్టు తెలిపింది. 2013 నాటి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ, పరిహారం, పునరావాసం అంచనాలు రూపొందించడం వల్లనే ఈ అంచనా వ్యయం భారీగా పెరిగిందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భూ సేకరణకు మొత్తం 1.66 లక్షల ఎకరాలు గుర్తించగా, అందులో 1.10 లక్షల ఎకరాలను ఇప్పటికే సేకరించినట్టు వెల్లడించింది. అలాగే మొత్తం 1,05,601 నిర్వాసిత కుటుంబాలున్నాయని, ఇందులో 3,922 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం పూర్తయిందని తెలిపింది. Add new comment

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరందుకున్నప్పుడు ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిందని, దీంతో ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపించి జీడీపీ వృద్దిరేటు మందగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. తాను పెద్దనోట్ల రద్దును చూడటంతో పాటు అధ్యయనం కూడా చేశానని, పెద్దనోట్ల రద్దుతో వృద్ధిరేటు పై గణనీయమైన ప్రభావం చూపించిందన్నా రు. 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ జోరం దుకుందని, అదే సమయంలో భారత్‌ లో వృద్దిరేటు మందగించిం దని ఆయన ఇంగ్లీషు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దే కాకుండా జీఎస్టి అమల్లోకి తేవడం వల్ల కూడా వృద్ధిరేటు పై ప్రభావం చూపించిందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్దిరేటు 6.7 శాతంగా నమోదైంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే ఆర్‌బీఐ రేటింగ్‌కు భారీ గండి పడుతుందని రఘురాం రాజన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒక వేళ ఆర్‌బీఐ రేటింగ్‌ ‘ఏఏఏ’ నుంచి కిం దికి దిగివస్తే సెంట్రల్‌ బ్యాంకు నిధులు సేకరించడం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీని ప్రభావం ఆర్థికవ్యవస్థపై పడుతుందని ఆయన వివరించారు. ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిల్వలు ప్రభుత్వానికి బదిలీ చేస్తే రేటింగ్‌లో కోత పడుతుందా అని ప్రశ్నించగా.. ఎంత మొత్తం బదిలీ చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతా నికి ఇది పెద్ద అంశం కాదని..అయితే రాబోయే రోజుల్లో ఇదే కీలక అంశంగా మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. మీరు గవర్నర్‌గా ఉన్న ప్పుడు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా.. ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దమొత్తంలో నగదు బదిలీ చేయాలని ఆర్‌బీఐ పై ఒత్తిడి పెంచుతుంటుందన్నారు. తాను ఆర్థిక వ్యవహారాల సలహాదారుడిగా ఉన్నప్పుడు ఆర్‌బీఐకి లేఖ రాసి ఎంత మొత్తం మీరు మిగులు నిల్వలు ఉంచుకోవాలను కుంటున్నారని లేఖలో పేర్కొనేవాడినని, తాను ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒక కమిటిని ఏర్పాలు చేసి..పెద్ద మొత్తంలో మిగులు నిధులు తమ వద్ద ఉంచుకొని మొత్తం లాభాలను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసామని చెప్పారు. మూడు సంవత్సరాల పాటు తాను గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అత్యధిక డివిడెండ్‌ను చెల్లించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం లాభాల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటోందన్నారు. Add new comment

నిన్న తిత్లీ.. నేడు పెథాయ్ తరచు తుపాన్లు ముంచుకొస్తున్నా కేంద్రంలో చలనంలేదు.. మనం చెల్లించే పన్నులతో ఆదాయం వస్తున్నా బాధితులను ఆదుకోవటంలో వివక్ష చూపుతోంది.. ఇకపై ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పెథాయ్ తుపాను నష్టం అంచనాలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా తుపాను నష్టంపై ప్రాథమిక అంచనా, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ అనంతరం సచివాలయంలో సోమవారం రాత్రి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, కేసీఆర్‌ ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానన్నారు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. వైకాపాపై చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; తానేదో తెరాసతో పొత్తు కోసం వెంపర్లాడినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను గతంలోనే తెరాసతో కలిసి వెళదామనుకున్నానని చెప్పారు. తెలుగువాళ్లు కలిసి ఉంటే సమస్యలు జాతీయస్థాయిలో పరిష్కరించుకోవచ్చని భావించానన్నారు. తర్వాత ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా తెరాస మాట్లాడింది, కాంగ్రెస్‌ మద్దతు పలికిందని గుర్తుచేశారు. అందుకే ప్రజాకూటమి కట్టి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదాకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం చెప్పనంత వరకు తానేమీ మాట్లాడలేదని, అడ్డం తిరగటంవల్లే వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు.2014లో అక్కడ పోటీ చేసిన వారు ఇప్పుడు ఎందుకు పోటీ చేయలేదని వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెరాస గెలిచినందుకు ఇక్కడ వీరు సంబరాలు చేసుకుంటున్నారు, డబ్బులు పంపిస్తారని సంతోషపడుతున్నారని విమర్శించారు. భాజపా ఎదురుదాడి తప్ప ఏమీ చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడిన టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఇక్కడి ప్రతిపక్ష వైసీపీ, జనసేన అక్కడ ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో 8 అంశాలపై శ్వేతపత్రాలు ఇచ్చామని, మళ్లీ త్వరలో ఆ అన్ని అంశాలపై ప్రభుత్వం ఏం సాధించిందో శ్వేతపత్రాలు విడుదలచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీర్ఘకాలంలో ఏం సాధించామో, స్వల్ప వ్యవధిలº ఏం సాధించామో, ఇంకా ఏం సాధించాల్సి ఉందో, విభజన హామీల పరిస్థితి తదితర విషయాలన్నీ శ్వేతపత్రాల్లో వివరిస్తామన్నారు. Add new comment

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బ్యాలెట్‌ పత్రాలతోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలు విశ్వసనీయమైనవి కావని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. సోమవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత పెథాయ్‌ తుపానును ఎలా ఎదుర్కొన్నామో వివరించిన ముఖ్యమంత్రి చివర్లో విలేకరులు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశ్నల వర్షం కురిపించగా స్పందించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను ప్రపంచంలో ఎవరూ వినియోగించటంలేదని తెలిపారు. అది చిప్ ఆధారిత మిషన్.. దాన్ని సులభంగా ఏ మార్చే అవకాశం ఉంది.. ప్రజాస్వామ్యం కొంత మంది చేతిల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కేసు 3, 4 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈవీఎంలో డేటా అన్ని రోజులు ఉంటుందా అని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్‌కు వెళుతుంటే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు ఎందుకెళ్లాలని నిలదీశారు. టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా ఈవీఎంల గురించి చెబుతున్నా.. ఈ విధానం ఫలితాన్ని తేలిగ్గా తారుమారు చేసేందుకు వీలయ్యేదని తెలిపారు. పేపర్ బ్యాలెట్ వల్ల నష్టం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పేపర్ బ్యాలెట్‌పైనే నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికలను కూడా ఇదే తరహాలో నిర్వహించేందుకు ఉద్యమిస్తామని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కాదు, ఎన్నికలు ఎక్కడ జరిగినా.. ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకమేనని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్‌కు కమాండ్‌ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. ఓట్లు కొనే ఆస్కారం లేకుండా చేసేందుకే తాను రూ.2,000 నోటు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. భాజపా ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.2,000 నోటు తీసుకువచ్చిందన్నారు. డిజిటల్‌ కరెన్సీ వల్ల ఓట్ల కొనుగోలు అనేది లేకుండా పోతుందని చెప్పారు. Add new comment

భవానీ ఐలాండ్ సరి కొత్త అందాలు అందుకోబోతుంది. ఐలాండ్ లో త్వరలో ఏర్పాటు కానున్న డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించింది. సుమారు రూ.16 కోట్ల వ్యయంతో డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ ను సిద్ధం చేస్తోంది. ద్వీపంలో ఇప్పటికే దీనికి సంబంధించిన కంట్రోల్ రూం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ లేజర్ షోను పర్యాటకులు తిలకించేందుకుగాను కంట్రోల్ రూం పక్కనే గ్యాలరీ ఏర్పాటు చేస్తోంది. లేజర్ షోకు సంబంధించిన సామగ్రి కూడా వచ్చేసింది. ప్రస్తుతం పన్నమి ఘాట్లో ఉన్న ఈ సామగ్రికి ఒక రూపం తీసుకువచ్చి భవానీ ద్వీపంలోకి తర లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డ్యాన్సింగ్ కల్ పాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు. ఇది అత్యంత ఖర్చు కూడుకున్న భారీ ప్రాజెక్టు అయినప్పటికీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా చేపటామన్నారు. కోల్కత్తాకు చెందిన ప్రీమియం వరల్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించిందని వివరించారు. Add new comment

నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటాయంగా నిలుస్తున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిని పొందింది.. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల కంటే వృద్ధి రేటులో దూసుకుపోతున్న గన్నవరం ఎయిర్ పోర్ట్ అతి త్వరలో దక్షిణ, తూర్పు ఆసియా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా విమానాలు నడపటానికి బీజం పడుతోంది... మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి ట్రాఫిక్ పెరుగుతోంది... పర్యాటకుల సంఖ్య పెరిగింది... ఆతిథ్య కేంద్రంగా మారిపోయింది.. ఓ కన్వెన్షన్ సెంటర్ మాదిరిగా విమానాశ్రయ లాంజ్లోనే ఉన్నతాధికారుల కాన్ఫరెన్స్ లు జరుపుకునేంతగా మారిపోయింది... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ నేపథ్యంలో ఇటీవల రూ.148 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించిన నూతన ఇంటీరియమ్ టెర్మినల్ బిల్లింగ్ దేశంలోని ఇతర ప్రాంతాల వారు, భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఇక్కడి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు వీలుగా అంతర్గతంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచనల మేరకు పర్యాటక శాఖ , ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా టెర్మినల్ బిల్లింగ్ అంతర్గతంగా తీర్చిదిదుతున్నారు. అమరావతి ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా బుద్ధుని విగ్రహాన్ని ఉంచారు. పూర్తి స్థాయిలో బౌద్ధ ఛాయాచిత్రాలను తొలగించి కృష్ణాజిల్లా వైభవాన్ని తెలిపేవిధంగా కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నృత్యాలు, కలంకారీ కళలు వంటి సంస్కృతి ఉట్టిపడేలా వాటిని ప్రతిబింబించే కళాఖండాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రుల చరిత్ర... అందులో అమరావతి ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవం తెలిసేలా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అత్యద్భుతమైన కళాఖండాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా, పండుగలు వచ్చినపుడు వాటికి థీమ్‌కు అనుగుణంగా అలంకరణ చేపడుతున్నారు. తాజాగా దీపావళిని పురస్క రించుకుని ఎయిర్‌పో ర్టును విద్యుదీ పాలంకరణతో దేదీప్యమానంగా అలంకరించారు. Add new comment

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసి ప్రగతి పధంలోకి నడిపంచేందుకు తీసుకోంటున్న చర్యలలో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని అన్నారు. సింపుల్ గ్రూప్ ఆఫ్ ఇండియా అధినేత ప్రవాస భారతీయులు పాపారావు ఆధ్వర్యంలో పవిత్రసంగమం వద్ద ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో పర్యాటకుల నదీ విహారయాత్ర నిమిత్తం పడవలపై రిసార్ట్, వాటర్ స్పోర్ట్స్, మెరైన్ ఎక్వేరియం,ఫ్లోటింగ రెస్టారెంట్స్లను ఎం.పి, టూరిజం డైరెక్టర్ శుక్లాతో కలిసి ప్రారంభించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిన పాపారావు జన్మభూమి అభివృద్ధికి కృషి చేయాలని సి.ఎం. చంద్రబాబు పిలుపు మేరకు తిరిగి ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పవిత్ర సంగమం వద్ద రిసార్ట్స్ వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. దీనివలన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దీనితో పాటు అత్యంత ఆధునికమైన ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బోట్ల తయారీ పరిశ్రమని ఎ.కొండూరులో ఏర్పాటు చేయటం వలన ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుందని తెలిపారు. పిల్లలకు సముద్రంలోని జీవరాశుల పై అవగాహన కల్పించేందుకు మెరైన్ ఎక్వేరియం ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, రిసార్ట్స్ అధినేత పాపారావు, ఇతర పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు. Add new comment

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా తాయారు అయ్యింది... అమరావతి రాజధానిగా చెయ్యటం, అంతకు ముందు తాత్కాలికంగా ప్రభుత్వం మొత్తం విజయవాడ నుంచే పరిపాలన చెయ్యటం, సిటీ పెరగటం, ఇలా అన్ని సమస్యలతో ట్రాఫిక్ రద్దీ బాగా ఎక్కువ అయింది.. ఒక పక్క విఐపి మూమెంట్ ఉండటం, మరో పక్క కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉండటం, ట్రాఫిక్ నియంత్రించటంతో కూడా, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు.. ఇటు వైపు గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది.. మరో పక్క, గొల్లపూడి నుంచి, భవానీపురం మీదగా సిటీకి వచ్చే ట్రాఫిక్ కూడా అంతే... ఈ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు బయటకు వెళ్ళాలి అంటేనే హడలి పోతున్నారు...  google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌ రంగంలోకి దిగారు. ప్రధానంగా కనకదుర్గ వారధి దగ్గర నుంచి గన్నవరం విమానశ్రయం వరకు, లారీలు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి రావడంతో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది అని, ఇదే ప్రధాన కారణం అని గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కత్తా, చెన్నై నుంచి కోల్‌కత్తా వెళ్లాలన్నా, రావాలన్నా ఇదే మార్గం గుండా వెళ్లాలి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. విజయవాడ నగరంలోకి అనుమతించకుండా 216వ జాతీయ రాహదారి మీదుగా మళ్లించాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా వద్ద ప్రారంభమయ్యే 216వ నెంబర్ జాతీయ రహదారిని రేపల్లె, పెనుమూడి, పామర్రు, కత్తిపూడి మీదుగా ఐదో నెంబర్ జాతీయ రహదారికి మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే విజయవాడ నగరంలోకి భారీ వాహనాలు, లారీలు రాకుండా 216వ జాతీయ రహదారి మీదుగా మళ్లించనున్నారు. నగరంలోకి లారీలను నిషేధించాలన్న ప్రభుత్వ ఆలోచనతో విజయవాడలో వాహనదారుల కష్టాలు చాలా వరకు తీరినట్లే. Add new comment

విజయవాడ ప్రజలకు మరో కొత్త అనుభూతి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, టూరిజం శాఖల నేతృత్వంలో రెండు బోట్లతో కూడిన బోటింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో, విజయవాడ బందర్ కాలువలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను నిన్న పలువురు ప్రజా ప్రతినిధులు పరరంభించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా, మేయర్, అధికారులు స్పీడ్ బోటులో ట్రయల్ రన్ గా బందరు కాలువలో, బందరు లాకుల వరకు ప్రయాణించారు. కమిషనర్ నివాస్ మాట్లాడుతూ భవిష్యత్ లో అమెరికన్ హాస్పటల్ నుంచి యనమలకుదురు లాకుల వరకు బోటింగ్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మూడు కాలువల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు.. అమరావతి బోటింగ్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బందరు లాకుల వరకు, పిల్లలకు రూ.50, పెద్దలకు రూ. 100 చొప్చున వసూలు చేసే యోచనలో ఉన్నామని, ప్రజలు అలవాటు పడేవరకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చొప్చున వసూలు చేయమని మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారన్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. Add new comment

రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్ట్ అప్ యూనిట్లను ప్రోత్సహించటానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టిపిఐ) విజయవాడలో నిర్మిస్తున్న సైబర్ టవర్ మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. రూ.40 కోట్ల వ్యయంతో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ జి ప్లస్ 6 టవర్ నిర్మాణం ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం ఫినిపింగ్ పనులు జరుగుతు న్నాయి.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కృషా, గుంటూరు జిల్లా ఔత్సహిక యువతకు ఈ టవర్ అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ సైబర్ టవర్ మొత్తం 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ టవర్ గ్రౌండ్ ఫ్లోర్ లో హోస్టింగ్, ఇఎస్పి సేవలు, మొదటి ఫ్లోర్ లో డేటా సెంటర్, రెండవ ఫ్లోర్ లో ఇంక్యుబేషన్ సెంటర్ మూడు, నాలుగు, ఐదు ఫోర్లలో పెద్ద ఐటి కంపెనీలు, ఆరవ ఫ్లోర్ ను ట్రైనింగ్ సెంటర్ గా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రెండవ టవర్ నిర్మించేందుకూ ఎస్టిపిఐ ప్రణాళికలు వేస్తోంది. త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సైబర్ టవర్ను ప్రారంభించబోతున్నారు. ఈ టవర్ అందుబాటులోకి వస్తే దాదాపుగా వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అంచనా. Add new comment

అన్న" ఎన్టిఆర్ " బయోపిక్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన అల్లుడిగా చంద్రబాబు నాయుడి పాత్రను గురించి అందరికీ తెలిసిందే. అలాంటి కీలకమైన పాత్ర కోసం ఎన్టిఆర్ అల్లుడు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను రానా దగ్గుబాటి విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాత్ర కోసం రానా స్లిమ్ గా తయారయ్యారు. రేపు వినాయక చవితి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి రానా ఫస్టులుక్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; రానాని చూస్తుంటే క్లీన్ షేవ్ చేసుకొని - మీసాలు పెంచి బాబును మక్కికి మక్కి దించేసారానే చెప్పాలి. నారా బాబు గా మారిన రానా బాబు అనే ప్రసంసలు అందుకుంటున్నారు.ఈ షూటింగ్ కోసం చంద్రబాబు మేనరిజం.. మాట్లాడే తీరు ఇవన్నీ కాపీ కొట్టేందుకు పాత వీడియోలు కూడా చూస్తున్నాడని అన్నారు. మొత్తానికి రానా మరోసారిఈ పాత్ర సెన్సేషన్ చేస్తారేమో . రీసెంట్ గా రానా నాన్నగారు సురేష్ బాబు మాట్లాడుతూ "పూర్తిగా చంద్రబాబుగా మారిన రానాను" చూసి షాక్ అయ్యాడని చెప్పారు.ఈ ఫోటో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. Add new comment

తెలుగు సినిమా చరిత్ర లో మరో సంచలనం.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ అని ప్రకటించాడో లేదో, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు వర్మ ఆ పాట ఇదే: Add new comment

బాలకృష్ణ హీరోగా, దివంగత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ బయోపిక్‌పై కన్ఫర్మేషన్‌ వచ్చేసింది. ఈ మూవీని రాం గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్నాడు. ఇలా ప్రకటించాడో లేదో... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ‘ఎన్టీఆర్ శత్రువులెవరో, మిత్రులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీ ఏంటో చెబుతా’ అంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు.... ఈ పాట సాగుతుంది. "ఇదే తెలుగు కీర్తి, ఇదే తెలుగు ఖ్యాతి, పొంగించారు మీరే ఈ తెలుగోడి ఛాతీ... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... అన్యాయాన్ని తుంచి, అధర్మాన్ని వంచి, పాలించారు మీరే సదా ప్రేమ పంచి... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీరే జీవితం, మీరే శాశ్వతం, ఇక ఏనాటికైనా మీదే సంతకం... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీదే రాజసం, మీదే సాహసం, తెలుగోడికిచ్చారు పొంగే పౌరుషం. జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్..." అంటూ సాగే పాట ఇప్పుడు శరవేగంగా పాప్యులర్ అయిపోతోంది. పాటలోని లిరిక్స్ క్యాచీగా ఉండటం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా, త్వరలోనే మిగిలిన వివరాలను తెలపనుంది చిత్ర యూనిట్‌. Add new comment

2016 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దక్కించుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారు. కె. విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయస్థాయిలో మార్మోగిందని సంతోషం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి. శంకరాభరణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి మనసుకు హత్తుకునే అపురూప, చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు ఎన్నో తెలుగువారికి అందించారు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజుల్లోనే ఒక తెలుగు సినిమాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత కె. విశ్వనాథ్‌దే అని అన్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; 1957లో సినిమారంగంలో ప్రవేశించి నేటికి కూడా వెండితెరతో అనుబంధాన్ని కొనసాగిస్తూ కె. విశ్వనాథ్ భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు అన్నారు. సినీ ప్రపంచంలో అడుగుపెట్టే భావితరాలకు కె. విశ్వనాథ్ స్ఫూర్తిగా, మార్గదర్శిగా నిలుస్తారు అని ముఖ్యమంత్రి అన్నారు. Add new comment

కోట్లాది అభిమానుల ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘అజహర్‌’, ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ల తర్వాత భారత క్రికెటర్‌ జీవితం ఆధారంగా రూపొందించిన మూడో చిత్రమిది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; అయితే టీజర్‌లో, 1.12 సెకండ్స్ దగ్గర, 2014లో, సచిన్ PVP మాల్ ఓపెనింగ్ కి, విజయవాడ వచ్చినప్పుడు, బందర్ రోడ్డు పై అభిమానుల కోలాహలం, వారికి సచిన్ అభివాదం చెయ్యటం, ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ వీడియోలో 1.12 సెకండ్స్ దగ్గర, మీరు చూడండి Add new comment

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారంనాడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; సాధారణంగా తెలుగు సినిమా ట్రైలర్‌ మహా అయితే నిమిషం, ఒకటిన్నర నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ, ‘బాహుబలి:ది కంక్లూజన్‌’ ట్రైలర్‌ను మాత్రం హాలీవుడ్‌ సినిమాల తరహాలో రెండు నిమిషాల 20 సెకెన్ల పాటు ఉండేలా కట్‌ చేశారు. Add new comment

ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న విజయవాడలో చారిత్రాత్మిక కలిగిన ఆలయంలో ఒకటి మొగల్రాజపురం ధనకొండ, దుర్గా భవాని ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు... ఇంద్రకీలాద్రి పై అమ్మ కొలువు తీరడానికి ముందు, ఇంకోచోట వెలసిందని భక్తుల నమ్మకం. "దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికొచ్చింది రా " అనే గీతం ప్రకారం కూడా దుర్గా అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన వెలిసింది అంటారు.. ఈ విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండ పై వెలసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మ వారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటారు... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంత మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా మహిమగలదని భక్తుల నమ్మకం.... మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీకచ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. ఇది నిజమేనంటూ ఇప్పటికీ అంతరాలయంలో పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మరావతి విగ్రహ రూపం కనపడదు... అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీ చక్ర రూపం ఉంటుంది... స్థానికుల కధనం ప్రకారం దశాబ్దాలక్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. ఆమ్మ కరుణతో కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందిట. గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆ పై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది. భక్తులు పైనపొంగళ్లు చేసుకొవడానికి షెడ్‌, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈక్షేత్రానికి వెళ్లాలంటే మొగల్రాజపురం బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్ల వచ్చు. Add new comment

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉన్న కృష్ణా నదిలో దుబాయ్ లోని హోటల్ క్రూయిజ్ తరహాలో ఒక అందమైన భారీ క్రూయిజ్ హోటల్ అధునాతన వసతులతో ఏర్పాటవుతుంది. సీతానగరం వైపున ఇసుక ర్యంపు దగ్గర ఈ భారీ క్రూయిజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అత్యంత భారీగా రెండు అంతస్తులగా ఈ బోటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దీని పొడవు దాదాపు 126 మీటర్లు ఉంటుంది, వెడల్పు 40 మీటర్ల ఉంటుంది. ఈ భారీ క్రూయిజ్ నిర్మాణానికి రూ.2 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో దాదాపు 360 మంది యాత్రికులు ఒకే సారి ఉండటానికి అవకాశం ఉంది. దీని లోపల భాగంలో అధునాతన వసతులతో రెస్టారంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో యాత్రికులు కోరిన విధంగా భోజనాలు, కోరిన రుచులతో ఆస్వాదించవచ్చు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. పెళ్లిళ్లకు, హనీమూస్ జరుపుకునే జంటలకు వివిధ రకాల పంక్షన్లకు ఈ క్రూయిజ్ అద్దెకు ఇస్తారు. భవాని ద్వీపం, ఇంద్రకీలాద్రి, నడుమ కృష్ణానది నీటి పై ఈ క్రూయిజీసు లంగరు వేసి ఉంచుతారు. భవాని ఐలాండ్, శాండ్ ఐలాండ్, ఫారెస్ట్ ఐలాండ్స్, వంటి ఎన్నో సహజ సుందరమైన దీవులను కలిగి ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాదారణ బోట్ల మాత్రమే తిరిగేవి. రాష్ట్రంలో టీడీపి ఆధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఆధునిక క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటకానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎతున పెట్టబడులు వస్తున్నాయి. రాజధాని పరిధిలో ఎన్నో బడా టూరిజం ప్రాజెక్టులను తెచ్చేందుకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ముందుకు వచ్చింది. తొలిదశలో భాగంగా సగానికి పైగా పనులు పూర్తి చేసింది. మిగిలిన పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, స్కై ఛాపర్స్ సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్ట్లు మొదలుపెట్టాయి. Add new comment

ఇది నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో ఉన్న ఓ అద్భుత లోకం.... అక్కడ అడుగుపెడితే అదో కొత్త బంగారు లోకం... విజయావాడ అంటే కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి, రెండు పార్కులు మాత్రమే తెలిసిన నగరవాసులకి, ఈ ప్రదేశానికి వెళ్తే, ఇన్నేళ్ళు ఇక్కడకు ఎందుకు వెళ్ళ లేదా అనిపిస్తుంది... పచ్చని చెట్ల మొక్కల మధ్య నుంచి సీతాకోకచిలుకలు వచ్చి స్వాగతం పలుకుతాయి... ఒక్కటీ రెండూ కాదండి వేలల్లో.. అడుగులు ముందుకు పడుతుంటే మనతో పాటే కదులుతాయి... మనతో మమేకం అయిపోతాయి, మనల్ని ముద్దాడుతాయి.. మొన్నటి వరకు ఎక్కడెక్కడికో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన విజయవాడ వాసులు ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు. సొంత ప్రాంతంలో సరి కొత్త అనుభూతులను పొందుతున్నారు. ప్రకృతి కొత్త అందాలతో మురిసిపోతోంది విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న మూలపాడు. సీతాకోక సంపద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను కమ్మేసుకుంది. ఒకపక్క సెలయేళ్ల నీటి గలగలలు... అటూ ఇటూ కొండలు... మధ్యలో ప్రకృతి పచ్చని కోక కట్టినటుగా కనిపించే అరణ్యం.. మరో పక్క చల్లని గాలులకు, ఇంద్రధనస్సును తలిపిస్తూ, రంగురంగుల సీతాకోక చిలుకలు నాట్యం... వాః అద్భతం కదూ... కాంక్రీట్ జంగల్ గా మారిన విజయవాడ వాసులకి, ఇక్కడ అందమైన సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; మూలపాడు, దొనబండ ప్రాంతాల్లో వేలు, లక్షల సంఖ్యలో రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కలు విప్పతాయి. దాదాపు 30 రకాల సీతాకోకచిలుకలు, జూన్, జూలై, ఆగష్టు నెలల్లో అడవి మొత్తాన్ని ఆక్రమించి కొత్త అందాలు తీసుకొస్తాయి. సీతాకోక చిలుకలను దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించాలి. వాటిని పటుకోవడానికి ప్రయత్నించడం, పరుగులు తీసూ వాటి స్వేచ్చకు భంగం కలిగించకూడదని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అక్కడకు ఎలా వెళ్ళాలి ?విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై (విజయవాడకు 20 కిలోమీటర్ల దూరం) మూలపాడు గ్రామం ఉంది. ఆక్కడి నుంచి కుడి వైపకు 3 కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ ఆటవీ ప్రాంతం మొదలవుతుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల దూరంలో సమాంతరమైన ఆటవీ ప్రాంతంలో అభయాంజనేయస్వామి ఆలయం, దొంగమర్ల బావి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే రంగు రంగుల సీతాకోకచిలుకలు సందడి చేస్తాయి. ప్రభుత్వం ఇలాంటి అందమైన పర్యాటక కేంద్రాన్ని మరింతగా ప్రాచుర్యం కలిగించి, మంచి పర్యటక కేంద్రంగా, సీతాకోకచిలుకల మనుగడకు ఇబ్బంది లేకుండా మరింత అభివృద్ధి చెయ్యాలి... Add new comment

సముద్రంలో రయ్మంటూ దూసుకుపోవాలనుందా? కెరటాల పై కేరింతలు కొడుతూ షికారు చేయాలనుందా? అయితే వైజాగ్ పదండి. త్వరలోనే ఆ కోరిక తీరుతుంది. దేశంలోనే తొలిసారిగా మన విశాఖ బీచ్ లో అలాంటి వారి సరదాలు తీర్చేందుకు హోవర్ క్రాఫ్ట్ వస్తోంది. ఇన్నాళూ, ఇంగ్లండ్ అమెరికా వంటి దేశాల్లోనే ఉన్న ఈ హోవర్ క్రాఫ్ట్ ఇప్పడు మనకూ రాబోతోంది. అక్షర ఎంటర్ప్రెజెస్ సంస్థ దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టబోతోంది. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.8 కోట్ల ఇందుకు నేవీ, కోస్ట్ గార్డ్ , విశాఖపోర్టు, జీవీఎంసీ, వుడా, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు, ఎన్ఐఓ వంటి అన్ని అనుమతులను తెచ్చుకుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఇందుకోసం బ్రిటన్ నుంచి ఒక్కొక్కటి రూ.1.80 కోట్ల వెచ్చించి రెండు హోవర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసింది. తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉండే ఈ క్రాఫ్ట్ లో పైలట్ (డైవర్), ఒక సహాయకుడితో పాటు మరో ఏడుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఆర్కే బీచ్ సమీపంలో ఒక పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నుంచి పార్క్ హోటల్ వరకు, తొట్లకొండ పాయింట్ నుంచి ఆ పరిసరాల్లోనూ 20 నుంచి 25 నిమిషాల పాటు సముద్ర ఒడ్డు నుంచి 500 మీటర్ల దూరం వరకు వీటిని తిప్పనున్నారు. ఈ హోవర్ క్రాఫ్ట్ లో షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.300 టికెటుగా నిర్ణయించాలని యోచిస్తున్నారు. భద్రత కోసం ఒడ్డున సేఫ్టే బోట్లను కూడా సిద్దంగా ఉంచుతారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ హోవర్ క్రాఫ్ట్ లు నడపడానికి అవసరమైన అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. Add new comment

ఏ నగరాన్నయినా రోడ్ల మీద తిరుగుతూ చూడటం కన్నా విహంగ వీక్షణంలో చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది... అలాంటి అనుభూతి స్వయంగా పొందకపోయినా, ఈ వీడియో చూడండి, బెజవాడ ఎంత అందంగా ఉందో... హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ, నగర అందాలు కెమెరాలో రికార్డు చేశారు...హెలికాప్టర్ నుంచి ఈ సీన్ చూస్తుంటే, ఆస్వాదించే మనసుండాలేగాని బెజవాడలో ప్రతి ప్రాంతం సోయగాల బృందావనమే... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఆకాశం నుంచి బెజవాడ ఎంత అందంగా ఉందో చూడండి... కృష్ణా తీరం, పచ్చని కొండలు, నగరంలో నుంచి ప్రవహించే కాలువలు, కృష్ణా నదిలో ద్వీపాలు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, లయలా కాలేజి, సిద్ధర్దా కాలేజీ, స్టేడియం, ఇలా విజయవాడ నగర విహంగ వీక్షణం అద్భుతం... Add new comment

విశాఖ నగరంలో రుషికొండ సాగర తీరంలో రూ.300 కోట్ల వ్యయంతో ఓషనేరియం ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ఈ ప్రాజెక్టుకు రుషికొండ వెనక భాగంలో సాగరతీరానికి ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. గత జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆనందా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఈ క్రమంలో సాంకేతిక సర్వే నిర్వహించడానికి మే మొదటి వారంలో జర్మనీ, చైనా దేశాలకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఓషనేరియం ఏర్పాటుకు నిర్దేశించిన ప్రాంతాన్ని సందర్శించనుంది. ఏమిటి ఈ ఓషనేరియంసింపుల్ గా చెప్పాలి అంటే, సముద్రంలో ఉండే ఆక్వేరియం లాంటిది... మనం మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్తుంటే, అద్దంలో సముద్రపు జీవరాశులుని చూస్తూ, ఎంజాయ్ చెయ్యవచ్చు... ఈ ప్రాజెక్ట్ పర్యటకంగా విశాఖకు ఎంతో మేలు చేయ్యనుంది. Add new comment

విద్యార్ధులు బస్ పాస్ పొందాలంటే, అదో ప్రహసనం. ఓ రోజంతా సమయం వృధా, సవాలక్ష ఆంక్షలు, నిబంధనలు, అన్నీ ముగించుకుని బస్తాండ్ కు వెల్తే గంటల కొద్ది క్యూ. ఆ రోజంతా స్కూల్/కాలేజీకి సెలవు. ఇలా లెక్కలేనన్ని ఇబ్దందులతో బస్ పాస్ పొందాల్సి ఉంటుంది. విద్యారుల అవస్థలను అర్థం చేసుకున్న ఆర్టీసీ సరికొత్త ఆన్లైన్ బస్ పాస్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బస్ పాస్ దరఖాస్తు చేసుకోవడం, దానిని పొందడం కూడా ఈజీనే. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; www.apsrtcpass.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే, పదో తరగతి వరకూ విద్యార్ధులకి, పడవ తరగతి పై బడిన విద్యార్ధులకి వేరు వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేసిన తరువాత, కొత్త పాస్ కోసం రిజిస్టర్ చెయ్యలా ? లేదా పాస్ రెన్యువల్ చేసుకుంటారా అని అడుగుతుంది. విద్యార్థి పూర్తి పేరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, సెల్ ఫోన్ నెంబర్, ఈ-మెల్ అడ్రస్, విద్యార్థి ఫోటో, జిల్లా, మండలం, గ్రామం, ఇంటి నంబరు, ఊరిపేరు తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరచాలి. పూర్తి వివరాలకు, ఈ వెబ్సైట్ కి వెళ్లి చూడండి www.apsrtcpass.in Add new comment

ఏడాదికి ఎకరాకు 12 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ప్రకృతి వ్యవసాయంలోనే ఉందని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో సుభాష్ పాలేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక, సేంద్రియ వ్యవసాయాలకు కాలం చెల్లిందని, ఆ పద్ధతుల వలన రైతులకు నష్టం కలుగుతుందని వినియోగదారులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రైతుల భూములలో భూసారం తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయి అప్పులు పెరిగి వ్యవసాయం మానేసి గ్రామాల నుండి పట్టణాలకు వలసపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా యువతకు సేద్యం అంటే తెలియని పరిస్థితి వచ్చిందని, ఉన్న ఆస్తులను తెగనమ్ముకుని పట్టణాలకు వలస వెళుతున్నారని అన్నారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు లాభాల పంట పండించేందుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని సుభాష్ పాలేకర్ అన్నారు. ద్రాక్ష, స్టాబెర్రీ, యాపిల్, దాల్చిన చెక్క, మిరియాలు వంటి పంటలను ఆంధ్రప్రదేశ్ భూముల్లో కూడా పండించవచ్చని ఆయన అన్నారు. ఎకరాకు 6 లక్షలు నుండి 12 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఒక్క ప్రకృతి వ్యవసాయానికే ఉందని అన్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను అందిస్తే ఎంతో లాభం గడించవచ్చని అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పాలసీలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన అన్నారు. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉందంటూ ఈ విషయం ఇప్పటివరకు కాకినాడ, తిరుపతి పట్టణాలలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు. మరికొంత మంది రైతులకు వచ్చే జనవరిలో హైదరాబాదులో శిక్షణ కార్యక్రమాలు కల్పించి అవగాహన కల్పిస్తామన్నారు. త మిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఎకరాకు 80 క్వింటాళ్లు పండించిన ఘనత అక్కడి రైతులదన్నారు. వారు రసాయనిక ఎరువులు, ఆర్గానిక్ ఎరువులు వినియోగించలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశ జనాభా 123 కోట్లు ఉందని, భవిష్యత్తులో 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లు పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఎటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలో వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఆలోచించాలన్నారు. అయితే ఇప్పటికి దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అదిక ఉత్పత్తులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధిపతులు అంటున్నారని ఆయన అన్నారు. Add new comment

దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఒక మూలస్థంభాన్ని కోల్పోయిందన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లిన దాసరి పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచారని చెప్పారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; నాతో చాలా ఆత్మీయంగా మాట్లాడేవారని, ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవించేవారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రెండు నెలల క్రితం, హాస్పిటల్ లో చికిత్స జరుగుతున్నప్పుడు వెళ్లి కలిసానని, గుర్తుచేసుకున్నారు. దర్శక రత్న దాసరి నారాయణరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. Add new comment

ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తర్వాత మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాత్రి 7 గంటలకు ఆయన గుండె పనిచేయడం మానేసిందని, దాన్ని పునరుద్ధరించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని కిమ్స్ వైద్యులు చెప్పారు. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన బులెటిన్‌ను బుధవారం విడుదల చేయగలమని అన్నారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత మాత్రమే బయటకు విడుదల చేయగలమని తెలిపారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు. Add new comment

సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రేచల్‌ చటర్జీ నేతృత్వంలో సివిల్స్‌ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. సీనియర్‌ ఐఏఎస్గా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరొందిన ఆమె.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. టాపర్స్‌ అకాడమీలో ప్రముఖ విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌టీఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సివిల్స్‌లో విజయం సాధించడానికి పరీక్ష విధానానికి అనుగుణంగా అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించి... వారి ప్రతిభను వెలుగులోకి తెస్తారు. ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్‌ అందజేస్తోంది. ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణనిచ్చే కార్యక్రమ నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.ఈ పథకం కింద ఉచిత కోచింగ్‌తో పాటు, నెలవారీ స్టైఫండ్ అందిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు అర్హులు. ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 3850 మందిని ఎంపిక చేసి దేశవ్యాప్తంగా నిర్దేశించిన 15 కోచింగ్ సెంటర్లలో 9 నెలల పాటుశిక్షణ ఇస్తారు. సీట్ల సంఖ్యఎస్సీ – 700ఎస్టీ – 300బీసీ – 1000కాపు – 750మైనారీటీ – 300బ్రాహ్మణ – 50ఈబీసీ – 750మొత్తం – 3850 google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; వయోపరిమితి: ఆగస్టు 1, 2018 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.కాపు, బ్రాహ్మణ, మైనారిటీ అభ్యర్థుల వయస్సు 32, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీలకు 37, VH/HH/OH అభ్యర్థులకు 42 సంవత్సరాల లోపు ఉండాలి.విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. (కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయానికి డిగ్రీ పాస్ సర్టిఫికేట్ పొందాలి)ఆదాయ పరిమితి: కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 6 లక్షలు మించరాదు.గమనిక: రెండోసారి ఉచిత శిక్షణకు అవకాశం లేదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ద్వారాపవేశ పరీక్ష ఫీజు: ఉచితంపరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాలుసిలబస్: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ ప్రకారం ప్రవేశ పరీక్ష ఉంటుంది.స్టైఫండ్: ప్రతి నెల అభ్యర్థికి స్టైఫండ్ ఇస్తారు. నిర్దేశించిన కోచింగ్ సంస్థలుAlternative Learning Systems, DelhiSri Ram IAS, DelhiAnalog IAS, Hyderabad, Guntur, BangaloreBraintree, HyderabadDr.Lakshmaiah IAS Study Circle, HyderabadKrishna Pradeep 21st Century, Hyderabad & VisakhapatnamLA Excellence, HyderabadRC Reddy IAS Study Circle HyderabadToppers IAS Academy, HyderabadVarsity Management, HyderabadShankar IAS Academy, ChennaiUniversal Coaching Center, Bangalore ముఖ్యమైన తేదీలు:ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 25, 2017దరఖాస్తుకు చివరి తేది: జూన్ 14, 2017హాల్ టికెట్ డౌన్‌లోడ్: జూన్ 15-19 వరకుపరీక్ష తేది: జూన్ 20, 2017 పూర్తి వివరాలకు..http://www.kapucorp.ap.gov.in/documents/Detailed%20Notification.docx Add new comment

ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో, మొదటి అడుగు పడింది, జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ తో.. తరువాత కియా మోటార్స్, హీరో మోటార్స్, అపోలో టైర్స్ ఇలా దిగ్గజ కంపెనీలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి, ముందుకు వచ్చాయి... జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో 107 ఎకరాల విస్తీర్ణంలో రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఇసుజు మోటార్స్ ప్లాంట్ 2016లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రొడక్షన్ ప్రారంభించిన కంపనీ, ఏడు సీట్లతో కూడిన ఎస్‌యువి ఎంయు-ఎక్స్‌ అనే మోడల్ చారు ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసి, మే 2017లో దేశీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభించనుంది. అత్యంత ఆధునిక పరిజ్ఞానం, రోబోటిక్‌ సహాయంతో ఈ పరిశ్రమలో వాహనాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీసిటీ ప్లాంట్‌ సామర్థ్యం ఏటా 50 వేల యూనిట్లుండగా దీన్ని 1.2 లక్షల యూనిట్లకు పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; భారత నుంచి 15-20 దేశాలకు ఇసుజు వాహనాలను ఎగుమతి చేయాలని ఇసుజు మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నుంచి ఇప్పటికే నేపాల్‌కు ఎగుమతులను ఇసుజు ఇండియా ప్రారంభించింది. ఈ వీడియో చూడండి, శ్రీసిటీలోని 107 ఎకరాల ఇసుజు ప్లాంట్, కార్లు ఎలా తయారు చేస్తుందో... ఇది మేడ్ ఇన్ ఆంధ్రా కార్... ఆ సౌండ్ ఇంటుంటే, వచ్చే ఫీలింగే వేరు కదా... Add new comment

ఉచిత వైద్య సహాయమును రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షలకు పెంపు వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు రూ. 6 లక్షల వరకు చికిత్స మూత్రపిండ మార్పిడి చికిత్స ఆపరేషన్ కు రూ. 3.5 లక్షలు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్సకు వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత వైద్యం రాష్ట్రంలోని 421 ఆసుపత్రుల్లో చికిత్స 944 చికిత్సలతోపాటు అదనంగా వంద చికిత్సలు మొత్తము 1044 చికిత్సలకు ఉచితంగా వైద్య చికిత్స ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ‘అందరికీ ఆరోగ్యం’ పేరుతో రూపొందించిన ఈ పథకానికి పేద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కాయకష్టం చేసుకుంటే కానీ పూటగడవని నిరుపేదలకు ఈ పథకం వరంలా మారింది. అనుకోకుండా జబ్బుల బారిన పడి.. వైద్య పరీక్షలకు, ఆపరేషన్లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయలేని పేదలంతా ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్నే ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న జబ్బుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో వైద్యం అందుతుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక.. 2014 జూన్ 2 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రారంభించారు. రాష్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కోటీ 30 లక్షలకు పైగా కుటుంబాలను ఈ పథకంలో చేర్చారు. 29 విభాగాలకు చెందిన 1044 వ్యాధులకు సంబంధించి రెండున్నర లక్షల రూపాయల విలువైన వైద్య పరీక్షలు, ఆపరేషన్లను ఈ పథకంలో నిర్వహిస్తారు. ఈ పథకం కింద కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ వైద్యం చేయించుకునే అవకాశం ఉండటం పేద ప్రజలకు సౌకర్యంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 73 ప్రభుత్వ హాస్పిటళ్లనే కాకుండా.. 338 ప్రైవేటు హాస్పిటళ్లను ఈ పథకంలో చేర్చి.. పేదలకు వైద్యం అందేలా చేస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగ్గా వైద్యం చేయరన్న భయంతో ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి.. ఉన్నదంతా అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోందని బాధపడే పేదలు కూడా.. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వైపు చూస్తున్నారు. దీంతో క్రమేపీ ఈ పథకం కింద వైద్యం చేయించుకునే రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, నాణ్యమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయించారు. రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను కూడా ఆధునీకరించేలా చర్యలు తీసుకున్నారు. ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు, వైద్య సేవల విస్తృతి, మందుల కోసం నిధుల పెంపు, హాస్పిటళ్లలో పారిశుధ్యం మెరుగుకు చర్యలతో.. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటళ్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ను తలదన్నేలా తయారయ్యాయి. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ముఖ్యంగా నిరుపేదలకు ఈ పథకం సంజీవినీగా మారుతోంది. ఎలాంటి ఖర్చు లేకుండా... అన్ని విధాలుగా ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు కార్డులతో వైద్యం అందిస్తోంది. జూన్ 2, 2014 నుంచి ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నారు. ఇంతకు మునుపు ఉన్న 944 చికిత్సలకు అదనముగా 100 చికిత్సలను చేర్చి, మొత్తము 1044 చికిత్సలకు అనుమతి పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచితముగా వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి ఒక కుటుంబానికి ప్రభుత్వం వారు ఇంతకు మునుపు ఇస్తున్న ఉచిత వైద్య సహాయాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు చేయు కాక్లియార్ ఇంప్లాంటేషన్ కు రూ. 6 లక్షల వరకు మరియు మూత్ర పిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ. 3.5 లక్షల వరకు ఈ పథకం కింద లబ్దిపొందవచ్చు. గుండె , ఊపిరి తిత్తులు మరియు గుండె - ఊపిరి తిత్తులు మార్పిడి చికిత్స కూడా ఈ పథకంలో చేర్చారు. దీని ద్వారా నిరుపేదలకు ఇలాంటి జబ్బులు వచ్చినప్పుడు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం వారికి వైద్య సహకారాన్ని అందిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ఇప్పటివరకు అవుట్ పేషంట్ల సంఖ్య 13,06,773... అలాగే ఇప్పటివరకు ఇన్ పేషంట్ల సంఖ్య 14,28,813... ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద 02-06-2014 నుండి ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకున్నవారు 8,64,517. వారి చికిత్స కోసం అయిన మొత్తం రూ. 2528.079 కోట్లు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 12,78,583. ఆపరేషన్ల కోసం ఖర్చయిన మొత్తం రూ. 3728.997 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపుల కోసం వచ్చిన క్లెయిమ్ లు 11,87,309 గా ఉన్నాయి. క్లెయిమ్ ల కోసం చెల్లించిన మొత్తం రూ. 3138.245 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి 133 వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకే కేటాయించడమైనది. 133 వైద్య సేవలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన 911 (1044-133=911) వైద్య సేవల సంఖ్య 3,05,357 గా ఉంది, ఈ వైద్య సేవలకు వెచ్చించిన ఖర్చు రూ. 801.524 కోట్లకు చేరుకొంది. ఇక 133 వైద్య సేవలకు సంబంధించి ముందుగా అనుమతి తీసుకున్నవారి సంఖ్య 48,560గా ఉన్నాయి, ఈ సేవల కోసం వెచ్చించిన మొత్తం రూ. 137.306 కోట్ల మేర చెల్లించారు. 133 వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 103 గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిరుపేదల తమ జీవన సౌధాన్ని పునర్నిర్మించుకుంటున్నారు. లక్షల రూపాయలు వైద్యం కింద చెల్లించడం తమ వల్లే అయ్యేది కాదని... రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ విధంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో తమ జీవితాలకు భరోసా వచ్చిందని వారు భావిస్తున్నారు. చికత్స తీసుకున్న ప్రతి పేషెంట్ వివరాలు, అయన ఖర్చు, సమయం, హాస్పిటల్ పేరు ఇలా అన్నీ కోర్ డ్యాష్ బోర్డులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి... ప్రతి పైసాకి పూర్తి జవాబుదారీతనం ఉంటుంది.. http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/HealthFamilyWelfare/NTRVaidhyasevaMainReport.aspx Add new comment

సమాజంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పధంలో నడిపిస్తూ, అందరికీ సరైన గౌరవం ఇస్తూ, అన్ని రకాల పధకాలతో, ఆర్ధికంగా, సామజీకంగా ఆడుకుంటున్న చంద్రబాబు, ముస్లిం సోదరులను కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు... చంద్రన్న రంజాన్ తోఫా:పేద ముస్లింలు కూడా రంజాన్ పండుగను సంతోషంగా చేసుకోవాలన్న ఆకాంక్షతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రన్న రంజాన్ తోఫాను 11.3 లక్షల కుటుంబాలకు అందించింది. చంద్రన్న రంజాన్ తోఫా కోసం ప్రభుత్వం రూ. 65.36 కోట్ల విడుదల చేసింది. క్కో కార్డుదారునికి ఐదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యితో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌ను రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఇమామ్లకు, మౌజన్లకు పారితోషికం:రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 2017-18 బడ్జెట్లో రూ. 840.25 కోట్ల కేటాయించింది. పేదరికంలో మగ్గుతున్న 5000 మసీదులలోని ఇమామ్లకు, మౌజన్లను పారితోషికం కింద గత ఏడాది రూ.24 కోట్ల కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్లో రూ.32 కోట్లు కేటాయించారు. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; దుల్షన్ పథకం:ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ముస్లిం, మైనార్టీ కుటుంబాల యువతులకు దుల్షన్‌ పథకం ద్వారా రూ.50వేలు అమ్మాయి పేరిట బ్యాంకు ఖాతాలో వేస్తారు. దుల్షన్ పథకం కింద గత ఏడాది రూ.49.11 కోట్ల కేటాయిస్తే, 9,822 మంది లబ్దిపొందితే, ఈ ఏడాది రూ. 60 కోట్ల కేటాయింరు, దీంతో 12,000 మంది ముస్లిం వధువులు లబ్దిపొందుతారు. రోష్ని పథకం:మైనార్టీ వితంతువులు, భర్త నుంచి విడాకులు పొందిన మహిళలు, అంగవైకల్య మహిళలకు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 75 శాతం సబ్సిడీతో రూ.25 వేలు ఆర్థిక సాయం ఆదరణ పథకం:చిరు వ్యాపారులకు యూనిట్‌కు రూ.25వేలు సబ్సిడీ, ఆదరణ పథకం ద్వారా రూ.10వేలు నుంచి రూ.25 వేలు వరకూ ఆర్థిక సాయం. నిరుద్యోగ యువతకు సబ్సిడి ద్వారా రుణ సాయం: మైనారిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్:అలాగే 2016-17లో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 203.45 కోట్ల, మెయింటెనెన్స్ ఫీజు కింద రూ. 44.69 కోట్ల ఇస్తే, 1,08,322 మంది విద్యార్థులు లబ్ది పొందారు. 2017-18లో ఫీజు రీయింబర్స్మెంట్ కు రూ. రూ.225.00 కోట్ల, మెయింటెన్స్ ఫీజు కింద రూ. 60 కోట్ల కేటాయించారు. దుకాన్‌-మకాన్‌ పథకం:మైనార్టీల సంక్షేమానికి రూ.379 కోట్లు కేటాయుంచిన ప్రభుత్వం, ‘దుకాన్‌-మకాన్‌’ పథకం కింద యూనిట్‌ విలువలో 50 శాతం గరిష్ఠంగా రూ.లక్ష దాకా సబ్సిడీ ఇస్తుంది. మసీదుల కోసం:2016-17లో 57 మసీదులకు 6.99 కోట్ల ఆర్థిక సహాయం అందజేశారు. మైనారిటీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం:ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని 300 మంది ముస్లిం విద్యార్థులకు వర్తింపజేస్తే, మైనారిటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవటానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 10 లక్షల సహాయం అందచేసారు. హజ్ హౌస్:కడప లో హజ్ హౌస్ నిర్మాణానికి 12 కోట్ల, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి రూ 11 కోట్ల కేటాయించారు. ఉర్దూ భాషాభివృద్ధికి:ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయింపు మక్కా యాత్రకు:ముస్లిం సోదరులకు పవిత్ర మక్కా యాత్రకు ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2,810మంది హజ్‌ యాత్రకు. ముస్లింలకు శాసనమండలి చైర్మన్‌ పదవి:శాసనమండలి ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూఖ్‌ మండలి చైర్మన్ గా:ముస్లిం సమాజ అభివృద్ధి ముస్లింల పట్ల విశ్వాసాన్ని చూపుతూ, ఎం ఎల్ సి గా ఫరూక్ గారికి, ఉర్దూ అకాడమీ చైర్మెన్ నోమాన్ గారికి పదవులు ఇచ్చి, మండలి చైర్మన్ పదవి కూడా ముస్లింలకు ఇచ్చి, ముస్లిం సోదరుల నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ మరోమారు చంద్రబాబు తాను ముస్లిం పక్షపాతిని అని నిరూపించుకున్నారు. ఇలా అన్ని రకాలుగా, రాష్ట్రంలోని ముస్లిం సోదరులను, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుని, అండగా ఉంటుంది... Add new comment

రాష్ట్రంలో బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోంది. బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా, ఉన్నత స్థాయికి ఎదిగేలా పధకాలు ప్రవేశపెట్టారు. అంతే కాదు, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో, మంత్రివర్గంలో అత్యధికంగా 8 మంది బీసీలకు చోటు కల్పించారు చంద్రబాబు. తమ పార్టీకి వెన్నుముక బీసీలు మాత్రమే అని చెప్పే చంద్రబాబు, అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే బీసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్ షిప్ లు, ఫీజ్ రీఇంబర్స్మెంట్ పథకాలతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం బీసీ సామాజికవర్గాల నుంచి విదేశీ విద్య చదువుకునేందుకు కావాల్సి నిధులను సైతం అందిస్తోంది. బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు అందిస్తున్న పథకాల వివరాలు ఇవి... google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; బీసీ సబ్ ప్లాన్:దేశ చరిత్రలో తొలిసారిగా బిసిల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఇందుకు రూ. 10,000 కోట్లు కేటయించింది. గత ఏడాది కంటే ఇది 13.22% ఎక్కువ. బీసీ ఫెడరేషన్ లోన్స్:కుల వృత్తులవారికి, చేతివృత్తులవారికి బి.సి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు. బీసీ ఫెడరేషన్ ద్వారా ఐదుగురు సభ్యులున్న బృందానికి రూ.10 లక్షల వంతున యూనిట్ స్థాపనకు ఇవ్వనున్నారు. చంద్రన్న పెళ్లి కానుక:బీసీల కోసం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించిన చంద్రబాబు, దీని ద్వారా బీసీ జంటలకు రూ.30 వేలు పెళ్లి ఖర్చుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆదరణ పధకం:బిసిల్లో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ కులవృత్తిని ప్రోత్సహించేందుకు ‘ఆదరణ’ పధకం. కులవృత్తుల చేతివృత్తి పనివారి ఆదాయాన్ని పెంచేలా పని ముట్లను కొనుగోలు చేసుకొనుటకు ఆదరణ పధకం క్రింద ఆర్థిక సహాయం. బీసీ విద్యార్ధులకు ఫీజు రీఇంబర్స్ మెంట్:10 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌లు చెల్లించారు. 2017-18లో 8,80,000 మంది బిసి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటిదాకా (28.8.17 వరకు) 6,77,976 మంది విద్యార్ధులు నమోదు చేయించుకున్నారు. బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ రూ.274.50 కోట్లు కేటాయించగా, రూ.137.25 కోట్లను రెండు విడతలుగా విడుదల చేశారు. మొత్తం 4,84,714 మంది బిసి విద్యార్ధులు లబ్ది పొందారు. పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద 3,77,510 మంది విద్యార్ధులు లబ్ది పొందారు. ట్యూషన్ ఫీజు రీఇంబర్స్ ‌మెంట్ కింద రూ.1042 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, రూ.521 కోట్లు విడుదల చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం:2016-17 బిసి ఉప ప్రణాళికలో 500 మంది బీసీ విద్యార్ధులకు ‘ఎన్టీఆర్ విదేశీ విద్యార్జన పథకం’ అమలు. ఇందుకోసం రూ.69.11 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం క్రింద బీసీ విద్యార్ధులు విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రతి విద్యార్థికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేస్తుంది ప్రభుత్వం స్కిల్‌ డవలప్‌ మెంట్‌ :విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యం పై శిక్షణ ఉండాలని స్కిల్‌ డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీ భవన్‌:ప్రతీ జిల్లాలో ఎకరం స్థలంలో రూ.5 కోట్లతో బీసీ భవన్‌ ఏర్పాటు బీసీ గురుకుల పాఠశాలలు:వెనుకబడిన గురుకుల పాఠశాలల్లో 16,000 మంది బిసి విద్యార్ధులకు విద్య బీసీ సంక్షేమ పథకాలు:బీసీ విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్.బీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ఈబీసీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసంబీసీ వెల్ఫేర్ హాస్టళ్ళుబిసి స్టడీ సర్కిళ్లు, బాలబాలికల హాస్టళ్ళు.బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళుబీసీ గురుకుల పాఠశాలలుమహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విద్యానిధిహాస్టళ్లు, స్కూలు భవనాల నిర్మాణంవెనుకబడిన తరగతులకు సామాజిక భవనాల నిర్మాణంఏపీ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణాలుబీసీ అభ్యుదయ యోజనబిసి ఫెడరేషన్స్దోభీ ఘాట్ల నిర్మాణం Add new comment

రాష్ట్రంలో చాలా మంది శిశువులు బరువు తక్కువగా ఉండటం... వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారు. శిశు మరణాలను నివారించేందుకు, వారిని వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ’’ఎన్టీఆర్ బేబి కిట్స్‌’’ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రభుత్వం ఇచ్చేది రూ.772 విలువ చేసే వస్తువులు అయినా అంతకంటే ఎక్కువ విలువచేసే ఫలితాలు కనిపిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల శాతం మూడింతలయింది. ఇదంతా బేబి కిట్స్‌ వల్లనే కాకపోయినా... డెలవరీలు పెరగడానికి మాత్రం ఇదీ ఒక కారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. తల్లీబిడ్డలకు ఏకకాలంలో రక్షణ దొరుకుతుండటంతో.. బేబి కిట్స్‌ని అందించే ప్రభుత్వాస్పత్రులకు ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. పథకం అమల్లోకి వచ్చిన తరువాత డెలివరీల శాతం మూడింతలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి అంతగా సమకూరని శిశుదశని దాటేస్తే.. బిడ్డ ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ కీలక దశలో బేబికిట్స్‌ని అందించడం మంచి ఫలితాలను ఇస్తున్నదని, చిన్నారుల మరణాల శాతం తగ్గడానికి దోహదపడిందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెలివరీల కోసం ప్రజలు చేసే ఖర్చు 50 శాతం నుంచి 17 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. మరో ఏడాదికి ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూటికి 90శాతం మంది పేదలు చికిత్స చేయించుకొనే మిషనరీ ఆసుపత్రుల్లో సైతం బేబి కిట్స్‌ని అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ఏమేం ఉంటాయి.. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; బేబి కిట్స్‌లో బెడ్‌ కమ్‌ క్యారీ కిట్‌, టవల్‌, హ్యాండ్‌ వాష్‌, దోమ తెర వంటి నాలుగు వస్తువులుంటాయి. వీటిలో బెడ్‌ కమ్‌ క్యారీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉంచితే, తల్లి గర్భంలో శిశువుకు ఎలాంటి రక్షణ లభిస్తుందో, ఆ స్థాయి కవచంలా పనిచేస్తుంది. బయట వాతావరణం వల్ల శిశువులకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడటంతోపాటు, ముద్దు చేయడానికి ముందుకొచ్చే వారి నోరు, చేతుల్లోని ఇన్ఫెక్షన్‌ నుంచి చిన్నారులను రక్షిస్తుంది. కాటన్‌తో తయారు చేయడం వల్ల చిన్నారుల శరీరానికి హాయిని అందిస్తుంది. చిన్నారులకు స్నానం అనంతరం వాడటానికి టవల్‌ని కిట్‌లో ఉంచారు. పాలిచ్చే సమయంలో తప్ప.. తల్లులు బిడ్డల దగ్గర సాధారణంగా ఉండరు. ఏదో పని చక్కబెడుతూనే ఉంటారు. అటువంటివారి కోసం హ్యాండ్‌ వాష్‌ని ఉంచారు. పాలిచ్చే ముందు హ్యాండ్‌ వాష్‌తో చేతులు శుభ్రం చేసుకొంటే, ఎలాంటి సమస్యలూ దరికి చేరవు.   గత ఏడాది సెప్టెంబరు నుంచి జూలై చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో 2 లక్షల 25 వేల మంది డెలివరీ అయితే 2,05,200 మంది మహిళలకు బేబి కిట్లు అందించారు. ఈ పధకానికి బసవతారకం కిట్‌ అదనం. ఈ కిట్‌ విలువ రూ. 1000 పైన ఉంటుంది. ఇందులో బాలింతలకు అవసరమైన శానిటరీ న్యాప్‌కిన్స్‌, తలకు చుట్టుకొనే స్కార్ఫ్‌, బిడ్డకు పాలిచ్చేందుకు అనుకూలంగా ఉండే రెండు యాప్రాన్లు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రె్‌సలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకున్న వారికి రూ.1000 ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పధకం ఏంతో పారదర్శకంగా జరుగుతుంది... ఎవరికి కిట్ ఇచ్చారు, ఏ జిల్లలో, ఏ హాస్పిటల్ లో ఇచ్చారు, తల్లి, తండ్రి,బిడ్డ పేరుతో సహా, ఫోటో తీసి వెబ్సైటులో పెడతారు... ఏ రోజు , ఎవరు తీసుకున్నారు అనే వివరాలు అన్నీ తెలుస్తాయి... ఇక్కడ చూడవచ్చు http://hmfw.ap.gov.in/DH/NBK_DisWise_Reports.aspx Add new comment

బాబు అంటే భరోసా... బాబు అంటే నమ్మకం... బాబు అంటే బాధ్యత... ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్నదనే లక్ష్యంతో, బాలికా విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లాపరిషత, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థినులకు ‘బడికొస్తా’ పథకంతో సైకిళ్లు పంపిణీ చేస్తుంది. ఈ పథకానికి రూ.75 కోట్ల వ్యయమవుతోందని 1,81,556 సైకిళ్లు అందజేయనున్నారు. డ్రాపవుట్లను తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; నిజానికి, తొమ్మిదో తరగతిలోనే డ్రాపవుట్లు ఎక్కువ. కీలక అడుగు పడే సమయం ఇది. ఈ ఒక్క క్లాసు దాటేస్తే.. చదువులో ముందుకు వెళ్లిపోతారు. సరిగ్గా ఈ దశలోనే పిల్లల తల్లిదండ్రుల్లో ఊగిసలాట ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో ‘అడుగు ముందుకా- వెనక్కా’ అనేది తేలిపోయేది ఆ సమయంలోనే. ఈ విషయంలో ఆడపిల్లల పక్షా న నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ, మరోవైపు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్ర యాణం చేసేలా.. ఈ తరగతి బాలికల కోసం వినూత్న పథకం ప్రవేశపెట్టింది. 2017 ఆగష్టు నెల వరకు జిల్లాల వారిగా, సైకుళ్ళు తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళంలో 12,916 మందికి గాను, 7,228 మంది, విజయనగరంలో 9,874 మందికి గాను, 5,054, విశాఖలో 12,962 మందికి గాను, 12,159, తూర్పుగోదావరిలో 22,652 మందికి గాను, 21,300, పశ్చిమగోదావరిలో 16,841 మందికి గాను, 16,266, కృష్ణాలో 13,970 మందికి గాను, 13,569, గుంటూరులో 15,533 మందికి గాను, 15,507, ప్రకాశంలో 10,582 మందికి గాను, 6,100, నెల్లూరులో 9,674 మందికి గాను, 8,580, చిత్తూరులో 16,722 మందికి గాను, 16,722 (100 శాతం), కడపలో 9,257 మందికి గాను, 9,257(100 శాతం), కర్నూలులో 14,922 మందికి గాను, 14,111, అనంతపురంలో 15,581 మందికి గాను, 15,225 మంది బాలికులకు సైకుళ్ళ పంపిణీ జరిగింది. సైకిళ్ళు అందుకున్న ఆ పిల్లల ఆనందం వారి మాటల్లోనే వినండి... Add new comment

పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్ర లోని దాదాపు 12 లక్షల మందికి పైగా ఉన్న దివ్యాంగుల సర్వతొముఖాభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి పథకాలను అమలుచేస్తోంది. సమాజంలో వెనుకబాటుతనం అనుభవిస్తున్న దివ్యాంగులు ఇతరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. దీనిలో భాగంగా కాళ్లు పూర్తిగా లేని, నడుం కింది భాగం నుంచి పూర్తిగా పనిచేయని వారికి తోడ్పాటును అందించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా మూడు చక్రాల బైక్, బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను అందించే భృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు తమ కనీస అవసరాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉచిత వాహనాల పంపిణీ చేపట్టింది. దీనికోసం రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా దివ్యాంగుల కోసం అనే వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా అక్టోబరు 15వ తేదీ లోగా ఉచిత వాహనాలను పొందేందుకు అర్హులైన దివ్యాంగులు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా వాహనాల పంపిణీ పథకం అమలులో ఉన్నప్పటికీ కఠినమైన నిబంధనలతో పాటు కేవలం 50 శాతం సబ్సిడీ పై పీజీ విద్యార్హత కలిగిన వారికే వాహనాలను పంపిణీ చేయడం జరిగేది. ఈ విధంగా 2015-16 సంవత్సరంలో మోటరైజ్డ త్రీ వీల్స్ వెహికల్స్ 50 మందికి, 2016-17 సంవ త్సరంలో 47 మందికి అంద చెయ్యటం జరింగింది. google_ad_client = "ca-pub-9413360922451606"; google_ad_slot = "9748084172"; google_ad_width = 336; google_ad_height = 280; google_page_url = "http://www.amaravativoice.com/"; ఎలా అప్లై చేసుకువాలి ? పదవ తరగతి పాసైతే చాలు.గతంలో పీజీ చదుకున్నదివ్యాంగులకే మూడు చక్రాల బైక్ ను అందిస్తున్న ప్రభుత్వం మరింత మందికి లబ్దిని చేకూర్చే దిశగా తాజాగా విద్యార్హత నిబంధనలను సడలించింది. దీనితో రూ.75 వేల విలువ గలిగిన మూడు చక్రాల బైక్, లక్షరూపాయల విలువ గలిగిన బ్యాటరీ సహాయంతో నడిచే వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారు సవరించిన నిబంధనల ప్రకారం 10వ తరగతి పాసైతే చాలు. 18 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి కాళ్లలో 80 శాతం అంగవైకల్యం ఉందనే వైద్య ధృవీకరణ పత్రంతో పాటు పదవ తరగతి మార్కుల జాబితా, అంతకు మించి విద్యార్హతలు ఉంటే వాటి వివరాలు, ఆధార్, రేషన్ కార్డులు, కుల ఆదాయ, స్థానిక ధృవీకరణ పత్రాలు, డైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నవారు ప్రభుత్వం ప్రారంభించిన అధికారిక వెబ్ సైట్ (http://www.apdascac.ap.gov.in/) ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు అర్హులు ? మూడు చక్రాల బైక్లను పొందాలనుకునే వారికి చేతులు ధృడంగా ఉండటంతో పాటు నడుము క్రింది భాగంలో 80 శాతం వైకల్యం ఉండాలి. కానీ వీల్ చైర్ వాహనాలను పొందాలనుకునే వారికి నడుము పై భాగంలో కూడా వైకల్యం ఉండాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తరువాత వచ్చిన ధరఖాస్తులను కులంకషంగా పరిశీలించి, అర్హులైన దివ్యాంగులను ఎంపికచేసి, వారిలో 2,450 మందికి మూడు చక్రాల బైక్లు, 175 మందికి వీల్ చైర్ వాహనాలను అందజేయనున్నారు. మొత్తం 2625 వాహనాల పంపిణీ కోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.20.18 కోట్లు నిధులను కేటాయించింది... అలాగే అంధులకు కూడా ప్రత్యేక ల్యాప్‌ట్యా్‌పలు, కంప్యూటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. కీబోర్డుపై చేతితో టైప్‌ చేసే అక్షరాల శబ్దం వినిపించేలా వారికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీటిని అందిస్తారు. అలాగే, మూగ, చెవిటివారికి సెల్‌ఫోన్లు ఇవ్వనున్నారు. వీడియో కాలింగ్‌ ద్వారా సంజ్ఞలతో మాట్లాడుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. సమాజంలో మేమేమి తాక్కువ కాదు అని వీరు అనుకోకుండా, వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ, చిన్నచిన్న పనులు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశం... Add new comment