జంగాల వెంకటరమణ (టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి) చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం, అంగశెట్టిపల్లి గ్రామం. "ఓట్ల లెక్కింపులో నాకు గెలుపు ధృవీకరించారు. డిక్లరేషన్ అడిగేసరికి ఆర్వో, స్టేజ్-2 ఆఫీసర్ కొంతసేపు ఉండమని చెప్పారు. ఈ లోగా ఏ నాయకులు వచ్చారో తెలియదు, ఎమ్మెల్యే ఫోన్ చేసిన తర్వాత ఫలితం ఆపేసి, 3 గంటల నుంచి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన నాకు డిక్లరేషన్ ఇవ్వకుండా, తర్వాత అతడికి ఫోన్ చేసి నిలబెట్టేసి వాళ్లకిచ్చారు. 12 ఓట్ల మెజారిటీ వాళ్లకు ఇచ్చారు. నాకు 120 ఓట్ల మెజార్టీ ఉంది. రీకౌంటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేసినా నాకు చేయలేదు. దౌర్జన్యం చేస్తూ.. ప్రస్తుత మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా వచ్చి.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, రీకౌంటింగ్ చేసేది లేదని చెప్పారు. మమ్ముల్ని తరిమేసి వారికి డిక్లరేషన్ ఫాం ఇచ్చారు. మాకు అన్యాయం జరిగింది. న్యాయం చేయాలని ఆఫీసర్లను అడిగాను. కోర్టు నుంచి కూడా మేం నోటీసు పంపిస్తున్నాం. ఇంత అన్యాయమైన పాలన ఎప్పుడూ చూడలేదు. 7 వార్డులు మేం గెలిచినప్పటికీ ఇంతవరకు డిక్లరేషన్ ఫాం కూడా ఇవ్వలేదు. నాకు డిక్లరేషన్ ఇచ్చేముందుగా అతనికి ఇచ్చేసి 12 ఓట్ల మెజార్టీ అని చెప్పారు. మాకు న్యాయం చేయండి."

పూర్ణచంద్రరావు, చీఫ్ ఏజెంట్ (గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం). "నాలుగో దశ పోలింగ్ లో మా సర్పంచ్ టీడీపీ తరపున 58 ఓట్ల తేడాతో గెలిచారు. తర్వాత మమ్ముల్ని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రానీకుండా 2 గంటల పాటు రాళ్లదాడి చేశారు. పోలీసులు మాకు రక్షణ కల్పించారు. మళ్లీ ఈ రోజు సర్పంచ్ పై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. గతంలోనూ ఒకసారి ఇంటికొచ్చి కొట్టారు. పోలీసులు రావడం 5 ని. ఆలస్యమైతే సర్పంచ్ అభ్యర్థి గల్లంతయ్వేవాడు. మాకు రక్షణ కల్పించాలి." మేదరమెట్ల అనూరాధ, సర్పంచ్ అభ్యర్థి (గుంటూరు జిల్లా అమరావతి మండలం, ఉంగుటూరు గ్రామం). "నేను ఉంగుటూరు సర్పంచ్ గా గెలిచారు. గెలిచిన తర్వాత రాత్రి నుంచి మమ్ముల్ని బయటకు రానీకుండా, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మా ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. మేదరమెట్ల సోమశేఖర్(మాజీ సర్పంచ్) చంపేస్తామంటూ 70 మంది ఊరిపైకి వచ్చారు. మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు రక్షణ కల్పించి దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి".. స్వతంత్ర బాబు (సర్పంచ్ అభ్యర్థి) చిత్తూరు జిల్లా పలమనేరు మండలం, టీఒడ్డూరు గ్రామం. "మా గ్రామంలో వడ్డెర కులం ఎక్కువగా ఉంటుంది. 2107 ఓట్లకు గాను 1746 ఓట్లు పోలయ్యాయి. 9 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక వార్డు ఏకగ్రీవం అయింది. 7 వార్డుల్లో టీడీపీ మద్దతుదార్లు గెలిచారు. సర్పంచ్ కు వచ్చే సరికి గందరగోళం చేశారు. టీడీపీ మద్దతుదారునికి 720 ఓట్లు, వైసీపీ మద్దతుదారునికి 699 ఓట్లు, ఇండిపెండెంట్ కు 224 ఓట్లు, చెల్లనివి 77 ఓట్లు రాగా.. ఒక 25 ఓట్ల కట్ట మిస్సైంది... అది వైసీపీ మద్దతుదారుడిదే, కాబట్టి 4 ఓట్లతో డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. గ్రామస్థులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. రీకౌంటింగ్ చేయాలని చెప్పినా ఆర్వో తిరస్కరించారు. పైగా నాపై 353 కేసు పెట్టి వేధించారు. మా మద్దతుదారులపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. మా వార్డు మెంబర్లకు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితాలు అనౌన్స్ కూడా చేయలేదు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరపలేదు. మాకు న్యాయం చేయండి."

మోహనమ్మ (సర్పంచ్ అభ్యర్థి) (చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, తీర్థం గ్రామం). "మా గ్రామంలో మొత్తం 220 ఓట్లకు గాను 1933 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 682, వైసీపీకి 682 ఓట్లు వచ్చాయి. కృష్ణవేణి అనే ఆమెకు 527 ఓట్లు వచ్చాయి. నోటాకు 14 వచ్చాయి. చెల్లనివి 28 ఓట్లు. దీంతో కౌంటింగ్ చేస్తే చెరిసమానంగా వచ్చాయి. ఆర్వో చీటీలు వేద్దామని చెప్పారు. సరే అన్నాం. రెండు గంటలు వెయిట్ చేసి.. ఎమ్మార్వో, ఎండీవోను పిలిపించారు. మళ్లీ రీకౌంటింగ్ చేసి చెరొక ఓటు చెల్లలేదని చెప్పి పెండింగ్ లో పెట్టారు. దీంతో ఎండీవో మా మాటలు ఏం పట్టించుకోకుండా దౌర్జన్యంగా చెల్లనివి, నోటావి ఉన్న 42 ఓట్లలో 3 ఓట్లు వైసీపీకి కలిపారు. ప్రశ్నిస్తే.. బయట ఉన్న ప్రజలను పోలీసులు తరిమికొట్టారు. మేం లోపలే ఉండిపోయాం. మాకు ఫోన్ లేదు. మాకు విషయం చెప్పకుండా.. మరుసటి రోజు వైసీపీ 3 ఓట్ల తేడాతో గెలిచారని చెప్పారు. మాకు న్యాయం చేయాలి". మేకల విఠల్ రావు (సర్పంచ్ అభ్యర్థి) గుంటూరు జిల్లా అమరావతి మండలం, వైకుంఠపురం గ్రామం. "మా గ్రామ పంచాయతీ రాత్రి 12 వార్డుల్లో 3 వార్డులు టీడీపీ గెలిచింది. వార్డుల వారీగా చూస్తే వైసీపీ 100 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. సర్పంచ్ కు వస్తే టీడీపీ 17 ఓట్ల మెజార్టీ వచ్చింది. మాకు ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వకుండా, లోపలికి ఎవరినీ రానీకుండా చేశారు. వైసీపీ వారు లోపల సెల్ ఫోన్లు ఇచ్చారు. భారీ బలగాలను మోహరించి, కరెంట్ తీసి.. అందరినీ కొట్టారు. మేం భయపడకుండా అక్కడే ఉన్నాం. 2 గంటల తర్వాత మాకు ధృవీకరణ ఇచ్చారు. ఇప్పుడు మమ్ముల్ని బెదిరిస్తున్నారు. మాకు ఊరేగింపు కూడా లేకుండా వెళ్లాం. వైసీపీ వేధింపుల నుంచి మమ్ముల్ని కాపాడండి."

Advertisements

Advertisements

Latest Articles

Most Read